ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష రాజకీయం నడుస్తుంది. రాష్ట్రంలో అన్ని స్కూల్స్ లో, ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది అని, తెలుగు మీడియం చదువులు పూర్తిగా రద్దు చేస్తున్నామని జగన గారి ప్రభుత్వం ప్రకటించింది. ఉన్నట్టు ఉండి ఇలా ఏమిటి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఎక్కడైనా ఆప్షన్ ఇవ్వాలి కాని, ఇలా నిర్బంధ విద్య ఏమిటి అంటూ మాటలు వినిపించాయి. ప్రస్తుతం ఉన్న టీచర్స్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పగలరా అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. గతంలో చంద్రబాబు హయంలో లాగా, ఆప్షన్స్ ఇవ్వాలని, ఎవరికీ కావాల్సింది వారు ఎంచుకుంటారు అని కొంత మంది అభిప్రాయం. ఇక భాషా ప్రేమికులు అయితే, ఇలా అయితే తెలుగు భాష పూర్తిగా చచ్చిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ లాంటి పార్టీలు ఒక అడుగు ముందుకు వేసి, మత మార్పిడులు కోసమే ఇది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం, ఒకే ఒక మాటతో ఎదురు దాడి చేస్తుంది. మీ పిల్లలు ఏ మీడియం అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది.

modi 25112019 2

చివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పై కూడా, జగన్ మోహన్ రెడ్డి, మీ పిల్లలు ఏ మీడియం అంటూ ఎదురు ప్రశ్నించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా, మాతృభాష పై, మన్‌కీ బాత్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభాషా పరిజ్ఞానం లేకుండా అభివృద్ధి అసాధ్యమని అన్నారు. దేశంలో మాతృభాలు, అంతరించిపోతున్నాయేమోనన్న భయం కలుగుతోందని, ఇటీవల పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే ఎంత అభివృద్ధి సాధించినా ఉపయోగం ఉండదని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరాఖండ్‌లో ఓ తెగ వారి భాషను కాపాడుకునే తీరు సంతోషమేసిందని మోదీ వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాతృభాష పై చర్చ పెద్ద చర్చ జరుగుతూ, రాజకీయమే దాని చుట్టూ తిరుగుతున్న వేళ, ప్రధాని వ్యాఖ్యలు వైసీపీని మరింత డిఫెన్సు లోకి నెట్టుతాయి.

modi 25112019 3

ఎందుకంటే, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడుని, మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు అని ఆయాన పై ఎదురు దాడి చేసినట్టు, ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల పై కౌంటర్ ఇచ్చే అవకాసం ఉండదు. ప్రధాని మోడీ, ఏపిలో జరుగుతున్న విషయాలు ద్రుష్టిలో ఉంచుకుని చెప్పక పోయినా, ఆయన మాటలు మాత్రం, ప్రతిపక్షాలకు ఆయుధంగా దొరికాయి. ప్రధాని వ్యాఖ్యల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందిన్కాహారు. ప్రధాని ప్రసంగంపై సీఎం జగన్‌తోపాటు, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని ఆయన ట్వీట్ చేశారు. మోదీ చేసిన ప్రసంగానికి సంబంధించిన పేపర్ కటింగ్‌లను పవన్ పోస్టు చేశారు. తెలుగు మీడియంను రద్దు చేసిన జగన్ కానీ, ఆ నిర్ణయాన్ని సమర్ధించిన మంత్రులు కూడా ప్రధాని వ్యాఖ్యలపై స్పందించాలన్న అభిప్రాయం అంతటా ఏర్పడుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read