తెలుగుదేశం నాయకులు, సానుభూతిపరులు, కార్యాకర్తల పై దాడులు కొనసాగుతున్నాయి. గత అయుదు నెలలుగా, వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, అనేక ఒత్తిడులు ఎదురు అవుతున్నాయి అని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దాడులు చెయ్యటం, ఊరి నుంచి వెళ్ళగొట్టటం, ఆర్ధికంగా ఇబ్బందులు పెట్టటం, వ్యాపారాలు ఇబ్బంది కలిగించటం, పంటలు నరకటం, ఇళ్ళకు అడ్డుగా గోడలు కట్టటం, రోడ్లు తవ్వేయటం ఇలా అనేకం చేసారు. దీని పై తెలుగుదేశం పార్టీ పోరాటాలు చేసినా ఉపయోగం లేదు. దీంతో, తెలుగుదేశం పార్టీ, జాతీయ మానావ హక్కుల సంఘం దగ్గరకు కూడా వెళ్ళింది. అక్కడ నుంచి ఒక పోజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు పై, సమగ్ర దర్యాప్తు జరిపి, ఆరు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలి అంటూ, జాతీయ మానవ హక్కుల సంఘం, చీఫ్ సెక్రటరీ, డీజీపీని కూడా కోరింది. అయితే, ఇంత ఒత్తిడి ఉన్నా కూడా, వైసిపీ నేతలు ఆగటం లేదు. అధికారం ఉందనే ధీమాతో, ఇంకా ఎక్కువ కొనసాగిస్తున్నారు.
తాజాగా, అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితే నెలకొంది. వెంకటాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు నాగరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి మధ్య గత కొంత కాలంగా ఉన్న స్థలం వివాదం కాస్త , పార్టీ రంగు పులుముకుంది. ఈ స్థలం విషయంలో గ్రామంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుంది. అయితే, అధికారం మాది అని చెప్తూ, వైకాపా నాయకుడు పెద్దిరెడ్డి దౌర్జన్యంగా నాగరాజు ఇంటికి అడ్డుగా బండలు పాతాడు. నాగరాజు ఇంట్లో నుంచి బయటకు రాకుండా, బండ రాళ్ళు పాతారు. అయితే, విషయం తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు, ఆ బండలు పడగొట్టటానికి, దగ్గరలోని గ్రామాల నుంచి వస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే తెలుగుదేశం నాయకుడి స్థలం కబ్జా చేసి దౌర్జన్యం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రాళ్ళు తీపించకుండా, మమ్మల్ని అడ్డుకోవటం ఏంటి అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. రాష్ట్రంలో పరిస్థితితులు రోజు రోజుకీ దిగజారి పోతుంటే, డీజీపీ గారు మాత్రం, అంతా బాగుంది అని చెప్తున్నారని, టిడిపి ఆరోపిస్తుంది. నాలుగు నెలల క్రిందట, ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఇళ్ళకు వెళ్ళకుండా, అడ్డంగా వైసీపీ వర్గీయులు గోడ కట్టారు. దీంతో టీడీపీ సానుభూతిపరుల ఇళ్ళకు దారిలేకుండా పోయింది. అది సాక్షాత్తు హోం మంత్రి సొంత నియోజకవర్గం అయినా, ఇప్పటి వరకు ఆ గోడ తియ్యలేదు. ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా ఇళ్ళ మీదే పడ్డారు.