ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంబంధాలు రోజు రోజుకీ దూరం అవుతున్నాయి. మొన్నటి దాక, మేము తీసుకునే ప్రతి నిర్ణయానికి, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పిన జగన్, విజయసాయి రెడ్డికి, కేంద్రం నుంచి జర్క్ లు మీద జర్క్ లు వస్తున్నాయి. ముఖ్యంగా పోలవరం, విద్యుత్ పీపీఏల విషయంలో, జగన్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా చంద్రబాబు అవినీతి నిరూపించాలని, విద్యుత్ పీపీఏ ల విషయంలో వేలు పెట్టి, కేంద్రం ఆగ్రహానికి గురయ్యారు. ఒక పక్క కోర్ట్ లు కూడా మొట్టికయాలు వేసాయి. ఈ గొడవ ఇలా జరుగుతూ ఉండగానే, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి జర్క్ ఇచ్చింది. విద్యుత్ కొనుగోలు చేసి, వారికి డబ్బులు ఇవ్వకుండా, బకయాలు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, షాక్ ఇస్తూ, సౌర, పవన విద్యుత్‌ కంపెనీలకు కూడా లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇస్తేనే ఎక్స్చేంజి నుంచి విద్యుత్ తీసుకునే అవకాసం ఉందని చెప్పారు. ఇది మన ఒక్క రాష్ట్రానికే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తుంది. అయితే మన రాష్ట్రానికి మాత్రం ఇది చాలా కష్టమైన పని.

supreme 16102019 2

ఇప్పటికే ఆర్ధిక పరిస్థితి దారుణం అయిపొయింది. నాలుగు నెలల నుంచి ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఈ పరిస్థితిలో నెల నెలా డబ్బులు ఇచ్చి కొనాలి అంటే, 1500 కోట్లు దాకా అవుతుంది. ఇప్పటి దాకా అవి బకాయలు పెట్టి, ఎప్పుడో ఇచ్చేవారు. ఇప్పుడు అది కుదరదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్ పెట్టటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్ తగిలినట్టు అయ్యింది. అయితే ప్రధాని స్థాయిలో మాట్లాడుకుని, వెసులుబాటు తెచ్చుకోవటం పెద్ద ఇబ్బంది కాదు. కాని, ప్రస్తుతం, జగన్ వైఖరితో, బీజేపీ కోపంగా ఉందని, అక్కడకు వెళ్లి అడిగినా, ఏమి జరగదని, చివరకు స్టీఫెన్ రవీంద్ర , శ్రీలక్ష్మిని కూడా డిప్యుటేషన్ పై తెచ్చుకునే పలుకుబడి లేదని, అంటున్నారు. ఈ నేపధ్యంలో, ఇక గత్యంతరం లేక, హైకోర్ట్ లో కేంద్రం పై కేసు వేసారు. దీంతో హైకోర్ట్ మూడు వారాల పాటు, కేంద్ర నిర్ణయం పై స్టే ఇచ్చింది. అయితే, ఈ విషయం పై కేంద్రం కూడా అంతే ధీటుగా రియాక్ట్ అవ్వటానికి సిద్ధమైంది.

supreme 16102019 3

ఇది అన్ని రాష్ట్రాలకు వర్తింపు అయ్యే పాలసీ అని, ఏపి ప్రభుత్వం స్తే తెచ్చుకుంటే, మిగతా రాష్ట్రాలకు కూడా అదే వర్తిస్తుందని, ఇది విద్యుత్ రంగానికే ప్రమాదం అని, హైకోర్ట్ ఉత్తర్వుల పై, సుప్రీం కోర్ట్ కు వెళ్ళాలని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ వైఖరితో, రాష్ట్ర ప్రభుత్వం పై, కేంద్రం మరింత కఠిన వైఖరి అవలంబించడానికి ఇది దోహదం చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. విద్యుత్ కొనుక్కుని, వెంటనే డబ్బులు ఇవ్వమనటం తప్పేమి కాదని, అది వారి హక్కు అని, రాష్ట్రానికి ఎదురు దెబ్బ తప్పదని అంటున్నారు. మరో పక్క తెలంగాణాకు మాత్రం, ఈ ఇబ్బంది లేదు. తమకు సరిపడినంత విద్యుత్‌ ఉందని, ఎక్స్ఛేంజిలో కొనాల్సిన అవసరం లేదని, అందుకే లెటర్ అఫ్ క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలంగాణా ప్రభుత్వం భావిస్తుంది. కాని ఏపి పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎక్స్ఛేంజి నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయకపోతే తీవ్రమైన కోతలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతానికి మాత్రం హైకోర్ట్ ఉత్తర్వులతో, ఊరట లభించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read