అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని జగన్ మోహన్ రెడ్డి, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ కక్షలు ఎక్కడ దాకా వెళ్ళాయి అంటే, చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా కూల్చేస్తాం అనే దాకా వెళ్ళాయి. ప్రజా వేదికను రాత్రికి రాత్రి పడగోట్టేసారు. ప్రతిపక్ష నేతకు, ప్రభుత్వం ఇవ్వాల్సిన విధిలో భాగంగా, ప్రజావేదికను తన ఆఫీస్ గా ఇవ్వమని, చంద్రబాబు అడగటంతో, రాత్రికి రాత్రి, ప్రజా వేదిక కూల్చేసారు. దాని తరువాత, చంద్రబాబు ఇంటి పైన పడ్డారు. అదిగో కూల్చేస్తున్నాం, ఇదిగో కూల్చేస్తున్నాం అంటూ వార్నింగ్లు మీద వార్నింగ్లు ఇచ్చి, ప్రతి రోజు అది ఒక వార్తలాగా చేసి, వేరే సమస్యలకు కవరేజ్ లేకుండా చేసారు. ఇప్పుడు ఇది పాత వార్త అయిపోవటం, కోర్ట్ లో ఈ కేసు ఉండటంతో, ఇప్పుడు కొత్త వార్త కోసం, కొత్త కక్ష కోసం చూస్తూ, కొత్త టార్గెట్ ఫిక్స్ చేసారు.

tdp 13102019 1

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మంగళగిరి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర కార్యాలయం మీద కన్ను పడింది. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి నవంబరు 3 తేదీ, ఆదివారం సాయంత్రం 7.19 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సాక్షిలో అది అక్రమా నిర్మాణం అంటూ కొత్త వాదన తెర మీదకు తెచ్చింది. భవన నిర్మాణానికి ప్రభుత్వం 3 ఎకరాల 65 సెంట్లను కేటాయించగా ఒక రైతుకు చెందిన భూమిని కూడా ఆక్రమించుకున్నారని, పైగా పక్కనే ఉన్న వాగును పూర్తిగా పూడ్చి టీడీపీ కార్యాలయం నిర్మిస్తున్నారని సాక్షి కధనం రాసింది. అంతే కాకుండా రెండు బేస్‌మెంట్‌లు, మూడు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని మూడు బేస్‌మెంట్‌లు, నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

tdp 13102019 1

అయితే ఇలా జగన్ గారి సాక్షిలో కధనం రావటంతో, జగన్ గారి ప్రభుత్వం స్పందించింది. ఇది అంతా అక్రమం అని తేల్చేసి, నోటీసులు కూడా ఇచ్చేసారు. గత శుక్రవారం అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేశారు. మంగళగిరి తహసీల్దార్‌ రామ్‌ప్రసాద్‌ నోటీసులు జారీ చేసిన ఏడు రోజులలోపు ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ పై ఈ రకంగా కక్ష తీర్చుకుంటున్నారు. కొసమెరపు ఏంటి అంటే, చంద్రబాబు అధికారంలో ఉండగా, ఇదే తాడేపల్లిలో జగన్, ఒక పెద్ద ఇల్లు, దాని పక్కనే ఒక పెద్ద పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. పాపం చంద్రబాబుకి, ఇలాంటి కక్షసాధింపు రాజకీయం తెలియదు కదా. ఏదో ఒక లింక్ పట్టుకుని, వేధించాలని అప్పుడు ఆయన అనుకుని ఉంటే ? చూద్దాం, ఇది ఎన్ని మలుపులు తిరిగుతుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read