మాజీ మంత్రి వైఎస్‌ వి-వే-కా-నం-ద-రెడ్డి హ-త్య కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాల్లో పేర్కొంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వి-వే-కా-నం-ద-రె-డ్డి హ-త్య జరగడం అప్పట్లో సంచలనం కలిగించింది. కేసు దర్యాప్తు అనేక మలువులు తిరుగుతున్న సమయంలో వి-వే-కా తనయ సునీత హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి హ-త్య కే-సు-లో తనకు అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ కొందరి పేర్లను హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. తన తండ్రి హ-త్య కే-సును సిబిఐకి అప్పగించి దర్యాప్తు చేయాలని ఆమె కోరారు. గతంలోనే వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, అప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు బిటెక్ రవి, బిజెపి నాయకుడు ఆదినారాయణరెడ్డిలు వేర్వేరుగా పిటీ షన్లు దాఖలు చేసిన విషయం విదితమే. అయితే కొద్ది రోజుల క్రితం జగన్ మాత్రం, సిబిఐ విచారణ అవసరం లేదని పిటీషన్ వెనక్కు తీసుకున్నారు.

viveka 110320520 1

ప్రస్తుతం తాజాగా ఆయన కుమార్తె సునీత ఈ కేసు దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ సిబిఐకి అప్పగిస్తే తన కుటుంబానికి తగిన న్యాయం జరుగుతుందని ఆమె వివరించారు. వేర్వేరుగా దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారించేందుకు హైకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసును సిబిఐకి అప్పగించడంలో ఉన్న అభ్యంతరాలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. వి-వే-కా హ-త్య కే-సు-లో కొందరిపై అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సునీత పేర్కొన్నారు. ప్రత్యేకమైన ఆరోపణలేవి చేయడంలే దంటూనే తమకు అనుమానాలు ఉన్నాయంటూ కొందరి పేర్ల జాబితా హైకోర్టుకు ఆమె సమర్పించారు. తొలుత పేర్కొన్న జాబితాలో ఉన్న పేర్లు వాచ్మెన్ రంగయ్య. యర్ర గంగిరెడ్డి, వై.యస్. అవినాష్ రెడ్డి సన్నిహితులు ఉదయ కుమార్ రెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌ రెడ్డి, పరమేశ్వరరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, వై.యస్. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, వై.యస్.మనోహర్ రెడ్డి, వై. యస్. అవినాష్ రెడ్డి, సిఐ శంకరయ్య, ఏఎస్ఇ రామకృష్ణారెడ్డి, ఇసి సురేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మారెడ్డి రవీంద్ర నాథరెడ్డి, ఘటనా స్థలంలో ఉన్నవారి సన్నిహితుల సలహాలు సూచనలు తీసుకున్న తరువాత తమకు కొందరిపై అనుమానాలు ఉన్నాయని పై జాబితాను సునీత కోర్టుకు సమర్పించారు.

viveka 110320520 1

కేసు విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సిబిఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. గతంలో హైకోర్టులో పిటీషన్ వేసిన విషయాన్ని కూడా సునీత మరోసారి గుర్తు చేశారు. గవర్నర్‌ను కలిసి కూడా విజృప్తి చేశామని ఆమె వెల్లడించారు. కేసు దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని తమకు న్యాయం చేయాలని కోరారు. ఏపి పోలీసులపై నమ్మకం లేదని అప్పట్లో చెప్పి ఇప్పుడు మరలా అదే పోలీసులతో దర్యాప్తు జరపడం ఎంతవరకు సమంజసం? అని 3 సిట్ టీమ్ లు ఏర్పాటు చేసిన దర్యాప్తు ఓ కొలిక్కిరాలేదని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కోర్ట్, సిబిఐ విచారణకు ఆదేశాలు ఇస్తూ, నిర్ణయం తీసుకోవటంతో, ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి...

రాష్ట్రంలో వైకాపా నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని మండిపడ్డారు. బుద్దా వెంకన్న, బొండా ఉమ వాహనంపై వైకాపా శ్రేణుల దా-డి ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్దా వెంకన్న, బొండా ఉమ వాహనంపై వైకాపా శ్రేణుల దా-డి ఘటన మీద తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. కారును వెంబడించి దా-డి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్దుర్తి సీఐ కారును సైతం అడ్డగించారని మండిపడ్డారు. మాచర్లలో దా-డిపై డీజీపీ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇంత జరుగుతున్నా డీజీపీకి చీమకుట్టినట్లు లేదని ఆరోపించారు. ముందుగానే ఎస్పీకి చెప్పినా ఇలా జరిగిందంటే ఏమనాలని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ప్రెస్ తో మాట్లాడుతూ ఉండగానే, మాచర్లలో జరిగిన దా-డి విషయం పై, బుద్దా వెంకన్న, బొండా ఉమాకు ఫోన్ చేసారు. అక్కడ జరిగిన భయానక పరిస్థితి పై, వారు ఫోన్ లో చంద్రబాబుకి మొత్తం వివరించారు.

phone 1103220 2

బొండా ఉమతో మాట్లాడిన చంద్రబాబు "నిన్న నామినేషన్‌ ప్రక్రియను అడ్డుకున్నారని మేము వెళ్లాం. నేను, బుద్దా వెంకన్న వెళ్తున్న కారుపై ఒక్కసారిగా దా-డి చేశారు. న్యాయవాది కిశోర్‌ తలపై క-ర్ర-ల-తో దా-డి చేశారు. వారినుంచి తప్పించుకుని మార్కాపురం వైపు వెళ్తుంటే మళ్లీ అడ్డుకున్నారు. మాకు సంరక్షణగా వచ్చిన డీఎస్పీ వాహనంపైనా దా-డిచేశారు. ప్రా-ణా-ల-తో బయటపడతామో లేదోనన్న భయం వేస్తోంది. పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు"- చంద్రబాబుతో బొండా ఉమ. "రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దా-డి ఘటన పై బుద్దా వెంకన్నతో మాట్లాడిన చంద్రబాబు.

"మా ప్రా-ణా-లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అడుగడుగునా మాపై వైకాపా కార్యకర్తలు క-ర్ర-ల-తో దా-డిచేశారు. పోలీసులు వస్తే వాళ్ల వాహనంపైనా దా-డికి పాల్పడ్డారు. 20 నుంచి 30 మంది పోలీసులు మాతో ఉన్నా దా-డి-కి పాల్పడ్డారు"-బుద్దా వెంకన్న. వాళ్లిద్దరూ చ-ని-పో-తే ఎవరు బాధ్యత వహిస్తారని చంద్రబాబు నిలదీశారు. ప్రజాస్వామ్యం కోసం ప్రా-ణా-లు వదలాలా అని ప్రశ్నించారు. నియంత పాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని... వైకాపాకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని చంద్రబాబు అన్నారు. పోలీసుల వాహనాలపైనా దా-డిచేసే పరిస్థితి తీసుకొచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైకాపా నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శులను బంధించి సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.

చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు చంద్రబాబు ఫోన్ చేసారు. పుంగనూరు నియోజకవర్గంలో పరిస్థితుల పై ఫిర్యాదు చేసారు. నామినేషన్లు వేయకుండా అభ్యర్ధులను మంత్రి పెద్దిరెడ్డి అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వవద్దని పెద్దిరెడ్డి ఆదేశాలపై చంద్రబాచంద్రబా ధ్వజమెత్తారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని చంద్రబాబు అన్నారు. ఎస్పీ చొరవ తీసుకుని అభ్యర్ధులకు భద్రత కల్పించాలని అన్నారు. ఎన్నికల నేరగాళ్లను నియంత్రించాలని,పెద్దిరెడ్డి అనుచరుల దౌర్జన్యాలను అడ్డుకోవాలని అన్నారు. అన్నిచోట్ల నామినేషన్లు పడేలా అధికారులే శ్రద్దచూపాలని, అభ్యర్ధులు అందరికీ సర్టిఫికెట్లు అందేలా చూడాలని, సర్టిఫికెట్లు అందక పోటీచేయలేని దుస్థితి ఉండరాదని అన్నారు. అది ప్రజాస్వామ్యానికే తీరని కళంకం అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే అని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాలని, వైసిపి ఫ్యూడల్ పోకడలకు అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరారు.

ఇక అంతకు ముందు, పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పులిచర్ల, సదూం మండలాల్లో నామినేషన్లు వేయకుండా పెద్దిరెడ్డి బెదిరించడంపై నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వవద్దని అధికారులను మంత్రి బెదిరించడంపై చంద్రబాబు మండిపడ్డారు. ఫ్యూడలిస్ట్ పోకడలకు కాలం చెల్లిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. స్థానిక సంస్థల స్ఫూర్తినే సీఎం జగన్ కాలరాస్తున్నారని, పంచాయితీ రాజ్ చట్టాలను, ఎలక్షన్ మాన్యువల్ ను, కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అపహాస్యం చేస్తున్నారని, అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే బుద్ది చెబుతారని ధ్వజమెత్తారు.సర్టిఫికెట్లు సకాలంలో ఇవ్వకుండా గ్రామాల్లో ఉద్రిక్తతలు రెచ్చగొడితే, ఏర్పడే దుష్పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

అభ్యర్ధులకు కావాల్సిన సర్టిఫికెట్లు ఇప్పించే బాధ్యత ఎన్నికల సంఘానిదే అన్నారు. సర్టిఫికెట్లు అందక అభ్యర్ధులు పోటీచేయలేని దుస్థితి ఉండకూడదని అన్నారు. అధికారులు నలుగురికి కావాల్సిన వాళ్లంటూ, పార్టీలతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా పని చేయాలని అన్నారు. వైసిపి పట్ల వివక్షత చూపించి, విద్యుక్త ధర్మ నిర్వహణకు ద్రోహం చేయకూడదని అన్నారు. పోటీబడి గెలవాలే తప్ప ఇలాంటి దుష్టపన్నాగాలు పిరికిచేష్టలుగా ధ్వజమెత్తారు. ఓడిపోతామనే భయంతోనే ఈ విధమైన దుర్మార్గాలకు వైసిపి బరి తెగించిందని మండిపడ్డారు. పోటీకి అడ్డంకులు కల్పించడం ద్వారా ఏకగ్రీవం చేయాలనే వైసిపి నేతల కుట్రలను ప్రజలే భగ్నం చేయాలని అన్నారు. ప్రతిచోటా నామినేషన్లు పడేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపైనే ఉందని అన్నారు. మరో రెండురోజుల్లో తానే క్షేత్రస్థాయి పర్యటనకు వస్తానంటూ, ప్రజాక్షేత్రంలో వైసిపి ఫ్యూడల్ చర్యలను ఎండగడతామని హెచ్చరించారు.

గుంటూరు జిల్లా మాచర్లలో బుద్దా, బొండా ఉమ వెళ్తున్న వాహనంపై వైసీపీ గుం-డా-లు దా-డి చేశారు. వైకాపా యువజన విభాగం నాయకులు క-ర్ర-ల-తో దా-డి చేశారు. దా-డి నుంచి బుద్దా వెంకన్న త్రుటిలో బయటపడ్డారు. డ్రైవర్ అప్రమత్తతతో ముప్పు తప్పింది. వెల్దుర్తి వద్ద ఇద్దరు వెళ్తున్న వాహనంపైనా వైకాపా నాయకులు దా-డి చేశారు. ఇదే దా-డిలో వేరే కారులో ఉన్న, తెలుగుదేశం పార్టీ అడ్వకేట్ పారా కిషోర్ పై కూడా దా-డి చేసారు. ఆయనకు ఒంటి నిండా ర-క్తం కా-రు-తుం-ది. పెద్ద పెద్ద కర్రలతో దా-డి చెయ్యటం, కారులు వెంట వెంటపడటం ఇవన్నీ చూస్తుంటే, దా-డి చెయ్యటానికి కాదని, వారిని చం-ప-టా-ని-కి ప్రయత్నం జరిగినట్టు చెప్తుంది. తెలుగుదేశం నేతలు ఇంకా అక్కడే ఉండటంతో, టెన్షన్ వాతావరణం నెలకొంది. అడ్వకేట్ పారా కిషోర్ పక్కన ఉన్న తెలంగాణా బోర్డర్ కు పారిపోయారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో, మాచర్లలో తెలుగుదేశం పార్టీ తరుపున నామినేషన్లు కూడా వెయ్యనియ్యటం లేదు అని తెలిసి, అక్కడకు స్వయంగా వెళ్లారు, బుద్దా, బొండా ఉమ.

తెలుగుదేశం నేతలు పర్యటిస్తున్న విషయం తెలుసుకున్న వైసీపీ గుం-డా-లు ద్విచక్రవాహనాలపై వెంబడించి కర్రలు, ఇనుపరాడ్లతో దా-డి చేశారు. డ్రైవర్‌ అప్రమత్తతో వ్యవహరించి కారును వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో బుద్దా వెంకన్న, బొండా ఉమా దా-డి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ దా-డి చూసిన టిడిపి నేతల గన్ మెన్, అక్కడ వాతావరణం చూసి భయపడి పారిపోయినట్టు తెలుస్తుంది. మరో పక్క, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రమేష్‌కుమార్‌కు చంద్రబాబు లేఖ రాశారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని లేఖలో ఆక్షేపించారు. పోటీచేసే అభ్యర్థులకు కావాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రమేష్‌కుమార్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో అరాచకాలపై లేఖలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గం పోలీసు అధికారులు పని గట్టుకుని పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించే వాతావరణం లేకుండా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెదేపా కార్యకర్తలు, నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈసీ వీటన్నింటినీ సుమోటాగా తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని లేఖలో ఆక్షేపించారు. పోటీచేసే అభ్యర్థులకు కావాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. సదుం మండలంలో పెద్దిరెడ్డి అనుచరుల వేధింపులు, బెదిరింపులు చేస్తున్నారన్న చంద్రబాబు... అధికారుల వ్యవహారశైలిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తున్నారని వివరించారు.

Advertisements

Latest Articles

Most Read