తెలంగాణాలోని, శంషాబాద్‌ ప్రాంతంలో, జరిగిన ఘటన పై, దేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. దిశ  ఘటన పై, ఈ రోజు పార్లమెంట్‌లో అన్ని పార్టీలు లేవనెత్తి, ఈ చర్యను ఖండించారు. జీరో అవర్‌లో దిశ ఘటన పై, అన్ని పార్టీల ఎంపీలు చర్చలో పాల్గుని, జరిగిన ఈ ఘటనను ఖండించారు. ఇలాంటి ఘటనలు జరిగితే, నిందితులకు వెంటనే మరణశిక్ష విధించాలని, ఇలాంటి ఘటనలు చెయ్యాలి అంటే, భయపడేలా చట్టాలు ఉండాలని, మనం అందరం అలాంటి చట్టం చెయ్యాలని, వివిధ ఎంపీలు కోరారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా, అనేక మంది ఎంపీలు ఈ చర్చలో పాల్గుని, తమ అభిప్రాయాలు తెలియ చేస్తూ, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా, తీసుకోవాల్సిన చర్యల పై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి, నిందితులను వెంటనే, ఆరు నెలల లోపే శిక్షించాలని, మన చట్టాలు అలా మారాలని, ఎంపీలు సలహా ఇచ్చారు.

madhav 02122019 2

అయితే ఇంత సీరియస్ గా లోక్‌సభలో జస్టిస్ ఫర్ దిశపై చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎంపీ ఒకరు నిద్రపోతూ కనిపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా మహిళల పై జరుగుతున్న దాడుల పై సీరియస్ గా చర్చ  జరుగుతున్న సమయంలో, ప్రజల తరుపున మాట్లాడాల్సిన ఒక ఎంపీ నిద్రపోవడం పై, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇంటర్నెట్ లో ఒక రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. జాతీయ మీడియాలో కూడా, ఈ అంశం చూపిస్తూ, ఇది మన యంపీల తీరు అంటూ, చూపిస్తున్నారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు అనుకుంటున్నారా.  ఇంత సీరియస్ సబ్జెక్టు పై చర్చ జరుగుతుండగా, వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, పార్లమెంట్ లో హాయిగా నిద్రపోతూ కనిపించారు.

madhav 02122019 3

ఆ ఫొటోలు, వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈయన గతంలో పోలీస్ ఉద్యోగం కూడా వెలగబెట్టాడు, ఇలాంటి వారు కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి సీరియస్ గా లేకుండా, నిద్ర పోవటం ఏంటి అంటూ, విరుచుకు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా, ఈ విషయం పై స్పందిస్తూ, ఇలా పోస్ట్ పెట్టింది. "రాష్ట్ర సమస్యల గురించి ఎలాగో మాట్లాడరు. దేశ సమస్యల పై కూడా ఇదే వైఖరి. దేశం మొత్తం, నినదిస్తున్న 'దిష' ఘాతుకం పై పార్లమెంట్ లో చర్చ సందర్భంలో, ఈ వైసీపీ ఎంపీ చూడండి, ఎలా గుర్రు పెట్టి నిద్ర పోతున్నారో. పాపం ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం, మెడలు వంచీ వంచీ, అలిసి పోయారు అనుకుంటా. ఇలాంటి వారి తీరుతో, ఆంధ్రప్రదేశ్ పరువు, జాతీయ స్థాయిలో గంగలో కలుస్తుంది."

Advertisements

Advertisements

Latest Articles

Most Read