రమణదీక్షితులు గుర్తున్నారా ? చంద్రబాబు హయంలో, తిరుమల పై ఏదో జరిగిపోతుంది అంటూ ప్రచారం చేసి, చంద్రబాబు తిరుమలని అపవిత్రం చేస్తున్నారు అంటూ, ఒక క్యాంపైన్ నడపటంలో, అలాగే బ్రాహ్మణ సామాజిక్వర్గాన్ని, టిడిపి నుంచి దూరం చెయ్యటంలో, సక్సెస్ అయ్యారు. తిరుమలలో ప్రధాన అర్చకుడిగా ఉంటూనే, ఉన్నట్టు ఉండి ఆయన చెన్నై వెళ్లి, చంద్రబాబు పై విరుచుకు పడ్డారు. అసలు వెంకన్నకు సేవలు చెయ్యటం లేదని, టైంకి జరగాల్సినవి జరగటం లేదని, నైవేద్యం కూడా సరిగ్గా పెట్టటం లేదు అంటూ, సంచలన ఆరోపణలు చేసారు. అలాగే బుందీ పోటుని మొత్తం తావ్వేసి, అక్కడ బంగారం దొంగలించారని కూడా ఆరోపణలు చేసారు. తరువాత పింక్ డైమెండ్ వివాదం తెలిసిందే. అయితే అప్పట్లో ఈయన్ను ప్రభుత్వంపై, విమర్శలు చేసినందుకు ప్రభుత్వం రిటైర్మెంట్ ఇచ్చేసింది. అయితే ఇది అక్రమం అని, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను కలిసి దీక్షితులు విన్నవించుకున్నారు.
అప్పట్లో జగన్ కూడా, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే, రిటైర్మెంట్ ఎత్తేస్తాం అని, రమణ దీక్షితులకు మళ్ళీ ప్రధాన అర్చకుడు హోదా ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు జగన్ వచ్చారు. వచ్చి కూడా అయుదు నెలలు అయ్యింది. వారం రోజుల క్రిందట, అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అమలు అవుతుందని చెప్పింది. అయితే, ఇంకేముంది ఈ నిర్ణయం, రమణ దీక్షితులు కోసమే అని అందరూ అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్టు రమణ దీక్షితులుకు మాత్రం, మళ్ళీ పూర్వ వైభవం రాలేదు. బుధవారం జరిగిన టీటీడీ బోర్డు విషయంలో, ఈ విషయం పై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవటంతో, దీక్షితులుకి, ఇప్పుడే అవకాసం వచ్చేలా లేదు
టిడిపి బోర్డు నిర్ణయం ప్రకారం, ఇప్పటికిప్పుడు మాజీ అర్చకులని తీసుకుకోవటం లేదని, టీటీడీలో పదవీ విరమణ పొందిన అర్చకుల సేవలను తిరిగి ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయంపై విధి విధానాలు రూపొందించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమిటి వేస్తున్నారు అంటేనే, అది కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళినట్టే లెక్క. ఇలా చేస్తే, న్యాయ పరమైన చిక్కులు వచ్చే అవకాసం ఉందని టిటిడి భావనగా తెలుస్తుంది. అంటే, ఇప్పట్లో రమణ దీక్షితులు ఆశలు తీరేలా లేవు. ఆయన ఈ మధ్య కాలంలో జగన్ ను కలిసి, విన్నవించుకున్నారు అనే వార్తలు వచ్చినా, ఏమి జరగలేదు. దీని పై మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు కూడా ఘాటుగా స్పందించారు. "తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రమణ దీక్షితులు అదే విధమైన సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర అర్చకుల సమస్య పై దృష్టి పెట్టి తన వాగ్దానానికి అనుగుణంగా సత్వర చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ విషయంలో ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యవస్థలో కొందరు ముఖ్యమంత్రి కన్నా బలవంతులుగా ప్రవర్తిస్తున్నారా? అదే నిజమైతే వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిపాలనా విధానానికే అది ప్రమాదం అవుతుంది." అంటూ ఐవైఆర్ స్పందించారు.