ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మికంగా బదిలీ అవ్వటం, అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో కూడా సంచలనంగా మారింది. అయితే దీని పై, తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఒక రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఇలా బదిలీ చేసి, ఆయన్ను అగౌరవపరిచారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ నాశనం అవుతున్నాయని, వ్యవస్థలను నిర్వీర్యం చేయడాన్ని అందరూ వ్యతిరేకించాలన్నారు. తన పట్ల, తన పార్టీ పట్ల సీఎస్ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసనీ, అయినా సరే ఈ తరహా చర్యలను వ్యతిరేకించాలని పేర్కొన్నారు. చంద్రబాబు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా, ఎల్వీ సుభ్రమణ్యం, ఆయన పై అగౌరవంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు అధికారాలు లేవు అంటూ సంచలన వ్యాఖ్యలు చెయ్యటమే కాక, నాలుగు, అయుదు విడతల రుణ మాఫీతో పాటుగా, సియం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఆపేసారు.

lv cbn 04112019 2

అయితే అవేమి మనసులో పెట్టుకోకుండా, ఈ రోజు ఎల్వీ సుభ్రమణ్యంకు జరిగిన అన్యాయం పై, చంద్రబాబు స్పందించారు. ఆయనకు మద్దతుగా వ్యాఖ్యలు చేసారు. మరో పక్క, ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని ఆకస్మికంగా ఎందుకు బదిలీచేశారో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని, టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యుడు, మాజీమంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్‌చేశారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్‌రెడ్డి, అడ్డగోలుగా అధికారులను ఉపయోగించుకొని, వారి అండదండలతో ఎంత సంపాదించారో చెప్పాల్సిన పనిలేదన్నారు. ఈ విషయం అచ్చెన్నాయుడుగా తాను చెప్పడం లేదన్న ఆయన, సీబీఐ, ఈడీ వంటి సంస్థలు, జగన్మోహన్‌రెడ్డికి సంబంధించిన కేసులవిచారణలో వేసిన అఫిడవిట్ల లోనే స్పష్టంగా పేర్కొన్నారన్నారు. ఎవరైతేఆనాడు, అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ సంతకాలు పెట్టారో, ఆ అధికారులందరూ కూడా ఇప్పటికీ కోర్టులచుట్టూ తిరుగుతున్న విషయాన్ని గమనించాలన్నారు.

lv cbn 04112019 3

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి హోదా సుబ్రహ్మణ్యం విషయం లో ఐదునెలల్లోనే ఆవిరవుతుందని తాము ఊహించలేదన్నారు. పిచ్చోడిచేతిలా రాయిలా, పిచ్చితుగ్లక్‌లా రాష్ట్రపాలన తయారైందనడానికి ఈ ఉదంతమే ఉదాహారణగా నిలుస్తుందన్నా రు. తానుచెప్పింది చెప్పినట్లుగా చేయడంలేదన్న అక్కసుతోనే ముఖ్యమంత్రి జగన్‌, సీఎస్‌ను అర్థంతరంగా బదిలీ చేశారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రులుగా, ఛీప్‌సెక్రటరీలుగా ఎవరున్నా సరే, బిజినెస్‌రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని మాజీమంత్రి స్పష్టంచేశారు. ఈమధ్యకాలంలో సీఎస్‌తో సంబంధంలేకుండా, ముఖ్యమం త్రి ఆదేశానుసారం ఆయనదగ్గర పనిచేసే కొందరు అధికారులు, కొన్నిజీవోలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా తానిచ్చిన ఆదేశాలపై స్పందించే అధికారం సీఎస్‌కు ఎక్కడుందంటూ, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారం సీఎస్‌కు ఎలా ఉంటుందంటూ ఆయన్ని బదిలీచేయడం జరిగిందని అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read