ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, అసహనం తారా స్థాయిలో ఉంది. ప్రభుత్వం పై చిన్న విమర్శ వచ్చినా తట్టుకోలేక పోతున్నారు. ఇటు పత్రికలు, ఛానెల్స్ అయినా, ఇటు సోషల్ మీడియాలో సామాన్యుడి వాయిస్ అయినా. ఎక్కడ విమర్శ వస్తే అక్కడ, వారి పై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో, తమకు వ్యతిరేకంగా రాసిన వారి పై కేసులు పెట్టి, అరెస్ట్ చేస్తున్నారు. ఇక మీడియా విషయానికి వస్తే, తమకు అనుకూలంగా కధనాలు ఇవ్వకుండా, వ్యతిరేకంగా కధనాలు ఇస్తున్నారని, ఏబీఎన్, టీవీ5 ఛానెల్స్ ను, రాష్ట్రంలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవి అధికారిక ఉత్తర్వులు కావు. అనాధికారిక ఆదేశాలతో, ఎంఎస్‌వోలను బెదిరించి, ఈ రెండు ఛానెల్స్ ఆపెసారనే వార్తలు వచ్చాయి. ఎంఎస్‌వోలు మాత్రమే కాదు, చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిపే ఏపి ఫైబర్ నెట్ లో కూడా, ఈ ఛానెల్స్ ఆపేశారు.
అయితే ఈ రెండు ఛానెల్స్ టెలికాం రెగ్యులేటరీ బోర్డు అయిన, టీడీశాట్ వద్దకు వెళ్లి, ఏపి ప్రభుత్వం పై కంప్లెయింట్ చేసాయి. అయితే దీని పై గత నెల రోజులుగా విచారణ జరుగుతుంది. ఏపి ఫైబర్ నెట్ పై, టీడీశాట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రోజుకి రెండు లక్షల ఫైన్ కట్టమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఏపి ఫైబర్ నెట్ మాత్రం, టీడీశాట్ కి చెప్పిన విషయం ఏమిటి అంటే, సాంకేతిక కారణాల వల్ల, ఆ ఛానెల్స్ ఇవ్వలేక పోతున్నాం అని. అయితే టీడీశాట్, వీరి మాటలు విశ్వసించలేదు. 22 లోపు ప్రసారాలు ఇవ్వకపోతే, మీ ఆఫీస్ కు వచ్చి, ఆ సాంకేతిక సమస్య ఏమిటో చూస్తామని చెప్పింది. దీంతో ఏపి ఫైబర్ నెట్, హడావిడిగా, నిన్న 22న, ఏపి ఫైబర్ నెట్ లో, ఏబీఎన్, టీవీ5 ప్రసారం చేసింది. అయితే, ఈ విషయం ట్రిబ్యునల్ కు చెప్తూ, మేము ప్రసారాలు ప్రారంభించామని, జరిమానా విధంచవద్దు, మేము ఆర్ధిక కష్టాల్లో ఉన్నాం అని టీడీశాట్ కు చెప్పింది.
దీని పై ఘాటుగా స్పందించింది టీడీశాట్. మా, ఆదేశాల అమలులో జాప్యం చేసినందున జరిమానా చెల్లించి తీరాల్సిందేనని, దీని నుంచి తప్పించుకోలేరని ఏపి ఫైబర్ నెట్ కు స్పష్టం చేశారు. మీ నుంచి సంతృప్తికర సమాధానం రాలేదని ఆగహ్రం వ్యక్తం చేసింది. జరిమానా ఎందుకు విధంచకూడదో చెప్పాలని, ఏపి ఫైబర్ నెట్ ను కోరుతూ, నవంబర్ 14కి వాయిదా వేసింది. అయితే ఎంఎస్‌వోల విషయంలో కూడా టీడీశాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబరు 18న, 24న ఆదేశించినా, నిన్నటి వరకు ఛానెల్స్ ఇవ్వకపోవటంతో, ఎంఎస్‌వోలకు ట్రైబ్యునల్ జరిమానా విధించింది. రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాలు పాటించినందుకు, మాకు జరిమానా పడింది అని, ప్రభుత్వం పెద్దలేమో, ఆ చానల్స్ వస్తే, కేబుల్ లేకుండా చేస్తామని బెదిరించారని, ఇప్పుడు ట్రిబ్యునల్ మాకు ఫైన్ వేసిందని, మధ్యలో మేము బుక్ అయ్యాం అని వారు బాధ పడుతున్నారు.