విజయవాడ పోలీసులు, విజయవాడ అంతటా 144 సెక్షన్ అములు చేస్తున్నట్టు చెప్పారు. ఇది పెద్ద షాకింగ్ కాదు కాని, చేసిన టైమింగ్ కాని, చేసిన రోజులు కాని, కొంత షాకింగ్ గానే అయ్యాయి. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇన్ని రోజులు 144 సెక్షన్ లేదని కూడా చెప్తున్నారు. ఈ రోజు, అంటే డిసెంబర్ 1 నుంచి, సంక్రాంతి పండుగ, అంటే జనవరి 15 దాకా, 144 సెక్షన్ అమలు చేస్తున్నాటు, విజయవాడ పోలీసులు తెలిపారు. అంటే మొత్తంగా 46 రోజులు పాటుగా, నిరంతరాయంగా, 144 సెక్షన్ ఉండ నుంది. ఆదివారం నుంచి, జనవరి 15 వరకు, విజయవాడలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు. 144 సెక్షన్ అమలులో ఉండటంతో, ఆ సెక్షన్ కు తగ్గట్టు, విజయవాడ ప్రజలు మలుచుకోవాలని పోలీసులు అన్నారు. అయితే, ఎప్పుడూ లేని విధంగా, ఏకంగా నెలన్నర రోజుల పాట 144 సెక్షన్ ను అమల్లోకి తీసుకుని రావడం చర్చ అవుతుంది.
మాములుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కాని, ఏదైనా వీవీఐపి మూమెంట్ కాని, మరీ sensitve ఇష్యూ ఉన్నప్పుడు కాని, ఇలా 144 సెక్షన్ పెడతారు. లేకపోతే సెక్షన్ 30 పెడతారు. అయితే, అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు, 144 సెక్షన్ ఉంటుందని అంటున్నారు. ఎక్కువగా మంత్రులు, ఎమ్మెల్యేలు, విజయవాడ పరిసర ప్రదేశాల్లో నివాసం ఉండి, అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారు కాబట్టి, బద్రత కోసం పెడతారు అని తెలుస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 9 నుంచి, డిసెంబర్ 21వ తేదీ వరకు ఉంటాయి. ఈ 12-13 రోజులకు పెడితే సరిపోతుంది కాని, మరి ఇప్పుడు ఇలా 46 రోజులు ఎందుకు పెట్టారు అనేది తెలియాల్సి ఉంది.
ఈ రోజు నుంచి, సంక్రాంతి పండుగ వరకు, 144 సెక్షన్ కొనసాగించడం వెనుక ఉద్దేశమేమిటనేది తెలియ రావట్లేదు. విజయవాడ నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికే 144 సెక్షన్ ను అమల్లోకి తీసుకుని వచ్చినట్లు ద్వారకా తిరుమల రావు చెబుతున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్న సమయంలో దీనికి భిన్నంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేస్తుందా ? అందుకు ముందు జాగ్రత్త చర్యలు కోసం ఏమైనా చేస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి ఈ విషమై, విజయవాడ ప్రజలు మాత్రం, భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ 46 రోజుల్లో పండుగలు ఉన్నాయని, కొత్త సంవత్సరం వస్తుందని, మరి పోలీసులు ఈ నిబంధన ఎందుకు పెట్టారో అని అంటున్నారు.