తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఈ రోజు అమరావతిలో గత ఆరు నెలల నుంచి జరుగుతున్న వాస్తవ పరిస్థితిని వివరించటానికి, అమరావతిలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటన మొదట్లో, కొంత మంది చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు పై రాళ్ళతో దాడి చేసారు. చంద్రబాబుని రాళ్ళతో కొట్టాలని ప్లాన్ చేసినా, బస్సు అద్దం మాత్రమే పగుళ్ళు ఇచ్చింది. అయితే ఇది చేసింది కొంత మంది వైసీపీ సానుభూతిపరులు అంటూ తెలుగుదేశం ఆరోపిస్తుంటే, కావాలనే చంద్రబాబు, రాళ్ళతో కొట్టించుకుని, సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటూ, వైసీపీ ఆరోపిస్తుంది. అయితే అసలు వాస్తవం గురించి, పర్యటనలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులు పై ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అమరావతి పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ కార్యకర్తలు రాళ్ళతో దాడి చెయ్యటం పై లోకేశ్ తీవ్రంగా పరిగణించారు. రాల్లువ్ వేసింది వైసీపీ కార్యకర్తలే అని, వాళ్ళు ఇక్కడి వారు కూడా కాదు అని చెప్తూ, లోకేష్ ఒక వీడియోని కూడా పోస్ట్ చేసారు.
ఆ వీడియో కూడా, జగన్ మోహన్ రెడ్డి సొంత ఛానెల్ అయిన సాక్షి వీడియో. ఆ వీడియోలో రాజధాని రైతులుగా కొంత మంది మాట్లాడుతున్నారు. వారిలో ఒకతను మాట్లాడుతూ, తాము తెనాలి నుంచి ఇక్కడకు వచ్చామని, చంద్రబాబు రైతులను అన్యాయం చేసారంటూ చెప్పుకొచ్చారు. అసలు అమరావతికి సంబంధం లేని వ్యక్తీ, తెనాలి నుంచి ఇక్కడకు ఎందుకు వస్తాడు ? తెనాలి నుంచి వచ్చి, అమరావతి రైతులు పేరుతొ, బ్యానర్లు పట్టుకుని, ఆందోళన చెయ్యాల్సిన అవసరం ఏముంది ?ఇదే విషయం పై, లోకేష్ ఒక వీడియో రూపంలో పోస్ట్ చేసి, ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎక్కడో తెనాలి నుంచి మనుషులను అమరావతికి తీసుకోవచ్చి, రాళ్ళు వెయ్యాల్సిన అవసరం ఏముంది అంటూ లోకేష్ ప్రశ్నించారు.
".@ncbnగారి అమరావతి పర్యటనలో వైసీపీకుట్రలు బయట పడతాయన్న భయంతో కాన్వాయిపై మీ పార్టీ గూండాలను రప్పించి దాడులు చేయిస్తారా? మరీ ఇంత పిరికితనమా? తెదేపా హయాంలో మేము కూడా ఇలా చేస్తే @ysjaganగారు పాదయాత్ర చేయగలిగేవారా?#ChaloAmaravati#PeoplesCapitalAmaravati#SaveAmaravati#JaganFailedCM" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు. ఇది ఇలా ఉంటే, ఉదయం కొంత హడావిడి చేసిన ఈ బ్యాచ్, తరువాత ఎక్కడా కనిపించలేదు. రాజధాని ప్రాంతం అడుగడుగునా, చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక రైతులు, మహిళలు పూలు జల్లుతూ ఆయనకు స్వాగతం పలికారు. ప్రపంచం గర్వించే రాజధాని నిర్మాణం కొనసాగించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.