చంద్రబాబు అధికారంలో ఉండగా, నవ్యాంధ్రకు మొదటి చీఫ్ సెక్రటరీగా చేసి, రిటైర్డ్ అయిన తరువాత కూడా, చంద్రబాబు చేత బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి ఇప్పించుకుని, తరువాత ఆ పదవిలో ఉంటూనే, చంద్రబాబుని తిడుతూ, వైఎస్ఆర్ పార్టీ వేసిన పోస్టర్స్ ను, తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా స్ప్రెడ్ చేస్తూ, చంద్రబాబు పక్కనే ఉంటూ, ఆయన్నే టార్గెట్ చేసారు, మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు. తరువాత విషయం బయటకు పొక్కటంతో, చంద్రబాబు ఆయన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మెన్ పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఐవైఆర్ కృష్ణా రావు, జగన్ ను అనుకూలంగా స్టేట్మెంట్ లు ఇస్తూ, అనునిత్యం చంద్రబాబుని ఏదో ఒక వంకతో విమర్శలు చేస్తూ, ఒక సామాజికవర్గంలో, చంద్రబాబు పై వ్యతిరేకత తేవటంలో, సక్సెస్ అయ్యారు. అమరావతి మీద వ్యతిరేక ప్రచారం చెయ్యటం దగ్గర నుంచి, తిరుమల వివాదాలు దాకా, అన్నిట్లో చంద్రబాబుని విసిగిస్తూ వచ్చారు.
అయితే ఇప్పుడు చంద్రబాబు దిగిపోయి, ఆయనకు ఇష్టమైన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి ఎక్కారు. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా, తనకు సహకరించిన వారి అందరికీ పదవులు ఇచ్చారు కాని, ఇప్పటి వరకు ఐవైఆర్ కు మాత్రం ఏమి ఇవ్వలేదు. మరి అది మనసులో పెట్టుకోనో, లేక బీజేపీకి దగ్గర అయ్యో కాని, ఐవైఆర్ నెమ్మిదిగా జగన్ ప్రభుత్వం పై విమర్శలు చెయ్యటం ప్రారంభించారు. ఇందులో భాగంగానే, ఎల్వీ సుభ్రమణ్యంను ఆకస్మికంగా బదిలీ చెయ్యటం పై, ఆయన తీవ్రంగా స్పందించారు. దేవాలయాల్లో పని చేస్తున్న అన్యమతస్తుల పై, ఎల్వీ ఉక్కు పాదం మోపినందుకే, ఈ బదిలీ అనే విధంగా, జగన్ పై డైరెక్ట్ అటాక్ కు దిగారు. అయితే, ఆయన ఈ విషయన్ని, కేవలం ఒక విమర్శతో ఆపలేదు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సహా, రాష్ట్రంలోని కొంత మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బదిలీలకు కనీస కాలపరిమితితో కూడిన భద్రత కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని ఐవైఆర్ కృష్ణారావు హైకోర్టులో పిటీషన్ వేసారు. చీఫ్ సెక్రటరీ పదవిలో ఉన్నవారిని రెండేళ్లు కొనసాగించాలని, క్యాబినెట్ సెక్రటరీ, కేంద్ర హోం కార్యదర్శి, డీజీపీల లాగానే, చీఫ్ సెక్రటరీకి కూడా రెండేళ్లు పదవిలో ఉండేలా ఆదేశాలివ్వాలని, ఆయన కోర్ట్ ని కోరారు. ఈ పిటీషన్ పై ప్రతివాదులుగా ఇంచార్జ్ సిఎస్, జీఏడీ ప్రిన్సిపాల్ సెక్రటరీ, కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, డీఓపీటీ కార్యదర్శులును చేర్చారు. అయితే ఈ పిటీషన్ వచ్చే వారం హైకోర్ట్ లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కనీస కాల పరిమితి పై గతంలో కూడా వివిధ రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.