అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిట్టు ప్రచారం చెయ్యటంలో, అప్పట్లో ప్రతిపక్షాలు చాలా ఆక్టివ్ గా ఉండేవి. చాలా విషయాలు ప్రజలకు నిజం అని నమ్మించారు కూడా. అందులో ఒకటి, ఐటి గ్రిడ్స్ కేసు. సరిగ్గా ఎన్నికలకు నోటిఫికేషన్ కు వారం రోజులు ముందు, ప్రజల వ్యక్తిగత సమాచారం అంతా, తెలుగుదేశం ప్రభుత్వం దోచేసింది అంటూ, వైసీపీ ఆరోపించింది. తెలుగుదేశం పార్టీకి యాప్ తయారు చేసే ఐటి గ్రిడ్ కు, ప్రభుత్వ సమాచారం అంతా ఇచ్చారని, వారు ప్రజల సమాచారం దోచేసి, వాటిని ఓట్లు తొలగించటంలో ఉపయోగించారని వైసీపీ ఆరోపించింది. దీనికి సంబంధించి, అప్పట్లో తెలంగాణా ప్రభుత్వ సాయంతో, కేసులు కూడా పెట్టి, ఈ కేసు నిజమే అన్నట్టు, నమ్మించే ప్రయత్నం చేసారు. దీని పై ఒక సిట్ కూడా ఏర్పాటు చేసారు. తెలుగుదేశం పార్టీ దోచేసింది దోచేసింది అంటూ ప్రచారం చేసారు. అయితే అప్పట్లోనే ఆధార్, ఈ ప్రచారాన్ని ఖండించింది.

sanjay 21112019 2

ఈ రోజు పార్లమెంట్ వేదికగా కేంద్రం కూడా ఈ విషయం పై ప్రకటన చేసింది. ఐటి గ్రిడ్స్ తో ఎలాంటి డేటా చోరీ జరగలేదని, కేంద్రం తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి, ఈ రోజు పార్లమెంట్ లో ప్రకటన చేసింది. ఐటి గ్రిడ్ ద్వారా, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆధార్ డేటా చోరి చేసింది అంటూ, గతంలో ఆరోపణలు వచ్చాయి, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వైసీపీనే అప్పట్లో హడావిడి చేసింది, ఇప్పుడు ఈ కేసు పరిస్థితి ఏమిటి అంటూ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి సంబంధించి, కేంద్రమంత్రి సంజయ్ థాత్రే సమాధానం ఇచ్చారు. ఆధార్‌ డేటాను ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని, ఆధార్ డేటా చోరీ అయ్యే, సమస్యే లేదని, ఎక్కడా కూడా డేటా చోరీ కాలేదని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు.

sanjay 21112019 3

అయితే విజిల్ బ్లోయర్ గా చెప్పుకుంటున్న లోకేశ్వర్ రెడ్డి, ఐటి గ్రిడ్స్ పై , తెలంగణా ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చారు. ఇదే లోకేశ్వర్ రెడ్డికి, ఇప్పుడు ఏపి ప్రభుత్వంలో ఒక పాదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం కూడా, డేటా చోరీ జరగలేదు అని చెప్పింది. ఇవన్నీ చూస్తుంటే, అప్పట్లో ఎంత కుట్ర జరిగిందో, ఎలాంటి ప్రచారం చేసారో అర్ధం అవుతుంది. ఏది ఏమైనా ఈ విషయంలో, తెలుగుదేశం పార్టీ అప్పట్లో సరిగ్గా తిప్పి కొట్టలేక పోవటంతో, రాజకీయంగా నష్ట పోయింది. అందరూ చేసిన ప్రచారాన్ని, తిప్పి కొట్టలేక, ప్రజలకు నిజం చెప్పలేకపోయింది. అయితే నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు, ఇప్పుడు పార్లమెంట్ వేదికగా కేంద్రమే చెప్పింది. అయినా, తెలుగుదేశం పార్టీకి జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read