ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైసిపీ వేధింపుల పై ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల పై దాడులు చెయ్యటం, వేధించటం, పంటలు ధ్వంసం చెయ్యటం, ఇళ్ళల్లోకి వెళ్ళకుండా గోడలు కట్టటం, రోడ్లు తవ్వేయటం, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్ట్ లు చెయ్యటం, ఇలా అనేక విధాలుగా హింస పెడుతున్నారని, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే, ఇప్పుడు మరోసారి, మరో తెలుగుదేశం నేతకు, ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రెస్ మీట్ పెట్టి, ఏమైంది అని అడుగుతూ, కొన్ని సందేహాలు లేవనెత్తినందుకు, ఆయనకు నోటీసులు ఇచ్చి, విచారణకు హాజరుకావాలని పోలీసులు కోరటం సంచలంగా మారింది. మాట్లాడితే కూడా నోటీస్ లు పంపిస్తాం అనే సంకేతం ఇస్తున్నారా అని టిడిపి ప్రశ్నిస్తుంది.

varla 16102019 2

సియం గారి బాబాయ్ అయిన వి--వే--కా--నంద రెడ్డి కేసు విషయంలో, వార్ల రామయ్య విచారణను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసారని చెప్తూ, ఆయనకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ నోటీసులు పంపింది. ఆయన ఈ కేసు పై చేసిన వ్యాఖ్యలతో, సాక్ష్యాలతో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలతో కేసు దర్యాప్తు పక్కదారిపట్టే అవకాశం ఉందని, సాక్ష్యాధారాలుంటే తెలియజేస్తే ఆ మేరకు విచారణ చేస్తామని చెబుతూ సిట్‌ ఎదుట హాజరుకావాలని నోటీసు పంపారు. అయితే అసలు ఈ కేసు మొదలైందే వైసిపీ నేతలు, సాక్షి టీవీ తప్పుదోవ పట్టించి, గుండె నొప్పితో పోయారు అని చిత్రీకరించటం పై అని, ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలి కాని, ప్రశ్నించిన ప్రతిపక్షం పై, ఈ దౌర్జన్యం ఏంటని టిడిపి ఆరోపిస్తుంది.

varla 16102019 3

"ఒక సీనియర్‌ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుని మరణం పి నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో వర్ల రామయ్య ప్రశ్నిస్తే తప్పేంటి.? విచారణపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాద్యత దర్యాప్తు చేస్తున్న సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ ఈ విషయంలో పోలీసుల సంక్షేమం కోసం మాత్రమే ఏర్పాటైన పోలీసు అధికారుల సంఘం స్పందించాల్సిన అవసరం ఏమిటి.? పోలీసు అధికారుల సంఘం ఏర్పడింది పోలీసుల కోసమా.. లేక రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థగా వ్యవహరించడం కోసమా.? ఈ వ్యవహారంలో పోలీసు అధికారుల సంఘం ఎందుకు అత్యుత్సాహం చూపిస్తోంది.? వర్ల రామయ్యపై అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. నోటీసులు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలి " అని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read