వంశీ రాజీనామా విషయం ఇంకా సాగుతూనే ఉంది. నిన్న వంశీ వాట్స్అప్ లో, చంద్రబాబుకి రాజీనామా చేస్తున్న విషయాన్ని పంపించారు. అయితే, చంద్రబాబు దానికి రియాక్ట్ అవ్వరులే అని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు వంశీ రాసిన వాట్స్అప్ కి, మళ్ళీ తిరిగి మెసేజ్ చేసి, ఇలా వెళ్ళిపోవటం కరెక్ట్ కాదని, ధైర్యంగా ఎదుర్కోవాలని, కలిసి పోరాడదాం రండి అంటూ, బాల్ ని మళ్ళీ వంశీ కోర్ట్ లోకి నెట్టారు. దీని పై స్పందించిన వంశీ, ఇది వరకు దేవినేని నెహ్రు తో ఉన్న గొడవలు కాని, తరువాత ఐపీఎస్ సీతారామాంజనేయులుతో ఉన్న గొడవలు కాని ప్రస్తావిస్తూ, వాటిని ఎదుర్కున్నానని, ఇప్పుడు పరిస్థితి వేరని, కంటికి కనపడని శత్రువుతో పోరాడుతున్నా అంటూ, మళ్ళీ చంద్రబాబుకి రిప్లై ఇచ్చారు. అయితే, దానికి కూడా చంద్రబాబు మళ్ళీ స్పందిస్తూ, తిరిగి వంశీకి మరో వాట్స్అప్ మెసేజ చేసారు. చంద్రబాబు మళ్ళీ ఈసారి కూడా, వంశీ కోర్ట్ లోనే బాల్ వేసి, వంశీని రియాక్ట్ అయ్యేలా చేసారు.
మీరు చేసిన పోరాటాలు గుర్తు ఉన్నాయి. అప్పుడు పార్టీ కూడా మీకు అండగా నిలబడింది. ఇప్పుడు కూడా మీకు నిలబడుతుంది. మీకు మేము మద్దతుగా ఉంటాం. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో చర్చించండి. వారిని మీ వద్దకు పంపుతున్నాం. ప్రభుత్వ దుందుడుకు వైఖరికి వ్యతిరేకంగా పోరాడుదాం. అంటూ చంద్రబాబు మళ్ళీ వంశీకి వాట్స్అప్ మెసేజ్ చేసారు. అయితే, ఇప్పుడు వంశీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఆసక్తి నెలకొంది. వంశీ, ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో చర్చలు జరిపేందుకు ముందుకు వస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే, వంశీ గన్నవరంలో అందుబాటులో లేరని, వంశీ హైదరాబాద్ లో ఉన్నారని తెలుస్తుంది.
ఇది చంద్రబాబు రాసిన రెండో రిప్లై... "Dear Vamsi, Received your second whatsapp message and noted all the contents. You have recollected your historical affinity with the party. It is true. You have earlier fought fiercely against injustice with extension of support from the party and myself. In the same manner party and myself are solidly behind you in this current fight against injustice of present YSRCP Government. In this regard I am entrusting Sri Kesineni Nani, MP and Sri Konakalla Narayana Rao, Ex-MP to coordinate with you and chalk out an action plan for a united against the high handedness of the present Government. I am assure you to sort out all other problems. With warm regards... N. Chandrababu Naidu"