జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వి-వే-కా-నం-ద-రె-డ్డి హ-త్య-కే-సు విచారణను గురువారం హైకోర్టు ఈ నెల24కు వాయిదా వేసింది. వి-వే-కా-నం-ద హ-త్య-కే-సును సిబిఐకి అప్పగించాలంటూ ఆయన కుమార్తె, భార్యలతో పాటు, బిటెక్ రవి, మాజీమంత్రి ఆది నారాయణరెడ్డిలు వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేసారు. వివక్షనేతగా ఉండగా జగన్ కుడా వి-వే-కా కేసును సిబిఐకి అప్పగించాలని పిటీషన్ దాఖలు చేసారు. అయితే ఆయన ఈ పిటీషన్ ఇటీవల ఉవసంహరించుకున్నారు. ఈ క్రమంలో వి-వే-కా హ-త్య-కే-సు-లో సిట్ విచారణ పూర్తి కావోస్తున్నందున కేసును కీలక సమయంలో సిబిఐకి అప్పగించడం అవసరంలేదని ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. సిట్ విచారణ నివేదికను అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి సీల్డ్ కవరులో అందజేసారు. ఈ కేసులో డైరీ, ఇతర కీలక పైల్స్ ను సోమ వారానికి న్యాయస్థానానికి సమర్పించా లని న్యాయస్థానం ఆడ్వోకేట్ జనరలను ఆదేశించింది.
అయితే ఈ సందర్భంలో, పిటీషన్ తరుపు లాయర్, సంచలన విషయాలు కోర్ట్ కు చెప్పారు. వి-వే-కా కేసులో, రాజకీయ ప్రముఖులు ఉన్నారని, వారిలో ఐదుగురు ముఖ్య నేతలు ఉన్నారని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారని, ఏదైనా తారుమారు చేసే అవకాసం ఉందని, అందుకే ఈ కేసును సిబిఐకి ఇవ్వాలి అంటూ, పిటీషన్ తరుపు లాయర్, హైకోర్ట్ ని కోరారు. మొన్నటి దాకా సిబిఐ కావలి అంటూ, గోలగోల చేసిన జగన్, ఇప్పుడు ఎందుకు కోరటం లేదని, అన్నారు. వి-వే-క హత్య కేసులో, ఆయన సమీప బంధువు ఉన్నారని, తమ అనుమానం అని, 9 నెలలు అయినా, ఈ ప్రభుత్వంలో ఒక్క క్లూ కూడా దొరకలేదని, దీని వెనుక శక్తివంతమైన రాజకీయ ప్రముఖుడి హస్తం ఉందంటూ, హైకోర్ట్ ముందు సంచలన వ్యాఖ్యలు చేసారు, పిటీషనర్ తరుపు లాయర్.
వి-వే-క భార్య, కూతురు, అల్లుడు తరుపు లాయర్, వీరారెడ్డి కూడా, కోర్ట్ ముందు గట్టి వాదనలు వినిపించారు. గతంలో భార్య సౌభాగ్యమ్మ పిటీషన్ వేసినప్పుడు మౌనంగా ఉన్న ప్రభుత్వం, ఆయన కూతురు, అల్లుడు మరో పిటీషన్ వేస్తే మాత్రం, దర్యాప్తులో జాప్యానికి కారణం మేమేనని ప్రభుత్వం నిందమోపుతోంది అంటూ ఆయన వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరుపు లాయర్ మాత్రం, సిబిఐ విచారణ అవసరం లేదని వాదిన్కాహారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్ని కలకు ముందు 2019 మార్చి 15న వి-వే-కా-నం-ద-రె-డ్డి పులివెందులలోని తన ఇంట్లో హ-త్య-కు గురయ్యారు. ఈ కేసులో 11నెలలు అవుతున్నా దోషులు ఎవ్వరో తెలియలేదు. దీంతో ఆయన కుమార్తె డాక్టర్ సునీత కేసును సిబిఐకి అప్పగించాలని తాజాగా హైకోర్టును అభ్యర్థించారు. ఇదే అంశంపై దాఖలైన కేసులన్నింటిని హైకోర్టు ఏకకాలంలో విచారిస్తుంది.