మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, నారా లోకేష్ పై, వైసీపీ టార్గెట్ కొనసాగుతూనే ఉంది. గత 5 ఏళ్ళుగా ఒక పద్దతి ప్రకారం అతని పై, ఒక క్యాంపైన్ నడిపి, వ్యక్తిత్వ హననం చేసారు. దీంతో లోకేష్ మంత్రిగా ఉంటూ, ఎన్ని మంచి పనులు చేసినా, ఊరు ఊరు సిమెంట్ రోడ్డులు వేసినా, ఎన్టీఆర్ సుజల లాంటి కార్యక్రమాలు చేసినా, ఐటి మంత్రిగా రిలయన్స్ జియో, ఆదనీ డేటా సెంటర్, టీసీఎల్ లాంటి ఎన్నో కంపెనీలు తెచ్చినా, అతని పై చేతకాని వాడు అనే ముద్ర వెయ్యతంలో, సక్సెస్ అయ్యారు. రాజకీయంగా లోకేష్ ని దెబ్బ కొట్టటంలో సక్సెస్ అయ్యారు. చివరకు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని మంగళగిరిలో, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే సామాజికవర్గాలు లేకపోయినా, అక్కడ ధైర్యంగా పోటీ చేసి, ఓడిపోయారు కూడా. ఇప్పుడు ఎమ్మెల్సీగా పని చేస్తూ, ప్రజా సమస్యల పై పోరాడుతూనే ఉన్నారు. అయినా, వైసీపీ మాత్రం, లోకేష్ ని వదలటం లేదు. ఇంకా లోకేష్ ని టార్గెట్ చేస్తూ, రాజకీయంగా దెబ్బ కొడుతూనే ఉంది.

lokesh 23112019 2

తాజాగా, వైసీపీ నేతలు, లోకేష్ కు మరో షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా కు సంబంధించి, డిస్ట్రిక్‌ రివ్యూ కమిటీ మీటింగ్ ఈ రోజు జరిగింది. అయితే స్థానిక ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ కు మాత్రం, ఈ సమావేశానికి ఆహ్వానం పంపలేదు. లోకేష్ ని పిలవకూడదు అనే నిర్ణయం తీసుకుని, ఆహ్వానం పంపలేదు. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఇక నుంచి లోకేష్ డిస్ట్రిక్‌ రివ్యూ కమిటీ మీటింగ్ రాకుండా, నిర్ణయం తీసుకుని, లోకేష్ ని సస్పెండ్ చేసారు. లోకేష్, జగన్ పై విమర్శలు చేస్తున్నారని, అందుకే అతన్ని డిస్ట్రిక్‌ రివ్యూ కమిటీ మీటింగ్ కు రాకుండా బహిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి, అక్కడ ఉన్న మెజారిటీ సభ్యులు అంగీకారం తెలిపారు.

lokesh 23112019 3

ఇన్‌చార్జ్ మంత్రి రంగనాథ్‌రాజు, మంత్రులు సుచరిత, మోపిదేవి వెంకటరమణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మద్దతు తెలపటంతో, లోకేష్‌పై బహిష్కరణ వేటుపడినట్టైంది. అయితే, దీని పై ఇంకా లోకేష్ స్పందించాల్సి ఉంది. తెలుగుదేశం నేతలు మాత్రం, ఇదేదో సొంత వ్యవహారం లాగా, చేస్తున్నారని, ప్రజల తరుపున పోరాటం చేస్తూ, సమస్యల పై ప్రభుత్వాన్ని నిలదీస్తే, బహిష్కరిస్తారా అంటూ, నిలదీస్తున్నారు. దీన్ని బట్టి ఎంత అసహనంతో ప్రభుత్వం ఉందొ అర్ధం అవుతుంది అని అంటున్నారు. డిస్ట్రిక్‌ రివ్యూ కమిటీ ప్రతి జిల్లాలో జరుగుతుంది. అన్ని శాఖల అధికారులతో ప్రతి మూడు నెలలకు ఒకసారి, జిల్లాలో అభివృద్ధి పనుల పై సమీక్ష సమావేశాలు నిర్వహించడం వీటి ఉద్దేశం. దీనికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అధ్యక్షత వహిస్తారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు సభ్యులుగా ఉంటారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read