నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రజలు కన్న కలలు కలగానే మారనున్నాయి. భవిష్యత్ తరాలకు చిరకాల స్వప్నంగా మిగిలేలా నిర్మించ తలపెట్టిన రాజధాని నిర్మాణం ఇక అటకెక్కినట్టే. స్టార్టప్‌ ఏరియా నుంచి వైదొలగుతామంటూ సింగపూర్‌ కన్సార్షియం చేసిన లిఖితపూర్వక విజ్ఞప్తి పై, జగన్ స్పందించి, క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్తో రాష్ట్ర ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఇక అమరావతిలో నిర్మించ తలపెట్టిన నవ నగరాలు గల్లంతేనని చెప్పక తప్పదు. రాజధానిపై వైసీపీ ప్రభుత్వం నూతనంగా నియమించిన కమిటీ నివేదిక తరువాతనే ఎక్కడనేది స్పష్టమవుతోందని పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. దీంతో కొత్తగా నిర్మించ తలపెట్టిన నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం అంతేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలు అందుకోవడానికి, ప్రపంచం నలువైపులా నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్తో ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం రాజధాని ప్రాంతం, రాజధాని నగరం, సీడ్ కేపిటల్ ఏరియాల సర్వతోముఖాభివృద్ధికై సింగపూర్ ప్రభుత్వం ద్వారా అక్కడి సంస్థలు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని భావించారు.

పట్టణ పరిపాలన, నగర అభివృద్ధిపై పరిజ్ఞానాన్ని సింగపూర్ ప్రభుత్వ సంస్థలైన సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్, ఐఐ సింగపూర్ నుంచి స్వీకరించడం, దీనితోపాటు సంస్థాగతమైన తోడ్పాటు అవసరం. ఈ ఒప్పందంలో భాగంగా రాజధాని ప్రాంతం, రాజధాని నగరం, సీడ్ కేపిటలకు మాస్టర్ ప్లాన్ సింగ పూర్‌కు చెందిన సుర్బానాజు సింగ్ రికార్లు వ్యవధిలో 2015 జులైలో సమర్పించింది. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వ ప్రతిపాదనలను పక్కనపెట్టడంతో రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా (సీడ్ కేపిటల్) ప్రాజెక్టు ఇక అటకెక్కినట్లే. సీడ్ కేపిటల్ ప్రాజెక్టు నుంచి తప్పుకునేందుకు సింగపూర్ కన్సార్షియానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రపంచంలోని మహానగరాలలో పర్యటించి వాటి నిర్మాణాల గురించి తెలుసుకుని దేశంలోని ఛత్తీస్డ్ రాజధాని నయా రాయపూర్ నిర్మాణాలను స్వయంగా చూసిన తరువాత చంద్రబాబునాయుడు ఆధునిక అమరావతి నిర్మాణం విషయంలో అనేక ఆలోచనలు చేశారు. రాషానికి గుండెకాయ వంటిది రాజధాని. అటువంటి రాజధాని ఒక్క పరిపాలనకే పరిమితం కాకుండా ఆర్థిక కార్యకలాపాలు, ఆదాయ మార్గాలు, విద్య, వైద్యం, ఐటి విభాగాలతో పాటు ఉపాధి అవకాశాలకు నిలయంగా ఉండేలా నవనగరాలను నిర్మించాలని గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు.

అమరావతి అంటేనే తెలుగుదనం ఉట్టిపడాలని ఆయన ఉబలాటపడ్డారు. నవరత్న నగరాలను నిర్మించాలని కలలు కన్నారు. కానీ ఆ కలలకు వైసీపీ సర్కార్ చెక్ పెట్టింది. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం వేసిన కమిటీ నిర్ధారించిన తరువాతే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని పదేపదే స్పష్టం చేస్తున్న నేపధ్యంలో ఇక రాజధాని నిర్మాణంపై ప్రజల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ తదితర దేశాలతోనూ, అంతర్జాతీయ వ్యా పార సంస్థలతోనూ వాణిజ్యం, పట్టుబడులు, ఉమ్మడి సంస్థలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళికలు, స్మార్ట్ నగరాలు, సంప్రదాయేతల ఇంధన వనరులు, విద్య, వైద్యం, పర్యావరణం, రవాణా వ్యవస్థలు, సామాజిక సంక్షేమం మొదలైన రంగాలలో పరస్పర సహకారం కోసం టీడీపీ ప్రభుత్వం గతంలో చేసుకున్న అనేక ఒప్పందాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసేందుకు సిద్ధమైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read