గన్నవరం నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక పక్క గన్నవరం ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేస్తారంటూ వార్తలు ఒక వైపు లీక్ చేస్తుంటే, మరో వైపు ఈ రోజు జగన్ గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇదే సందర్భంలో ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయిన వంశీకి పిలుపు రాలేదు. మరో పక్క వంశీ ఈ రోజు నియోజకవర్గ స్థాయి సమీక్షను టిడిపి కార్యాలయంలో చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏమి జరుగుతుందో అనే ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి వంశీని అరెస్ట్ చేస్తే ? లేకపోతే జగన్ సభలో వంశీ, టిడిపి అభిమానులు ఆందోళన చేస్తే ? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరో వైపు జగన్ పర్యటన సాఫీగా సాగిపోయేలా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసారు. వంశీని అరెస్ట్ చెయ్యాలి అనుకుంటే, జగన్ పర్యటన అయిపోయిన తరువాతే అరెస్ట్ చేసే అవకాసం ఉంది. ఇక మరో పక్క ఎమ్మెల్యే వంశీ కూడా అరెస్ట్ చేసే చేసుకోండి అనే విధంగా, తన కార్యాలయంలో కూర్చుని నియోజకవర్గ టిడిపి సీనియర్లతో సమీక్ష చేస్తున్నారు.
అయితే జగన్ పర్యటన ఉన్న రోజే, వంశీ బయటకు రావటం పై, పోలీసులు అలెర్ట్ అయ్యారు. జగన్ వైఖరి పై నిరసన ఏమైనా తెలిపే అవకాశం ఉందా, అనే విధంగా పోలీసులు ఆలోచిస్తున్నారు. మూడు రోజుల క్రితం వంశీ పుట్టిన రోజు అయినా, కార్యాలయానికి రాలేదు. దీంతో కేసుకు భయపడి వంశీ పారిపోయారు అంటూ ప్రచారం చేసారు. దీంతో వంశీ ఈ రోజు, ఆఫీస్ లోనే కూర్చుని, ఆ ప్రచారం చేస్తున్న వారి నోరు మూయించారు. మరో పక్క, నకలీ పట్టాలు సృష్టించారు అంటూ వంశీ పై నమోదు అయిన కేసులు, ఆయన్ను అరెస్ట్ చెయ్యటానికి, పోలీసులు సిద్ధం అయ్యారు. ఇప్పటికే స్పీకర్ నుంచి కూడా అనుమతి తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో జగన్ పర్యటన అయిపోగానే, వంశీని అరెస్ట్ చేసే అవకాసం ఉంది.
అయితే ఇప్పటికే వంశీ హైకోర్ట్ లో ఈ కేసు పై పిటీషన్ వేసారు. నిన్నే కోర్ట్ నుంచి ఉత్తర్వులు వస్తాయి అని అనుకున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం లోపు, కోర్ట్ కు ఈ విషయం పై ఒక జడ్జిమెంట్ ఇచ్చే అవకాసం ఉంది. ఇవన్నీ ఇలా సాగుతూ ఉండగానే, వంశీ పార్టీ మారిపోతున్నారు అంటూ మరో ప్రచారం కూడా సాగుతుంది. జగన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆయన బీజేపీ లోకి వెళ్ళిపోతున్నారని, ఇప్పటికే తనకు గాడ్ ఫాదర్ అయిన సుజనా చౌదరిని కలిసారనే ప్రచారం జరుగుతుంది. దీని పై వంశీ స్పందిస్తూ, తాను టిడిపి ప్రతిపక్షంలో ఉండగా రాజకీయాల్లోకి వచ్చానని, సీతారమంజనీయులు సీపీగా ఉండగా, తనను ఎంతో ఇబ్బంది పెట్టారని, మొన్న ఎన్నికల్లో కూడా ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసని, తాను ఈ ఒత్తిళ్లకు భయపడను అని, కోర్ట్ లో తేల్చుకుంటానని, పార్టీ మారాను అని చెప్తున్నారు..