మన రాష్ట్ర విభజన తరువాత, రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం లేదు. పక్కన నున్న చెన్నై, హైదరబాద్, బెంగుళూరుని తట్టుకుని, మనం నిలబడాలి అంటే, ఎంతో కృషి అవసరం. ఏ ఒక్క చిన్న అవకాసం కూడా వదిలి పెట్టకుండా, మన రాష్ట్రం పని చెయ్యాలి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అంటే, హైదరాబాద్ లో ఒక భాగం అని ఎక్కువ మంది బయట వారకు అనుకుంటూ ఉంటారు. మన రాష్ట్రానికి ఒక ఐడెంటిటీ, బ్రాండ్ లేదు. అందుకే 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ తేవటానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసారు. సన్ రైజ్స్ స్టేట్ అనే థీమ్ తో, రాష్ట్రాన్ని ప్రమోట్ చేసారు. మరో పక్క అమరావతిని ధీటుగా ప్రమోట్ చేసారు. ఏ అవకాశాన్ని వదులుకోకుండా, రాష్ట్రాన్ని ప్రోమోట్ చేస్తూ, పెట్టుబడులు కోసం, వెంపర్లాడే వారు. ఈ కృషి ఫలితమే, కియా లాంటి కంపెనీలు, హెచ్సిఎల్ లాంటి కంపెనీలు మన రాష్ట్రం వైపు చూసేలా చేసాయి.

meeting 31102019 2

మన రాష్ట్రాన్ని కూడా గుర్తించటం మొదలు పెట్టాయి. అయితే చంద్రబాబు ఇప్పుడు లేరు. దిగిపోయారు. ప్రజలు దింపేసారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. అయుదు నెలలు అయినా, ఒక్క కంపెనీతో ఒప్పందం కాలేదు. పెట్టుబడులకు అనువైన వాతావరణం లేదనే అభిప్రాయం ఉంది. చంద్రబాబు హయంలో వస్తామన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి టైంలో యువకుడు అయిన జగన్, ఎంతో దూకుడుగా ముందుకు వెళ్ళాలి. రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలి. అతి పెద్ద మ్యన్దేట్ ఉండటంతో, సుస్థిర ప్రభుత్వం ఉంది, రాజకీయ వాతవరణం ఉంది, పెట్టుబడులుకు రండి అని ఆహ్వానించాలి. అవకాశాలు సృష్టించుకుని దూసుకు వెళ్ళాలి. కాని, ఇక్కడ మన ప్రభుత్వం, ఉన్న అవకాశాలు కూడా వాడుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి.

meeting 31102019 3

నిన్న, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ అధ్యక్షతన డిల్లీలో, జాతీయ పారిశ్రామిక, వాణిజ్య వర్కుషాపు జరిగింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు వచ్చినా, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ప్రాతినిథ్యం కనిపించలేదు. ఈ వర్కుషాపునకు ఆంధ్రప్రదేశ్ పర్రిశమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కాని,సంబంధిత శాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శి కాని ఇక్కడకు రాలేదు. భారత పారిశ్రామిక, వాణిజ్య రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించి, వాణిజ్య రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలన్న లక్ష్యంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ వర్కుషాపులో అన్ని రాష్ట్రాల పరిశ్రమశాఖల మంత్రులు హాజరయ్యారు. అయితే నిన్న, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఉందని, అందుకే మంత్రితో పాటు ముఖ్యకార్యదర్శి, కార్యదర్శులెకు వెళ్ళటం కుదరలేదని చెప్తున్నారు. అయితే ఇలాంటి సమావేశాల కంటే క్యాబినెట్ సమావేశం ఏమి అంత ముఖ్యం కాదని, క్యాబినెట్ సమావేశంలో ఇతర మంత్రులు ఉంటారని, కాని ఇక్కడ పారిశ్రామిక వర్కుషాపులో మన ప్రాతినిథ్యం ఉంటేనే, మన రాష్ట్రం గురించి చెప్పుకునే అవకాసం ఉంటుందని, ఇలాంటి వాటిని భవిష్యత్తులో మిస్ చెయ్యకూడదని విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read