ఒక్కొక్కరిదీ ఒక్కో అభిమానం. కొంత మందికి కులాభిమానం, కొంత మందికి మతాభిమానం, కొంత మందికి ప్రాంతీయ అభిమానం. కొంత మందికి బాగా పని చేస్తారని అభిమానం. ఇలా రకరకాలుగా, ఒక రాజకీయ నాయకుడిని ప్రజలు అభిమానిస్తారు. కాని ఇక్కడ చెప్పుకునేది అంతకు మించి. ఎప్పుడో చంద్రబాబు చేసిన మంచికి, గుర్తు పెట్టుకుని, ఇప్పుడు కృతజ్ఞత చెప్పటానికి వచ్చింది ఈ అవ్వ. చంద్రబాబుని కలవాలి అంటే, ఆ సెక్యూరిటీ అంతా దాటుకుని వెళ్తే కాని కుదరదు. అదీ ఆమె ఎక్కడో మారు మూల చిత్తూరు జిల్లా. అదీ కాక ఆమెకు రెండు కళ్ళు లేవు. కాని చంద్రబాబు అధికారంలో ఉండగా, తనను ఒక పెద్ద కొడుకులా ఆదుకున్నారని, ఇప్పుడు ఆయన చిత్తూరు వచ్చారని, కలవటానికి వచ్చింది అంటే, ఆమె అభిమానం ఎలాంటిదో చెప్పుకోవచ్చు. ఆమె పేరు పాల్గుడి నాగమ్మ. చంద్రబాబు మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశాలకు వచ్చారని తెలుసుకుంది.
ఎలా అయినా, ఆయన్ను కలిసి, కృతజ్ఞత చెప్పాలని అనుకుంది. ఆమె గ్రామం అయిన నడింపల్లె నుంచి, తన మనువడితో చెప్పి, అక్కడకు తీసుకువెళ్ల మంది. ఆమెకు రెండు కళ్ళు లేకపోవటంతో, అక్కడ ఇబ్బంది పడతాం అని చెప్పినా, వినకుండా, మనువడిని తీసుకుని, చంద్రబాబు సమీక్ష చేస్తున్న ప్రదేశానికి వచ్చింది. ఆమెను చూసిన స్థానిక నాయకులు, ఆమె గురించి తెలుసుకుని, ఆమెను చంద్రబాబు వద్దకు తీసుకువచ్చారు. చంద్రబాబు ఆమెను ఆప్యాయంగా హద్డుకుని, ఆమె గురించి అన్ని వివరాలు ఆరా తీసారు. ఇంత కష్టపడి ఎందుకు వచ్చావ్ అని అడగగా, "రెండు కళ్లూ లేకపోయినా నీకోసం వచ్చానన్నా. నీమాటలు విందామని నా మనవడిని తీసుకొచ్చాను" అంటూ ఆమె చెప్పిన మాటలతో, ఒక్కసారిగా ఆ ప్రదేశం చప్పట్లతో మారుమోగింది.
నువ్వు ఉండగా, పెన్షన్ ను 200 నుంచి వెయ్యి రూపాయలు చేసావ్, మళ్ళీ వెయ్యి ను రెండు వేలు చేసావ్, ఆ డబ్బులు పెరిగిన దగ్గర నుంచి, నేను మందులకు , నా అవసరాలకు ఎవరి దగ్గర ఆదర పడటం లేదు. అప్పటి నుంచి జీవితం సుఖంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఓడిపోయి, కష్టాల్లో ఉన్నావ్, అందుకే ఇక్కడకు వచ్చి, కృతజ్ఞతగా నీ మాటలు విందాం అని వచ్చా, ఇక్కడకు వచ్చాక, నిన్ను కలిసే అవకాశం దక్కింది, నువ్వు నిండు నూరేళ్లు బతకాలి, మా లాంటి వారి తరుపున నిలబడాలి, ఆదుకొవాలి అంటూ నాగమ్మ చెప్పిన మాటలతో, ఒక్కసారిగా అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రెండు కళ్ళు లేకపోయినా, కేవలం చంద్రబాబు పట్ల కృతజ్ఞతతో, ఆమె ఇక్కడకు వచ్చింది. అందుకే అంటారు, మనం కాదు, మన పనులు మాట్లాడాలి అని. ఈ విషయంలో చంద్రబాబు ఎన్నికల్లో ఓడినా, ఇలాంటి లక్షలాది వృద్ధుల మనసు గెలిచినట్టే కదా...