రాజకీయ పార్టీలకు ప్రచార పిచ్చి సహజం. తాము నిర్మించిన వాటిని, పది కాలాల పాటు ప్రజలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో, తమ పార్టీకి చెందిన వారి పేర్లు పెట్టటం, లేకపోతే తమ పార్టీకి సంబందించిన రంగులు వేయటం చూస్తూ ఉంటాం. ఇది కూడా ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా అనేక మందిని చూసిన ఈ రాష్ట్ర ప్రజలకు, ఇలాంటివి అప్పుడప్పుడు తగులుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఓక వింత పరిస్థితిని చూస్తున్నారు. ఈ ప్రచార పిచ్చని, తారా స్థాయికి తీసుకువెళ్ళింది వైసిపీ ప్రభుత్వం. ఎక్కడైనా తాము కట్టిన వాటికి రంగులు వేసుకోవటం చూసాం కాని, ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తున్న ప్రతి ప్రభుత్వ భవనానికి, రంగులు వేసేస్తున్నారు. ఏది పడితే అది, వైసిపీ రంగులతో మున్చేస్తున్నారు. ముందుగా పంచాయతీ భావనలకు ఈ రంగాలు వేయటం మొదలు పెట్టరు. అన్ని వర్గాల ప్రజలు వచ్చే పంచాయతీ ఆఫీస్ కి, ఇలా ఒక పార్టీ రంగాలు వేయటం చాలా ఎబెట్టుగా ఉంటుంది.
ఎన్ని విమర్శలు వచ్చినా, ఇలా ఏది కనిపిస్తే అది, ఆఫీస్, స్కూల్, స్మశానం, వాటర్ ట్యాంక్, వీధిలో ఉండే కుళాయి, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏది ప్రభుత్వ ఆస్తి అంటే వాటికి, ఇలా వైసీపీ రంగాలు వేసేస్తున్నారు. అయితే, రేపు పంచాయతీ ఎన్నికలు జరిగితే, ఎలక్షన్ కోడ్ వస్తే, ఏమి చేస్తారు అనే దానికి మాత్రం సమాధానం లేదు. మళ్ళీ వాటికి తెల్ల రంగు పుస్తారా ? అయితే, ఈ రోజు జరిగిన ఒక సంఘటన మాత్రం, దేశం ముందు ప్రతి ఆంధ్రుడు తల దించుకునేలా చేసింది ఈ ప్రభుత్వం. ఏకంగా జాతీయ జెండాను చెరిపేసి, వైసీపీ రంగులు వేస్తూ ఉన్న వీడియో వైరల్ అవ్వటంతో, దేశ వ్యాప్తంగా, అందరూ, మన ప్రభుత్వాన్ని తిడుతున్నారు. ఒక ప్రభుత్వం ఇలా చేయటం తప్పు అని అంటున్నూర్.
అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామంలో జాతీయ జెండా రంగు తొలగించి వైసీపీ జెండా రంగుని వేస్తున్న వైసీపీ నాయకులు.. ముఖ్యంగా అధికారులు ముందుండి గ్రామ సచివాలయం ఏర్పాటుకు రంగులు వేయిస్తున్నారు..అని సమాచారం. అయితే ఆ వీడియోలో రికార్డు అయిన మాటలు వింటే "జాతీయ జెండా రంగులు చేరిపేసేవారికి జెండా ఎగురవేసి అర్హత ఉందా" అని అక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. చేసిన మంచి చెప్పుకోవటంలో తప్పు లేదు కాని, ఇలా మన దేశ గర్వం అయిన, జాతీయ జెండాకే ఇలా అవమానం జరిగితే ఎలా అని, ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవ్వటంతో, దేశంలో అందరూ మన పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వమే, ఇలా చేస్తే, ప్రతి పౌరుడు ఆ అవమానం భారించాలిగా.... జగన్ మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా ఈ విపరీత పోకడలు మాని, ఈ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలి.