ఒక పక్క ఈ రోజుతో, జగన్ మొహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆరు నెలలు పూర్తీ చేసుకుని, ముందుకు సాగుతున్న వేళ, మా ప్రభుత్వం అద్భుతంగ పని చేస్తుంది, దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అంటూ, వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. మరో పక్క, ఈ ఆరు నెలల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రద్దులు, కుల్చివేతలు, రివెర్స్ పాలనతో, నెగటివ్ దృక్పదంలో, దేశం మొత్తం మన వైపు చూస్తుంది అంటూ, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఆరు నెలలకు సంబంధించి, మంచి సియం కాదు, ముంచే సియం అంటూ తెలుగుదేశం, ఒక పుస్తకం కూడా విడుదల చేసింది. మరో వైపు పడిపోతున్న ఆర్ధిక పరిస్థితి, ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆరు నెలల్లో జగన్ మంచి సియంగా ఉన్నారా, ముంచే సియంగా ఉన్నారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కాని, కేంద్రప్రభుత్వం మాత్రం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై, ఆందోళనతో ఉంది. వారు మునిగేది కాక, మమ్మల్ని కూడా ముంచేస్తున్నారు అంటూ, కేంద్ర ప్రభుత్వం అంటుంది.

rksingh 30112019 2

జగన మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే, గతంలో చంద్రబాబు నాయుడు హయంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు అక్రమం అని, అవినీతి జరిగింది అని, ఆ ఒప్పందాల పై సమీక్ష జరుపుతాం అంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇలా చేస్తే, మాకు రుణాలు ఇచ్చే వారు ఉండరు అని, మా క్రెడిబిలిటీ పడిపోతుంది అంటూ, ఆ కంపెనీలు కోర్ట్ కు వెళ్ళాయి. అలాగే విదేశీ పెట్టుబడులు కూడా అందులో ఉండటం, జపాన్ ప్రభుత్వం సీరియస్ అవ్వటంతో, కేంద్ర ప్రభుత్వం కూడా, ఈ చర్యలు తప్పు అని రాష్ట్రాన్ని హెచ్చరించింది. అయితే ఇదే విషయం పై నిన్న పార్లిమెంట్ లో, కేంద్ర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌, రాష్ట్ర ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

rksingh 30112019 3

ఆంధ్రప్రదేశ్‌ లాంటి కొన్ని రాష్ట్రాల వైఖరి వల్ల, మన దేశంలో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు వేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయిందని ఆర్‌కే సింగ్‌ పార్లమెంట్ లో తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పారు. గతంలో అధికంగా టెండర్లు వచ్చేవని, కానీ కొంతకాలంగా టెండర్లు వేసే వారు తగ్గిపోయరని అన్నారు. కొన్ని రాష్ట్రాల సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, విద్యుత్తు నియంత్రణ సంస్థలు టారిఫ్‌ల నిర్ధారణలో జాప్యం చేయడం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పీపీఏలను పునఃసమీక్షించడానికి సిద్ధమవడం లాంటివి ఇందుకు ముఖ్య కారణాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న చర్యలతో, పెట్టుబడిదారుల విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపింది అన్నారు. అందుకే పీపీఏలకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని, అవినీతి జరిగిందని సమాచారం ఉంటేనే, సమీక్ష చేసుకోవాలని చెప్పినట్టు కేంద్ర మంత్రి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read