ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా తయారు అయ్యిందా ? ఒక పక్క ఆదాయం లేక, ఇష్టం వచ్చినట్టు సంక్షేమ కార్యక్రమాలతో, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోతుంది. ఈ రోజు ఒక ప్రముఖ దిన పత్రికలో వచ్చిన వార్త చూస్తే, మన రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ తెలుస్తుంది. ఆ ప్రముఖ పత్రిక కధనం ప్రకారం, రాష్ట్ర అప్పులు తారా స్థాయికి చేరుకున్నాయి. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, రాష్ట్ర ప్రభుత్వం రుణాలను వాదేసుకుంటుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు విలువ అక్షరాల రూ.33,617 కోట్లు. ఈ అప్పు అంతా, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందే. గతంలో చంద్రబాబు పై, అప్పులు చేస్తున్నారు అంటూ, ప్రతి రోజు ప్రచారం చేసి చేసి, ఇప్పుడు కేవలం ఆరు నెలల సమయంలోనే, 33 వేల కోట్లు అప్పు చేసి, అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పటికే రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా కూడా, ఏపి ఆర్ధిక పరిస్థితి ఆందోళన కరంగా మారిందని, కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఈ అప్పులు వార్త చూస్తే, రాష్ట్ర పరిస్థితి పై ఆందోళన కలగక మానదు. రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా, ప్రతి వారం, మార్కెట్ బారోయిరగ్స్ ద్వారా రుణాలకు, వేలం నిర్వహిస్తుంది. వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వాల సెక్యూరిటీలను తనఖా పెట్టి, లోన్స్ ఇస్తూ వస్తుంది. అయితే గత నెల, అంటే నవంబర్ నెలలో, అయుదు సార్లు, ఇలా వేలం నిర్వహించగా, అయుదు సార్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వేలంలో పాల్గుని, అయుదు సార్లు రుణాలు పొందింది. ప్రతి వేలంలోను ఒకేసారి రుణం తీసుకోకుండా, రెండేసి సార్లు రుణాలు తీసుకుని, సరి కొత్త రికార్డును, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు చెయ్యని విధంగా, అప్పుల్లో రికార్డు సృష్టించింది, అందర్పదేశ్ ప్రభుత్వం.
నవంబర్ ఒకే తేదీణ, తొమ్మిదేళ్ల కాలపరిమితితో వెయ్యి కోట్లు, 12 సంవత్సరాల కాల పరిమితితో వెయ్యి కోట్లు, నవంబర్ 7న 10, 12 సంవత్సరాల కాల పరిమితితో రెండు వేల కోట్లు, నవంబర్ 15న 11, 12 సంవత్సరాల కాలపరిమితితో రెండు వేల కోట్లు, నవంబర్ 22న అదే పరిమితితో మరో రెండు వేల కోట్లు రుణంగా తీసుకురది. ఇక నవరబర్ 29న పదేళ్ల కాలపరిమితితో 533 కోట్ల రూపాయలను రుణంగా తీసుకురది. మొత్తంగా పోయిన నెల నవంబర్లో, ఒక్క నెలలోనే రూ.8,513 కోట్ల అప్పు తీసుకుని, మొత్తం ఈ ఆరు నెలల్లో 33,617 కోట్ల అప్పుని రాష్ట్రం చేసింది. అయితే ఇక, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇంకా నాలుగు నెలలు ఉండగా, ఇకపై రాష్ట్రానికి కేవలం ఏడు వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకునే అవకాసం ఉంది. మరి జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆదాయం ఎలా పెంచుతారో, ఏమిటో చూడాలి.