చంద్రబాబు అమరావతి పర్యటనతో, అమరావతి 29 గ్రామాల్లో ఉన్న వైసీపీ సానుభూతి పరులు, చంద్రబాబును అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసి విఫల యత్నం చేస్తున్నారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు పై, రాళ్ళ దాడి కూడా చేసారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు అద్దం కూడా పగుళ్ళు వచ్చింది. అయినా ఎక్కడా దడవకుండా చంద్రబాబు ముందుకే వెళ్తున్నారు. నేను రాజధాని రైతుల తరుపున పోరాడటానికి వచ్చాను, పార్టీలకు అతీతంగా రైతులు నష్టపోతున్నారు, అలాంటిది నన్ను రావద్దు అని రైతులు ఎందుకు అడ్డుకుంటారు, వారు వైసీపీ పెట్టిన పైడ్ ఆర్టిస్ట్ లు అని వారి మొఖం చూస్తూనే అర్ధమవుతుందని చంద్రబాబు అన్నారు. నాలుగు రోజుల నుంచి మంత్రులు మాట్లాడుతున్న మాటలు చూస్తూనే, ఇలాంటిది ఏదో ప్లాన్ చేసారని అర్ధమవుతుందని అన్నారు. నేను ప్రతిపక్ష నాయకుడుని అని, మాజీ ముఖ్యమంత్రిగా చేసానని, తనకు ఎక్కడైనా పర్యటించే స్వెఛ్ ఉందని, ఈ ప్రభుత్వం ఆ వాతావరణం కల్పించాలని చంద్రబాబు అన్నారు.

bus 28112019 2

వీరి ఉడత ఊపులకు భయపడేది లేదని, అమరావతిని ఎలా చేసారో, ఈ ఆరు నెలల్లోనే ఎంత నాశనం చేసారో, ఈ దేశానికి చూపించే, వెనక్కు తిరుగుతానని చంద్రబాబు అన్నారు. మరో పక్క పోలీసులు కూడా, ఎక్కడికక్కడ వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నీచమైన కుట్రలకు వైసీపీ ప్రభుత్వం తెరలేపింది అని చంద్రబాబు అన్నారు. రాజధాని పట్ల ఐదు కోట్ల ఆంధ్రులకు ఉన్న భావోద్వేగాలు వైసీపీ వాళ్లకు తెలుసని ఆయన అన్నారు. అందుకే ఒక పథకం ప్రకారం దుష్ప్రచారాలు చేసి అమరావతిని క్రమక్రమంగా చంపాలన్న నీచమైన కుట్రలకు వైసీపీ తెరతీసిందని చంద్రబాబు అన్నారు. ఆ కుట్రలను బయటపెట్టేందుకే తాను అమరావతిలో పర్యటిస్తున్నానన్నారు.

bus 28112019 3

మరో వైపు జరుగుతున్న పరిణామాలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. తెలుగుదేశం శ్రేణులు కూడా పెద్ద ఎత్తున రావటంతో, ఇరు వర్గాల మధ్య గొడవలు జరగకుండా, రాయపూడి ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చేది ప్రజా సమస్యల పోరాటానికి అని, అప్పట్లో చంద్రబాబు ఇలాగే అనుకుని ఉంటే, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే వారా అని ప్రశ్నిస్తున్నారు. మొన్న చలో ఆత్మకూరు కూడా ఇలాగే చేసారని, ఇసుక దీక్షకు స్టేడియంలో పర్మిషన్ ఇవ్వలేదని, గుర్తు చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read