కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అనే చందాన ఉంది, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంగతి. ముఖ్యంగా ఆంధ్రుల రాజధాని, అమరావతి విషయంలో, ఈ విషయం స్పష్టం అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఉండగా, అమరావతి ఖ్యాతి నలుమూలలకు వ్యాపించింది. దాదపుగా 40 వేల మంది కార్మికులతో, నిర్మాణం జరుగుతూ, అమరాతి అంతా కళకళలాడింది. ఇక్కడ హాస్పిటల్స్, కాలేజీలు, ఇతర నిర్మాణాలు చెయ్యటానికి ప్రైవేటు వ్యక్తులు, చివరకు సింగపూర్ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చారు. అయితే, ఎన్నికలు అయిన తరువాత, మొత్తం తారుమారు అయ్యింది. అమరావతిలో ఇప్పుడు ఒక స్మశాన వాతావరణం ఉంది. అమరావతికి రుణం ఇవ్వటానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్ కూడా వెనక్కు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్లిపోయిందా అని అరా తీస్తే, కేంద్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వ వైఖరి గమనించి, ప్రపంచ బ్యాంక్ లోన్ ఇచ్చే విషయంలో, తమ ప్రమేయం లేదు అని చెప్పటంతో, కేంద్రమే తప్పుకుంటే, మాకు ఎందుకు అని, ప్రపంచ బ్యాంక్ కూడా తప్పుకుంది.

map 03112019 2

మరో పక్క రోజుకి ఒక ప్రకటన చేసే మంత్రులు. అమరావతి ఒక కులం వారిది అంటూ, విషం చిమ్మే కొన్ని పత్రికులు. మరో పక్క, ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ కూడా వేరే చోటుకు వెళ్ళిపోతుంది అంటూ లీకులు. ఇలా రోజుకి ఒక విధంగా, అమరావతి పై అనిశ్చితి కలిగేలా, ప్రకటనలు చేస్తున్నారు. అసలు వింత ఏమిటి అంటే, ఇప్పటి వరకు, అమరావతి పై, జగన్ మోహన్ రెడ్డి నోరు విప్పక పోవటం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరే ఇలా ఉంటే, మాకు ఏమి పట్టింది అనుకుందో ఏమో, కేంద్ర ప్రభుత్వం కూడా, మన రాజధాని అమరావతిని గుర్తించే ప్రయత్నం చెయ్యటం లేదు. నిన్న కేంద్రం హోం శాఖ, విడుదల చేసిన, కొత్త పొలిటికల్ ఇండియా మ్యాప్ లో, ఈ విషయం స్పష్టంగా కనిపించింది.

map 03112019 3

మ్యాప్ లో అన్ని రాష్ట్రాలకు రాజధానులు పెట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం, అసలు రాజధాని లేకుండా పెట్టరు. జమ్మూ కాశ్మీర్‌ విభజన అధికారికంగా అమలులోకి వచ్చిన నేపథ్యంలో తాజా మ్యాప్‌ను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. అయితే అయుదు సంవత్సరాల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం, రాజధాని అమరావతిగా పెట్టలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను విడివిడిగా చూపిన కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మాత్రం పెట్టలేదు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని కూడా కేంద్రం గుర్తించలేదు. అయితే ఈ విషయం వచ్చి, రెండు రోజులు అయినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా స్పందించక పోవటం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే, కేంద్రం దగ్గర చులకన అయ్యం అని, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read