అమరావతి రాజధానిలోని భూములను పేదల ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం రెండు వేల నుండి నాలుగు వేల ఎకరాల భూమిని సిద్ధం చేశారు. నవరత్నాల పథకంలో భాగంగా ఇళ్లు లేని పేదవారికి సెంటు భూమి చొప్పున రాష్ట్రంలో 25 లక్షల మంది పేదవారికి ఉగాది నాటికి ఇంటి పట్టాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రిష్ణా, గుంటూరు జిల్లాలలోని పేదవారందరికి సరిపడ ఇంటి స్థలాల భూమి లేక పోవటంతో రాజధాని ప్రాంతంలోని శాఖమూరు, పెనుమాక, కృష్ణాయపాలెంతో పాటు మరి కొన్ని ప్రాంతాలలో పేదవారి ఇంటి స్థలాల కోసం భూమిని రెవిన్యూ శాఖ గుర్తించింది. రాజధానిలో ఇంటి స్థలం తీసుకోనేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని లబ్ధిదారుల నుండి అంగీకార పత్రం ఇవ్వాలని వారిని కోరుతున్నారు. అయితే విజయవాడలో నివాసముంటున్న తమకు రాజధానిలో ఇంటి స్థలం ఇవ్వటం ఏమి టని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంటి స్థలం రాజధానిలో ఇస్తే కూలీ పనుల కోసం విజయవాడ వెళ్లి రావటానికి చాలా ఖర్చలు అవుతాయన్నారు.

amaravatifarmers 20202020 2

గత టీ.డీ.పీ ప్రభుత్వం కాలంలో తమకు ఇళ్లును కేటాయించారని, ఆ సమయంలో ఇంటికి 25 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు ప్రభుత్వానికి చెల్లించామన్నారు. అప్పుడు ఇంటి కోసం అప్పు తెచ్చి ప్రభుత్వానికి డబ్బులు కట్టామని, వాటి గురించి ప్రస్తుత ప్రభుత్వం పట్టించు కోకుండ రాజధానిలో ఇంటి స్థలం ఇస్తామంటే ఉపయోగం ఏమి ఉంటుందని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం రైతుల నుండి 34 వేల ఎకరాల భూమిని సేకరించింది. ఈ భూములలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ , మంత్రులు, యం. ఎల్.ఏ లు, ఐఎయస్, ఐపియస్, ఉన్నతాధికారులు, ఉద్యోగుల భవనాలను నిర్మిస్తున్నారు. వీటితో పాటు కార్పొరేట్ సంస్థలకు, విద్యా సంస్థ లకు, వైద్యశాలలకు గత ప్రభుత్వం భూములను కూడా కేటాయి చారు. ముఖ్యంగా రహదారులు, పార్కుల నిర్మాణం తో పాటు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు పాట్లును అభివృద్ది చేసి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది.

amaravatifarmers 20202020 3

అయితే సార్వతిక ఎన్నికలలో వైసిపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని తరలి ంపుతో పాటు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీంతో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని 65 రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల అభివృద్ది ,రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చామని రాజ ధాని ప్రాంత ప్రజలు, రైతులు అంటున్నారు. నిన్న కృష్ణాయపాలెంలో, భూములు సర్వే కోసం, వచ్చిన అధికారులను, అక్కడ రైతులు అడ్డుకున్నారు. ఒక పక్క మేము ఇక్కడ ఆందోళన చేస్తుంటే, మా భూములు వేరే వారికి ఇవ్వటం ఏమిటి అని నిలదీసారు. దీంతో, దాదాపుగా 426 పై, 7 సెక్షన్ ల కింద ఈ రోజు కేసులు నమోదు చెయ్యటం సంచలనంగా మారింది.

రాష్ట్రంలో, అమరావతి మార్పు తరువాత, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మరో నిర్ణయం,కొత్త జిల్లాల ఏర్పాటుకు తాత్కాలిక బ్రేక్ పడింది. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలను 25 జిల్లాలుగా మార్చాలని నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 25 జిల్లా కేంద్రాలుగా మార్చేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం జగన్ ఆదేశాలకు అనుగుణంగా కొత్త జిల్లాలకు చెందిన ప్రతిపాదనను రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపారు. జగన్ ఢిల్లీ టూర్లో సైతం ఇదే అంశాన్ని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు వివరించారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు దాదాపుగా ఖరారు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సూచించింది.

దేశ వ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక జన గణన రూపొందించనున్న నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో సమస్యలు తలెత్తుతాయని, ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జన గణన ప్రక్రియ 2021 మార్చి 31 వరకు జరుగుతుందని అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలిపింది. సరిహద్దుల మార్పుతో పౌరుల వివరాల సేకరణకు ఇబ్బంది కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. జిల్లాలు, మండలాల సరిహద్దులు మారడం వల్ల జనగణన సిబ్బంది పలు ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు దాదాపు బ్రేకులు పడినట్లు అయ్యింది.

జనగణన ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఏడాది అనంతరమే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిల్లాలు ఇవే.. నవ్యాంధ్రలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా ప్రభుత్వం మరో 12 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక్కొ జిల్లాగా ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతి పాదించిన దాని ప్రకారం అనకాపల్లి, అరకు, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, విజయవాడ, నర్సరావుపేట, బాపట్ల, తిరుపతి, రాజంపేట, నంద్యాల, హిందుపురంలను కొత్త జిల్లాలుగా ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

సీనియర్ ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపి ఇంటెలిజన్స్ చీఫ్ గా నియమించేందుక వైఎస్ జగన్మోహనరెడ్డి తన ప్రయత్నాలను తిరిగి కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర నియామక అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాస్తవానికి రవీంద్రను ఏపీ ఇంటెలిజన్స చీఫ్ గా నియమించేందుకు జగన్ గత ఏడాది జూన్ లోనే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల మూలంగా ఈ అంశం వాయిదా పడింది. తాజాగా అమిత్ షాతో భేటీ అనంతరం ఈ అంశం వెలుగులోకి వచ్చింది. తెలంగాణాలో ఐజిగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర 1999 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలని గత ఏడాది జూన్లో వైఎస్ జగన్ తెలంగాణా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి కళ్లు, ముక్కు, చెవుల మాదిరిగా వ్యవహరించాల్సి ఉన్న ఇంటెలిజన్స్ విభాగానికి ఐజి స్థాయి అధికారిని నియమించాలని ఏపీ ప్రభుత్వం భావించి తెలంగాణా ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదనకు తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎఓసి ఇచ్చింది. 

తదుపరి ఇదే అంశాన్ని కేంద్ర హోంశాఖకు నివేదించారు. అపుడు తనకు ఏపీ ఇంటెలిజన్స్ చీఫ్ పోస్టు ఖాయమవుతుందని భావించిన స్టీఫెన్ రవీంద్ర సెలవు పెట్టి అమరావతిలో నెల రోజులు మకాం వేశారు. అయినప్పటికి కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో తన సెలవును మరొ 15 రోజులు పొడిగించుకున్నారు. అప్పటికి కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తెలంగాణా ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి ఆయన తన పోస్టులో జాయిన్ అయ్యారు. అయితే కేంద్రం నుంచి ఇంటర్ క్యాడర్ డిప్యుటేషను అనుమతి లభించక పోవడంతో ఆ ప్రతిపాదనకు తాత్కాలికంగా బ్రేకు పడిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆలిండియా సర్వీసు నిబంధనలను అనుసరించి ఇంటర్ క్యాడర్ బదిలీలను అదే సర్వీసులో ఉండి వేరే రాష్ట్రంలో పనిచేస్తున్న వారితో వివాహం చేసుకునే సందర్భంలోను, అసమాన్య ప్రతిభా పాటవాలు కనబరచిన సమయంలో సంబంధిత ఉన్నతాధికారి నిర్ణయం మేరకు మాత్రమే చేయాల్సి ఉంటుంది.

కాగా పోలీసు అధికారులు ఎవరైతే సూపర్‌టైం స్కేల్ (ఐజి ర్యాంక్) పొందుతున్నారో వారు ఇంటర్ క్యాడర్ డిప్యుటేషనుకు అనర్హులు. ఈ నిబంధన ప్రకారం రవీంద్ర ఐజి ర్యాంక్ అధికారి కావడంతో ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్ సాధ్యపడలేదు. మరో కోణంలో చూస్తే ఏరాష్ట్రంలో అయినా ఆ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అతని ప్రా-ణా-ని-కి హా-ని కలిగే అవకాశం ఉన్నట్లయితే ఆ సమయంలో ఇంటర్ క్యాడర్ బదిలీకి అవకాశం ఉంటుంది. అయితే గతంలో రవీంద్ర పోలీసుశాఖలో చేపట్టిన సంస్కరణల దృష్ట్యా ఆయనను ఇంటర్ స్టేట్ బదిలీకి అర్హునిగా పరిగణించి తమ అభ్యర్థనను గౌరవించాల్సిందిగా జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఇందుకా అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే మార్చి మొదటి వారానికి స్టీఫెన్ రవీంద్ర ఏపీలో బాధ్యతలు స్వీకరించే అవకాశం లేకపోలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.

ఆయన మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలోనే నాయకుడిగా ఎదిగారు. చంద్రబాబు గుర్తించి, ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇచ్చారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. కాపు సామజికవర్గ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు కూడా. అయినా సరే, మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో, ఆయన కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్ళిపోయారు. వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిడిలో, లేకపోతే మరే కారణమో కాని, ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన దగ్గర నుంచి అనేక అవమానాలు ఎదుర్కుంటునే ఉన్నారు. పోనీ కాపు నాయకుడు అని చెప్పుకుంటూ, కాపులకు జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారా అంటే అదీ లేదు. చంద్రబాబు ఇచ్చిన 5 శాతం కాపు రిజర్వేషన్ ఎత్తేసినా నోరు పెగలలేదు. కాపు కార్పొరేషన్ పూర్తిగా సైలెంట్ అయిపోయినా నోరు ఎత్తలేదు. అమ్మ ఓడి కోసం, నిధులు అన్నీ మళ్ళిస్తున్నా, మాట్లాడలేదు. ఇలా కాపులకు ఎంత అన్యాయం జరుగుతున్నా, తోట త్రిమూర్తులు పట్టించుకోలేదు.

పోనీ వైసీపీలో ఆయనకు గుర్తింపు ఉందా అంటే అది కూడా లేదు. ఈ రోజు ఏకంగా చెప్పు దెబ్బలు తిన్నారు, తోట త్రిమూర్తులు. ఈ రోజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో ఆత్మీయ సమావేశం జరిగింది. తోట త్రిమూర్తులు, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, తోట త్రిమూర్తులుకు వ్యతిరేకంగా వేణు కూడా హాజరు అయ్యారు. అయితే, వైవీ సుబ్బారెడ్డి, తోట త్రిమూర్తులు ఒకే కారులు వచ్చారు. అయితే, తోట త్రిమూర్తులు కారు దిగగానే, తోట త్రిమూర్తులుకు వ్యతిరేకంగా వేణు వర్గంలోని ఒక వ్యక్తి, తోట త్రిమూర్తుల పై, చెప్పుతో బాదుతూ దాడి చేసారు. ఈ పరిణామంతో అందరూ అవాక్కయ్యారు. సొంత పార్టీలోనే, ఇలా సీనియర్ నాయకుడు, కాపుల్లో మంచి పేరు ఉన్న తోట త్రిమూర్తుల పై, ఏకంగా చెప్పుతో దాడి చెయ్యటం సంచలనంగా మారింది.

మరో పక్క, తోట త్రిమూర్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా వేణు వర్గం, చించి వేసి తగులబెట్టింది. మొత్తంగా, ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్త వాతవరణం చోటు చేసుకుంది. రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వర్గానికి చెందిన వారు, వైవీ సుబ్బారెడ్డి కారుని అడ్డుకుని నినాదాలు కూడా చేసారు. తోట త్రిమూర్తులుకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ, నినాదాలు చేసారు. ఇదే సందర్భంలో ఫ్లెక్స్ లు తగలు బెట్టటం, చెప్పులతో దాడి చెయ్యటం, అక్కడే ముగ్గురు మంత్రులు, ఒక టిటిడి చైర్మెన్ ఉండటంతో, వైసీపీలో పరిస్థితి ఎలా ఉందొ అర్ధం అవుతుంది అంటూ, క్యాడర్ నిరుత్సాహంతో ఉండి పోయింది. మొత్తంగా టిడిపిలో దర్జాగా బ్రతికిన తోట త్రిమూర్తులు, వైసీపీలో చేరి, చెప్పు దెబ్బలు తిన్నారు.

Advertisements

Latest Articles

Most Read