నువ్వు రంగులు వెయ్యటానికి తప్ప, నీ ప్రభుత్వం దేనికీ పనికిరాదు... నిన్న ముఖ్యమంత్రిని చేసిందీ మేమే... పాలించటం చేతకాక పొతే ఇంట్లో కూర్చో... ఇంత అసమర్ధ, చేతకాని ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు... హిందువుల పట్ల జగన్ ప్రభుత్వం వివక్ష.. ఇలా ఎన్నో రకాలుగా తిడుతున్నా వైసీపీ నుంచి రెస్పాన్స్ లేదు.. అదేంటి, సొంత పేపర్, ఛానెల్, గట్టిగా మాట్లాడే మనుషులు, ఇంత మంది ఉన్నారు, ఎందుకు సైలెంట్ గా ఉంటారు అనుకుంటున్నారా ? ఈ ఆరోపణలు చేసింది తెలుగుదేశం పార్టీ అయితే, అలాగే ఒంటి కాలు మీద ఎగిరే వారు. కాని ఈ వ్యాఖ్యలు చేసింది బీజేపీ నేతలు. బీజేపీ జోలికి వస్తే, ఏమవుతుందో, వైసిపీలో ఉన్న నెంబర్ వన్, నెంబర్ టు నుంచి, కింద దాకా అందరికీ తెలుసు. అందుకే బీజేపీ నేతలు ఎంత పౌరుషంగా తిట్టినా, ఒక్క మాట అంటే, ఒక్క మాట కూడా తిరిగి అనటం లేదు, వైసీపీ. రెండు రోజుల క్రితం కూడా, కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ, రంగులు వేసుకోవటానికి తప్ప, జగన్ ప్రభుత్వం, దేనికీ పనికిరాదని అన్నారు.

vsreddy 01112019 2

అయితే ఈ వ్యాఖ్యల వేడి, ఇప్పుడిప్పుడే వైసీపీకి తగులుతున్నట్టు ఉంది. నిన్న విశాఖపట్నంలో పర్యటించిన విజయసాయి రెడ్డి, మీడియా సమావేశం నిర్వహించారు. యధావిదిగానే, జగన్ ప్రభుత్వం, ఈ దేశంలోనే గొప్పది అని చెప్తూ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. అయితే, ఇదే సందర్భంలో, బీజేపే నేతలు చేస్తున్న విమర్శలు పై, మీడియా ప్రశ్నించగా, విజయసాయి రెడ్డి చాలా ఆచి తూచి స్పందించారు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వం స్పందిస్తేనే, మేము స్పందిస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ తప్పు మార్గంలో పయనిస్తోందని, విజయసాయి రెడ్డి విమర్శించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని నడిపిస్తున్న, కన్నా లక్ష్మీనారాయణ పై ఇన్ డైరెక్ట్ గా గురి పెట్టరు.

vsreddy 01112019 3

కన్నా లక్ష్మీనారాయణ ఇసుక కొరత విషయంలో, పోలవరంలో రివర్స్ టెండరింగ్ విషయంలో, విద్యుత్ పీపీఏల విషయంలో, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో, ఇలా ప్రతి విషయంలో, జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇసుక సమస్య పై ప్రధానంగా, ఆందోళన చేస్తూ, జగన్ ప్రభుత్వాన్ని, ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణాలు అన్నిటి చేత, ఇవి మనుసులో పెట్టుకుని, కన్నా లక్ష్మీనారాయణను డైరెక్ట్ గా అనలేక, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తప్పు దారిలో వెళ్తుంది అంటూ, విమర్శలు గుప్పించారు విజయసాయి. మళ్ళీ వెంటనే, కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని, కేంద్రంలోని బీజేపీ విమర్శలు చేస్తేనే మేము స్పందిస్తాం అంటూ సేఫ్ గేమ్ ఆడారు. చూద్దాం మరి, ఏపి బీజేపీ ఎలా స్పందిస్తుందో....

Advertisements

Advertisements

Latest Articles

Most Read