రాష్ట్రంలో ఇసుక కొరతతో, ప్రజలు అల్లాడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక, అయుదు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదపుగా 40 లక్షల మంది కార్మికులు పనులు లేక, ఇబ్బంది పడుతున్నారు. ఈ అయుదు నెలల్లో అప్పులతో నెట్టుకొచ్చిన వారు, ఇప్పుడు ఆ అప్పులు కూడా పుట్టక, బలవన్మరణాలు చేసుకునే పరిస్తితి వచ్చింది. ఈ రోజు కూడా ఒక కార్మికుడు చనిపోయారు. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు. ఒక పక్క ప్రతిపక్షాలు అన్నీ పోరాడుతున్నాయి. అయినా ప్రభుత్వం లెక్క చెయ్యటం లేదు. ఇసుక వారోత్సవాలు అని జగన్ మోహన్ రెడ్డి చెప్పినా, అది ఎంత వరకు ఉపసమనం కలుగుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రజలకు భరోసా ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక పక్క ప్రభుత్వం వైఫల్యం చెందితే, మరో పక్క, మంత్రులు, భవన నిర్మాణ కార్మికులు మరణాన్ని హేళన చేస్తున్నారు.

peedireddy 31102019 2

నిన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యన్నారయణ ప్రెస్ మీట్ పెట్టరు. ఈ ప్రెస్ మీట్ లో, భవన నిర్మాణ కార్మికుల మరణాలను హేళన చేస్తూ మాట్లాడిన వీడియోను, నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులెవరూ చనిపోలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తూ, వర్షాకాలంలో భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకవని, ఇది వారికి అన్‌సీజన్‌ అని, అన్‌సీజన్‌లో ఎవరైనా చనిపోతారా అని చెప్తూ, ఎవరో ఎక్కడో ఎందుకో ఏదో చేసుకుంటే అదేదో భవన నిర్మాణ కార్మికులే బలవన్మరణానికి పాల్పడితే, రాజకీయాల కోసం చెప్పి, ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని, భవన నిర్మాణ కార్మికుల పై వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఇవే రాజకీయ దుమారాన్ని రేపాయి.

peedireddy 31102019 3

దీని పై నారా లోకేష్ ట్వీట్ చేసారు "ఆకలి బాధతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు చనిపోతుంటే, వైకాపా మంత్రులు ఒళ్లు కొవ్వెక్కి వారి చావులను ఎగతాళి చేస్తారా? బాధ్యతలేదా? దీనికంతటికీ మీ తుగ్లక్ తీసుకున్న నిర్ణయాలు, మీ నేతల అక్రమ ఇసుకదందా కారణం కాదా? ఇసుక సమస్య పరిష్కరించి కార్మికులను ఆదుకోవాల్సిన వారు పుండు మీద కారం జల్లే విధంగా మాట్లాడటం సబబు కాదు. మాటలు తూలిన మంత్రి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బలవన్మరణాలు చేసుకున్న కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. " అంటూ ట్వీట్ చేసారు. మరో పక్క చంద్రబాబు కూడా మంత్రుల వ్యాఖ్యలను తప్పుబట్టారు. అలాగే చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు లక్ష రూపాయలు ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read