ప్రశాంత్ కిషోర్... జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అవ్వటం కోసం, చంద్రబాబుని డీ కొట్టటం కోసం, తన వల్ల, తన పార్టీ వల్ల కాక, బీహార్ నుంచి తెచ్చుకున్న పొలిటికల్ కన్సల్టెంట్. అయితే ప్రశాంత్ కిషోర్ వేసిన పాచికలు, చేసిన ప్రచారం, బాగా వర్క్ అవుట్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ, ప్రశాంత్ కిషోర్ చేసిన ఫేక్ ప్రచారాన్ని తట్టుకోలేక పోయింది. నిజాన్ని చెప్పటంలో ఫెయిల్ అయింది. దానిలో భాగంగానే, ఓటమి పాలు అయ్యింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రశాంత్ కిషోర్ పాత్ర మాత్రం, మొదటి స్థానంలో ఉంటుందనే చెప్పాలి. అయితే, ఎన్నికలు అయిన తరువాత, ప్రశాంత్ కిషోర్, జగన్ పార్టీని వదిలేసారు. కొత్త ప్రాజెక్ట్ లు చేసుకుంటూ, వెళ్ళిపోయారు. అయితే సరిగ్గా ఇలాంటి టైంలోనే, మళ్ళీ ప్రశాంత్ కిషోర్ పేరు రావటం, అదీ ప్రభుత్వంలోకి రావటం చూస్తుంటే, ఆశ్చర్యం కలుగక తప్పదు. జగన్ మోహన్ రెడ్డి, తనకు ఇష్టమైన వారికి, తనతో ఉన్న వారికి పదువులు ఇచ్చుకుంటూ వస్తున్నారు.

pk 29102019 2

ఇందులో భగంగా ఆంధ్రులని తిట్టిన అమర్ లాంటి వాళ్ళని, సాక్షిలో పని చేసిన రామచంద్రమూర్తి లాంటి వారిని కూడా ప్రభుత్వంలోకి తీసుకున్నారు. అయితే, పార్టీలో పని చేసిన వారికి, పదవులు ఇవ్వటం వరకు పరవాలేదు. ఇది అందరూ చేసేది, ఎప్పుడూ చేసేదే. అయితే, ఇప్పుడు ఒక కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ కిషోర్ వర్గానికి కూడా ప్రభుత్వంలో పోస్టింగ్ లు ఇవ్వటం సంచలనంగా మారింది. కన్సల్టెంట్ అనే వాడు డబ్బులు తీసుకుని పని చేస్తారు, కాంట్రాక్టు అయిపోగానే వల్లిపోతారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్న బ్రహ్మానంద పాత్రా అనే వ్యక్తికి, చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గా, ఐ అండ్ పీఆర్ సోషల్ మీడియా యూనిట్ లో వ్యక్తిగా చెప్తూ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది.

pk 29102019 3

అయితే ఇప్పుడు ఇక్కడ చర్చ మాత్రం, ఇలా కన్సల్టెంట్ లని, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తే, భవిష్యత్తులో వచ్చే అనేక అనర్ధాల గురించి. అసలు ఇలాంటి నియామకాల విషయంలో, ఐఏఎస్ లు అయినా, ప్రభుత్వానికి సరైన ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సింది. ఇలాంటివి నైతికంగా కరెక్ట్ కాదు అనే వాదన కూడా వస్తుంది. అయితే మరో పక్క వినిపిస్తున్న వార్తల ప్రకారం, ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయిన తరువాత, సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి అని గమించిన వైసిపీ దీనికి విరుగుడుగా, మళ్ళీ ప్రశాంత్ కిషోర్ నే సంప్రదించిందని, అందుకు అనుగుణంగానే, ఈ నియామకం జరిగిందని అంటున్నారు. మరో పక్క మాత్రం, ఇది ప్రశాంత్ కిషోర్ చేసుకున్న ఒప్పందంలో భాగమే అని అంటున్నారు. ఏది ఏమైనా, ప్రభుత్వాల ధోరణి ఇలా ఉండటం మంచిది కాదేమో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read