ఈ రోజు స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆగ్రిగోల్ద్ విషయంలో, చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసారు తమ్మినేని. అగ్రిగోల్ద్ విషయంలో చంద్రబాబు, చేసినవి అన్నీ బయట పెడతామని అన్నారు. అన్ని విషయాలు ప్రజల ముందు ఉంచి, చంద్రబాబు గుడ్డలు ఊదదీస్తాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక్కడితో ఆగలేదు. చంద్రబాబు రాజకీయ అనుభవం గురించి మాట్లాడుతూ, చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని మడిచి ఎక్కడైనా పెట్టుకోవాలి అంటూ, జుబుక్సాకరంగా వ్యాఖ్యలు చేసారు. అయితే రాజకీయ విమర్శలు కూడా చెయ్యని స్పీకర్లు, ఇలా పరిధి దాటి మరీ, విమర్శలు చెయ్యటం పై, విమర్శలు ఎదురు అవుతున్నాయి. స్పీకర్ గా ఉంటూ, రాజకీయ విమర్శలు చెయ్యటం వరకు సరే కాని, ఇలా తిట్టటం ఏంటి అంటూ, విమర్శలు ఎదురు అవుతున్నాయి. స్పీకర్ వ్యాఖ్యల పై, అదే రకంగా ధీటుగా జవాబు చెప్పింది తెలుగుదేశం పార్టీ.

achhem 07112019 2

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కింజరపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. "బాధ్యతాయుతమైన స్పీకర్‌ పదవిలో ఉన్న తమ్మినేని సీతారామ్‌ రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటు. స్పీకర్‌ స్ధానాన్ని జగన్‌కి తాట్టు పెట్టి తమ్మినేని రాజకీయాలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుల్ని ఏ విధంగా ఏకవచనంతో మాట్లాడారో.. బయట సభల్లోనూ అదేపంథాను కొనసాగిస్తూ.. స్పీకర్‌ హోదాను దిగజారుస్తున్నారు. రాజకీయాలు మాట్లాడాలంటే తమ్మినేని సీతారాం స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి వైసీపీ అధికార ప్రతినిధిగా మారాలి. అంతేకానీ రాజకీయ ప్రయోజనాల కోసం స్పీకర్‌ స్ధానాన్ని దిగజార్చటం సరికాదు. అగ్రిగోల్డ్‌ ఆస్తులన్నీ జప్తు అయి కోర్టు ఆధీనంలో ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉన్న వాటి గూర్చి స్పీకర్‌ స్ధాయిలో ఉండి అసత్యాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం..? "

achhem 07112019 3

"సభాసాంప్రదాయాలను గాలికొదిలేసి తమ్మినేని కేవలం.. చంద్రబాబు గారిపై బురద చల్లే పనిలో ఉన్నారు. చంద్రబాబు కుటుంబంపై ఆరోపణలు చేస్తున్న తమ్మినేని.. దానిని ఆధారాలతో సహా నిరూపించగలరా..? ప్రజాప్రతినిధులమని చెప్పుకుంటూ.. తమ్మినేని చేస్తున్న విమర్శలు, ఆరోపణలు స్పీకర్‌ స్థాయినే దిగజారుస్తున్నాయి. అసెంబ్లీ నియమావళిని మంటగలుపుతున్న తమ్మినేనికి ట్రీట్‌ మెంట్‌ అవసరం. చట్టసభల్లో నిద్రపోవడం.. బయట రాజకీయ విమర్శలతో కాలక్షేపం చేయడం తమ్మినేనికి షరామామూలైంది. తమ్మినేని తీరుతో చట్టసభలపై ప్రజలకు గౌరవం పోతోంది. అగ్రిగోల్డ్‌ కుంభకోణం జరిగిందే వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో. అగ్రిగోల్డ్‌ ఆస్తులను పరిరక్షించి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేసిన చంద్రబాబుపై స్పీకర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. " అని కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read