గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 15 రోజుల క్రితం వరుసగా రెండు ప్రెస్ మీట్లు పెట్టి, తెలుగుదేశం పార్టీని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వివిధ టీవీల్లో మాట్లాడుతూ, చంద్రబాబు పై కూడా పౌరుషంగా మాట్లాడారు. అయితే తరువాత తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు తిప్పి కొట్టటం, వంశీ దాని పై మళ్ళీ స్పందించటం ఇవన్నీ జరిగి పోయాయి. అయితే ఆ సందర్భంలో వంశీ మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన కూడా పోలేదు అని, ఇప్పుడే విమర్శలు చేస్తున్నారని, అసలు ఇసుక ఇప్పుడు ఎలా తీస్తారు అంటూ ప్రశ్నించారు. ఒక ఒక్క వరదలు ఉండి, నదులు ఒప్పొంగుతున్నాయి, ఎలా ఇసుక తీస్తారు అంటూ వంశీ ప్రశ్నిస్తూ, చంద్రబాబు నేనే ఫోన్ కనిపెట్టా, నేనే కంప్యూటర్ కనిపెట్టా అని చెప్తూ ఉంటారు కదా, ఆయనకు ఏమైనా తెలిసిన టెక్నాలజీ ఉంటే చెప్పండి, వరదల్లో కూడా ఇసుక బయటకు తీస్తారు అంటూ వంశీ విమర్శలు గుప్పించారు. వంశీ వ్యాఖ్యల పై చంద్రబాబు నిన్న కడప జిల్లా సమీక్షలో మాట్లాడారు.
"ఒకాయిన అంటాడు, వరదల్లో కూడా ఇసుకను తీసే టెక్నాలజీ చంద్రబాబు వద్ద ఉందేమో చెప్పండి అంటూ వెటకారం చేస్తున్నాడు. వరదలు ఏమైనా కొత్తా, పక్క రాష్ట్రాల్లో వరదలు లేవా, ఇక్కడ ఇసుక కొరత ఎందుకు ఉంది అని ప్రశ్నించారు. నేను టెక్నాలజీ మీకు ఇవ్వనవసరం లేదు, బోటు తియ్యలేని మీరు, ధర్మాడి సత్యాన్ని తెచ్చుకున్నారు కదా, అతనికి చెప్పండి, ఆటను టీంతో కలిసి, ఇసుక తీసి పెడుతారు. మీకు చేతకానికి ధర్మాడి సత్యం చేస్తారు. దీనికి టెక్నాలజీ ఏమి అవసరం లేదు అంటూ" చంద్రబాబు వంశీకి కౌంటర్ ఇచ్చారు. ఇసుక కొరత వరదల వల్ల అని చెప్పి తప్పించుకుంటున్నారని, నిజానికి వీళ్ళు ఇసుకను బ్లాక్ లో అమ్ముకుంటూ, ప్రజలకు ఇసుక లేకుండా చేస్తున్నారని అన్నారు. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/oPScNvPksMw
అలాగే పార్టీ గురించి మాట్లాడుతూ, నాయకులు పార్టీలు మారుతున్నా ఏమాత్రం ఆత్మ స్టైర్యం దెబ్బతినకుండా తెదేపా వెన్నంటే నడుస్తున్న కార్యకర్తలే పార్టీకి భవిష్యత్తని చంద్రబాబునాయుడు పేర్కొన్నట్లు నియోజకవర్గ బాధ్యుడు కస్తూరి విశ్వనాథనాయుడు దిశాని పేర్కొన్నారు. పార్టీ అధినేత ఆధ్వర్యంలో సోమవారం కడపలో నియోజకవర్గాల సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమానికి రైల్వేకోడూరు నియోజకవర్గ నేత పంతగాని నరసింహ ప్రసాద్, రాజంపేట బాధ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగలరాయుడుతోపాటు ఐదు మండలాలకు చెందిన ప్రధాన నాయకులు, క్రియాశీల కార్యకర్తలు పాల్గొన్నారు. గత ఎన్ని కల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై సమీక్ష జరిగినట్లు వారు చెప్పారు. పోలింగ్ కేంద్రం స్థాయి నుంచి ఆరా తీసిన చంద్రబాబు ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద నాయకులు పనిచేసినప్పటికీ ప్రతిసారీ -కోడూరులో పార్టీ అభ్యర్థి ఓడిపోతుండడం విచారకరమన్నారు. వర్గ రాజకీయాలు, ఇతర నాయకత్వ లోపాలపై ఆయన దృష్టికి -రేశం తీసుకెళ్లారు. విభేదాలు పక్కన పెట్టి కలసికట్టుగా ముందుకు సాగితేనే భవిష్యత్తు ఉంటుందని, అలాగే కొనసాగితే కార్యకర్తల కోసం నాయకులను వదులుకోవడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించినట్లు వారు వివరించారు. పార్టీ ఎవరిని నాయకులుగా నియమిస్తుందో మిగతావారు వారిని అనుసరించినప్పుడే క్రమశిక్షణతో ముందుకు వెళ్లగలమని చెప్పారన్నారు.