మొన్నటి దాక నెమ్మదిగా సాగిన జగన్ అక్రమసస్తుల కేసు విచారణ, గత రెండు నెలలుగా స్పీడ్ అందుకుంది. ముఖ్యంగా జగన్ కు ప్రతి శుక్రవారం కోర్ట్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో, సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ చూస్తే, సిబిఐ ఇంత గట్టిగా వాదనలు వినిపించటం పై అందరూ ఆశ్చర్యపోయారు. సియం అయినా, సామాన్య ప్రజలు అయినా చట్టం ముందు ఒకటే అంటూ, సిబిఐ వాదనలు వినిపించింది. జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు సియం అని, ఆయన సాక్ష్యులను ప్రభావితం చేస్తారు అంటూ, వాదనలు వినిపించిటంతో, సిబిఐ వాదనలతో ఏకీభివించిన కోర్ట్, జగన్ మినహాయింపు పిటీషన్ కొట్టేసింది. మరో పక్క అన్ని చార్జ్ షీట్లు కలిపి, ఒకే పిటీషన్ గా విచారణ జరపాలి అంటూ, జగన్ పెట్టుకున్న పిటీషన్ పై కూడా, సిబిఐ పోయిన శుక్రవారం బలంగా వాదనలు వినిపించింది. నేరాలు అన్నీ వేరు వేరు అని, వేరు వేరు వ్యక్తులు ఈ నేరాల్లో ఉన్నారని, కాబట్టి ఒక్కో చార్జ్ షీట్, విడివిడిగా విచారణ జరపాలి అంటూ, కోర్ట్ ముందు సిబిఐ వాదనలు వినిపించింది.
ఇంత బలంగా సిబిఐ వాదనలు జరుపుతున్న వేళ, ఇప్పుడు సీన్ లోకి ఈడీ కూడా ఎంటర్ అయ్యింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన ఆస్తుల పై, నాలుగు నెలల క్రితం కోర్ట్ లో జగన్ కు రిలీఫ్ రావటంతో, దీని పై ఈడీ ఇప్పుడు మళ్ళీ కోర్ట్ గడప తొక్కింది. గతంలో భారతి సిమెంట్స్ వ్యవహారంలో రూ.749 కోట్ల ఆస్తులు జప్తు చేస్తూ, ఈడీ డిప్యూటీ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంట్లోనే జగన్, ఆయన కంపెనీలకు చెందిన రూ.569.57 కోట్లు, జగన్ భార్య భారతికి చెందిన రూ.22 కోట్ల ఆస్తులను ఈదీ జప్తు చేసింది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన తాత్కాలిక జప్తు ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ధ్రువీకరించింది.
అయితే దీని పై జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతితో పాటుగా, వారి కంపెనీలు అయిన సండూర్ పవర్, సిలికాన్ బిల్డర్స్, యుటోపియా ఇన్‌ఫ్రా, అప్పీలెట్ అథారిటీని ఆశ్రయించి, ఆస్తుల జప్తు నుంచి విముక్తి కల్పించాలని కోరాయి. దీని పై విచారణ జరిపిన అప్పీలెట్ అథారిటీ, ఈదీ చేసిన జప్తు చెల్లదు అంటూ తీర్పు ఇచ్చింది. అయితే, నాలుగు, అయుదు నెలలు క్రిందట జరిగిన ఈ విషయం పై, ఈడీ ఇప్పుడు మళ్ళీ కోర్ట్ కు వెళ్ళింది. అప్పీలెట్ అథారిటీ ఇచ్చిన తీర్పుని, హైకోర్ట్ లో సవాల్ చేసింది. దీని పై విచారణ ప్రారంభించిన హైకోర్ట్, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రస్తుత స్థితి కొనసాగించాలని చెప్తూ, జగన్, భారతి, కంపెనీలకు తదితరులకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు ఈడీ కూడా ఇంత బలంగా, వాదనలు వినిపించటం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.