రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు మొదలయ్యాయి. ఆర్ధికంగా, సామాజికంగా, విపరీత మార్పులు వస్తున్నాయి. బ్రతుకు మీద ఆశ పోతుంది. వీటి అన్నిటికీ కారణం ఇసుక కొరత. గత అయుదు నెలలుగా, జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఇసుక కొరతతో, భవన నిర్మాణ కార్మికులు అల్లాడి పోతున్నారు. దాదపుగా 40 లక్షల మందికి, ఈ ఇసుక కొరత డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వం ఎక్కడా స్పందించటం లేదు. మే 30న గద్దేనికిన జగన్, సెప్టెంబర్ 5 నాటికి, ఇసుక వస్తుందని, అప్పటి దాక ఇసుక బంద్ చేస్తున్నామని అన్నారు. అయితే, అప్పటి వరకు ఉన్న పాలసీని కొనసాగించాలాని కోరినా, జగన్ ఒప్పుకోలేదు. అయితే సెప్టెంబర్ 5 పోయి, నవంబర్ వస్తున్నా ఇంకా ఇసుక ఫ్రీ అవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న సమాధానం, వరదల వల్ల ఇసుక రావటం లేదని. అయితే వరదలు గట్టిగా, 3-4 జిల్లాల్లోనే ఉన్నాయి.

selfie 28102019 2

ఏది ఏమైనా ప్రభుత్వం సరిగ్గా స్పందించక పోవటంతో, భవన నిర్మాణ కార్మికుల జీవితాలు తారుమారు అయ్యాయి. ఈ అయుదు నెలలు, ఎలాగోలా, అప్పు చేసి, అది చేసి, ఇది చేసి నెట్టుకొచ్చామని, ఇక అప్పులు కూడా ఇచ్చేవారు లేరని, పస్తులు ఉంటూ, పెళ్ళాం బిడ్డలని బ్రతికించుకోలేక, తీవ్ర మనోవేదనకు గురై, బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు, మన రాష్ట్రంలో నలుగురు భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన చూస్తే, కళ్ళ వెంట నీళ్లు రాని వారు ఉండరు. ఆర్దిక ఇబ్బందులు తాళలేక ప్లంబర్ పోలెపల్లి వెంకటేష్ బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు, సేల్ఫీ వీడియో తీసి, తన కష్టాలు అన్నీ వివరించాడు.

selfie 28102019 3

పనులు లేక, కుటుంబాన్ని పోషించలేక, ఆర్దిక ఇబ్బందులలో మునిగిపోయి, చేతకాని వాడిలా చనిపోతున్నాను అంటూ, సేల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే బలవన్మరణానికి పాల్పడిన తరువాత ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ సమస్య పై ముందు నుంచి పోరాటం చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఈ విషయం పై ట్విట్టర్ లో స్పందించారు. ఆ కార్మికుడి సేల్ఫీ వీడియో పోస్ట్ చేసి, ప్రభుత్వాన్ని నిలదీశారు. "అయిదు నెలలుగా పనులు లేక, కుటుంబాలు పస్తులు ఉండడం చూడలేక మనోవేదనతో కార్మికులు బలవన్మరణాలు చేసుకోవడం మనసును కలచివేస్తోంది. సెల్ఫీ వీడియోలతో బలవన్మరణమే తమకిక శరణ్యంగా పేర్కొనడం చూసైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలి.పనులు కోల్పోయిన కార్మికులకు పరిహారం చెల్లించాలి." అని చంద్రబాబు ట్వీట్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read