రాష్ట్రంలో గవర్నర్, సియం తరువాత, అత్యంత పెద్ద పదవిలో ఉన్న స్పీకర్ పైనే, క్రిమినల్ కేసు పెట్టాలని, కేసు నమోదు చెయ్యాలని, ఫిర్యాదు చేసారు ఒక మహిళా నేత. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం పై, విజయవాడ కమీషనర్ ఆఫీస్ కు వెళ్లి మరీ కంప్లెయింట్ చెయ్యటం సంచలనంగా మారింది. అదే విధంగా, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి, ఎలాంటి రాజకీయం నడుస్తుందో, తెలియ చేస్తుంది. రెండు రోజుల క్రితం తిరుమల డిక్లరేషన్ విషయం పై, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు స్పీకర్ ఘాటుగా స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి క్రీస్టియన్ మతం కాబట్టి, ఆయన తిరుమల గుడి సందర్శించే సమయంలో, చట్ట ప్రకారం అన్యమతస్థులు తిరుమల దర్శనానికి వస్తే, అక్కడ వెంకన్న మీద నమ్మకం ఉంది అంటూ డిక్లరేషన్ ఇవ్వాలని, గతంలో సోనియా గాంధి, అబ్దుల కలాం, ఫరూక్ అబ్దుల్లా లాంటి వారు ఇలాగే ఇచ్చారని, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు అంటూ, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

speaker 27112019 2

ఇదే ఆరోపణలు పై, మంత్రి కొడాలి నాని, నీ అమ్మ మొగుడు కట్టించాడా తిరుమల గుడి, జగన్ ఈ రాష్ట్ర పౌరుడిగా ఎక్కడికైనా వెళ్తాడు అంటూ చెప్పారు. అయితే, చట్టం ఉన్నది కాబట్టి, ఎవరైనా దాన్ని అనుసరించాల్సిందే అనే వాదన వస్తున్నా, దాని పై మాత్రం మాట్లాడటం లేదు. ఇక పొతే ఇదే విషయం పై, రెండు రోజుల క్రితం స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ, సోనియా గాంధీ తో కలిసి, రాజకీయ XXXX చెయ్యలేదా అంటూ, చంద్రబాబు పై విరుచుకు పడ్డారు. స్పీకర్ నోటి వెంట ఆ మాటలు విని అందరూ అవాక్కయ్యారు. సాధారణ నేతలు, ఎమ్మెల్యేలు కూడా, మీడియా ముందు ఎప్పుడు ఇలా మాట్లాడలేదని, స్పీకర్ తమ్మినేని ఈ మధ్య, పౌరుషంగా మాట్లాడుతూ, ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లో నిలుస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదంటూ, ప్రజలు స్పందిస్తున్నారు.

speaker 27112019 3

అయితే, స్పీకర్ మాత్రం, నేను ముందు ఎమ్మెల్యేను అని, ఆ హోదాలో సమస్యల పై మాట్లాడుతున్నాని, తరువాతే స్పీకర్ ని అని చెప్తున్నారు. అయితే, ఇప్పుడు స్పీకర్ రెండు రోజుల క్రితం, మాట్లాడిన మాటలు, మహిళలను కించపరిచేలా ఉన్నాయని, ఆయన పై క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఫిర్యాదు చేశారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ్మినేనిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ్మినేని స్పీకరా? లేక బ్రోకరా? అంటూ విరుచుకు పడ్డారు. స్పీకర్ భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. వెంటనే, తమ్మినేనిని స్పీకర్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read