విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పరిశ్రమల కోసం, నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంతో కష్టపడి, ఒక్కో మెట్టు పేరుస్తూ వచ్చారు. ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న కంపెనీలను మన వైపు తీసుకు వచ్చే ప్రయత్నం చేసారు. అలాగే ఒకే ప్రాంతానికి కాకుండా, రాష్ట్రమంతా పరిశ్రమలు వచ్చేలా చూసారు. అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురంలో వచ్చింది, చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి, విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే చంద్రబాబు ఓడిపోవటం, జగన్ మోహన్ రెడ్డి అఖండ మెజారిటీతో, గెలవటంతో, రాజకీయ వాతావరణం మారిపోయింది. అయితే జగన్ కు భారీ మెజారిటీ ఉండటంతో, పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి, అధిక పెట్టుబడులు వస్తాయని అందరూ భావించారు
కాని అనూహ్యంగా, ఒక్క పరిశ్రమ రాకపోగా, వస్తాం అని ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. సింగపూర్ ప్రాభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, రిలయన్స్ జియో విలిపోయింది అని వార్తలు వచ్చాయి. ఆదానీ డేటా సెంటర్ కుదించుకుంది అని వార్తలు వచ్చాయి. మరో పక్క లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో లూలు గ్రూప్, ఈ చర్యతో, తీవ్ర అవమానంగా భావించింది. ప్రపంచ స్థాయిలో తమ పేరు ప్రఖ్యాతలకు ఇబ్బంది వస్తుందని గ్రహించి, తమకు భూకేటాయింపులు రద్దు చెయ్యటం పై, ఏపి ప్రభుత్వం పై ఘాటుగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. లూలూ గ్రూపు, ఇండియా డైరెక్టర్ అనంత్‌రామ్ మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసారు.
ఇప్పుడున్న పరిస్థితిలో, ఇక మీదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎలాంటి పెట్టుబడులు పెట్టటం అంటూ తెలిపారు. అయితే భారత దేశంలో మా పెట్టుబడులు కొనసాగుతాయని, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో తమ పెట్టుబడులను యథావిధిగా షెడ్యూలు ప్రకారం పెడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో, 13 ఎకరాల్లో ప్రపంచస్థాయి కన్వెన్షన్ సెంటర్, షాపింగ్‌మాల్, ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాలను చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం, రూ.2,200 కోట్ల పెట్టుబడి పెట్టి, ఏడువేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన బిడ్డింగ్‌లో పాల్గొని భూమిని లీజుకు పొందారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ కన్సల్టెంట్లను నియమించుకుని, ప్రపంచస్థాయి ఆర్కిటెక్టులతో డిజైన్లు తయారుచేయించుకోవడానికి భారీఎత్తున ఖర్చుచేశామని అనంత్‌రామ్ తెలిపారు. అయినా లూలూ సంస్థకు కేటాయించిన భూములను రద్దుచేస్తూ ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.