నిన్న, ప్రభుత్వ భవనానికి, జాతీయ జెండా రంగులకు వైసీపీ రంగులు పూసి తమకు దేశం కన్నా మా పార్టీనే ముఖ్యమని చాటుకున్నారు వైసీపీ నేతలు. ఈ చర్యతో దేశం మొత్తం, మన రాష్ట్ర చర్య పై, మండి పడింది. ఇక ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పట్టిన్నపాలెంలో ఏకంగా వినాయక విగ్రహాన్నే తొలగించి, జగన్ మోహన్ రెడ్డి తండ్రి అయిన వైస్సార్ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. అయితే స్థానికులు విషయం తెలుసుకుని తిరగబడటంతో, ఈ ఘోరం తప్పింది. లేకపోతే, వినాయకుడు ప్లేస్ లో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండేవారు. ఈ ఘటన, పశ్చిమ గోదావరి జిల్లా పట్టిన్నపాలెంలో జరిగింది. గ్రామంలో, వైయస్సార్ విగ్రహ ఏర్పాటులో చోటు చేసుకున్న ఈ వివాదం, ఇప్పుడ హాట్ టాపిక్ అయ్యింది. గ్రామంలో ఉన్న వినాయకుని విగ్రహం తీసి, అక్కడ వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలని, వైసీపీ నేతలు ప్రయత్నం చెయ్యటంతో, గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులునెలకొన్నాయి.చోటు చేసుకున్నాయి.
నిన్న అర్ధరాత్రి సమయంలో, కొంత మంది వైసీపీ నేతలు, గ్రామంలో ఉన్న వినాయకుని విగ్రహం తొలగించి, ఆ స్థానంలో, వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు, చేసిన ప్రయత్నాలను పట్టిన్నపాలెం గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే, తమ పై దాడి చేసారని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. పట్టిన్నపాలెం గ్రామంలో, దాదాపుగా 10 సంవత్సరాల క్రితం మూడు రోడ్ల కూడలి దగ్గర వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతి ఏడాది, అక్కడ వినాయక చవతి రోజుణ, వినాయకుని విగ్రహానికి ఉత్సవాలు జరపటం, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతి రోజు అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ గుడి ఉన్న, స్థలం స్థానిక, గణిరాజా అనే వ్యక్తి ఇంటికి ముందు ఉంది.
వీధిపోటు ఉండటంతో, ఆ స్థలం వదిలేసమని, అక్కడ మంచిది అని చెప్పి, వినాయకుడు విగ్రహం, గుడి పెట్టుకున్నామని గణిరాజా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, గత కొన్నిరోజుల నుండి అక్కడ ఉన్న వినాయకుని విగ్రహం తీసి, ఆ ప్లేస్ లో వైయస్సార్ విగ్రహాన్ని పెట్టాలని కొందరు వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి దౌర్జన్యంగా వైయస్సార్ విగ్రహాన్ని పెట్టేందుకు వైసీపీ నేతలు వచ్చారు. వినాయకుడు విగ్రహం తీసి, వైఎస్ఆర్ విగ్రహం పెట్టటం తమకు ఇష్టం లేదని, కావలని అర్ధరాత్రి సమయంలో దౌర్జన్యం చేయటం ఏమిటని గణిరాజా కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ విషయం పై, గణిరాజా కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యటంతో, పోలీసుల వచ్చి, ఇలా చెయ్యద్దు అని కోరటంతో, ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగినట్లేనని సమాచారం. అయితే ఈ చర్యల పై టిడిపి మండిపడింది. ఇప్పటికే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రగీతమైన తెలుగుతల్లి గీతాన్ని ఆలపించడం ఆపేసారు, ఇకపై గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను కూడా తీసేసి వైఎస్ఆర్ విగ్రహాలో, రాజారెడ్డి విగ్రహాలో పెడతారేమో అని జనం బెంబేలెత్తిపోతున్నారు, అంటూ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.