రాష్ట్రంలో ఇసుక లేక, దారుణ పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, గత అయుదు నెలలుగా పనులు లేక, తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీసం బ్రతకటానికి కూడా డబ్బులు లేక, అన్న క్యాంటీన్ లు లేక, తిండి లేక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ధీన పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో, భవన నిర్మాణ కార్మికులు, ప్రతి రోజు ఆందోళనలు చేస్తున్నారు. ఇసుకను వదలమని, తక్కువ రేట్ కు ఇవ్వమని, అప్పుడే పనులు మొదలవుతాయని ఆందోళన బాట పట్టారు. అయినా సరే, ప్రభుత్వం, పట్టించుకోవటం లేదు. తెలుగుదేశం పార్టీ ఇసుక పై ఆందోళనలు చేస్తుంది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ముందుగా సెప్టెంబర్ 5 అన్నారు. తరువాత వరదలు వచ్చాయని అన్నారు. వర్దలు వస్తే, రెండు మూడు జిల్లాలకు ఇబ్బంది కాని, రాష్ట్రమంతా ఇసుక కొరత ఉంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వం మాత్రం, ఎటువంటి చర్యలు చేపట్టటం లేదు.
ఈ నేపధ్యంలో విసుగెత్తి పోయిన ప్రజలు, ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే, గుంటూరులో మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణలకు చేదు అనుభవం ఎదురైంది. ఇసుక కొరతపై భవన నిర్మాణ కార్మికులు మంత్రులను నిలదీశారు. గుంటూరు పర్యటనలో డ్రైనేజి పనులు పరిశీలనకు మంత్రులు వచ్చారు. దీంతో అక్కడ ప్రజలు, వారిని అడ్డుకున్నారు. మీకు ఓటు వేశాము.. మాకు ఇసుక ఇవ్వండని కార్మికులు నిలదీశారు. మిమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని కార్మికులు మంత్రులతో అన్నారు. అయితే వారికి వారిస్తూ, త్వరలోనే మీ కష్టాలు తీరిపోతాయని చెప్పిన మంత్రులకు, ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురు అవ్వటంతో, సమాధానం చెప్పలేక, అక్కడ నుంచి జారుకున్నారు.
మరో పక్క, నిన్న గుంటూరు జిల్లాల్లో ఒకేరోజు ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పొన్నూరు మండలం మునిపల్లెకు చెందిన నాగ బ్రహ్మాజీ తాపీ మేస్త్రిగా ఉన్నారు. అయితే పనులు లేకపోవటంతో, ఆయన చాలా రోజులుగా కాళీగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో అతని భార్య, స్పిన్నింగ్ మిల్ లో ఉద్యోగానికి వెళ్తుంది. అయితే తనకు పనులు లేకపోవటం, భార్య ఉద్యోగానికి వెళ్తూ ఉండటంతో, అది తట్టుకోలేక, తను చనిపోయాడు. మరోప్ పక్క, గుంటూరు నగరంలో కోదండరామయ్యనగర్ 1వ లైనుకు చెందిన బేల్దారి మేస్త్రీ పడతాపు వెంకట్రావు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు ఇప్పటిదాకా వరకు రైతుల బలవన్మరణానికి పాల్పడటం చూసిన రాష్ట్రంలో కొత్తగా జగన్ సర్కారు అసమర్థ పాలన వల్ల భవన నిర్మాణ కార్మికులు చనిపోయే స్థితి వచ్చిందని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.