ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశ రాజధాని ఢిల్లీలోనూ సీన్ మారింది. రాష్ట్రంలో అధికా రంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ భవన్లోనూ టిడిపిని బుల్ డోజ్ చేసింది. ఒకప్పుడు తెలుగుదేశంపార్టీకి పార్లమెంట్ భవన్లో అత్యంత ప్రాధాన్యత ఉండగా, ఇప్పుడు ఎక్కువ మంది ఎంపీలు ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హడావిడి చేస్తుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ భవన్లో స్థాన చలనం కలిగింది. ఈ లోపు మూడు గండాలు దాటుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ సారి తన కార్యాలయన్ని తరలించక తప్పలేదు. పార్లమెంట్ భవన్లో అందరికీ తెలిసిన లోకసభ, రాజ్యసభ, జాయింట్ సెషన్ నిర్వహించేటప్పుడు ఉపయోగించే సెంట్రల్ హాల్ తో పాటు, ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రుల కార్యా లయాలు ఉంటాయి. అలాగే సంఖ్యా బలం ఆధా రంగా రాజకీయ పార్టీలకు కూడా గదులను కేటా యిస్తూ ఉండటం సర్వసాధారణం. పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 41 గదులు ఉండగా, 9, 10వ నెంబర్ గదుల్లో ప్రధాన మంత్రి కా ర్యాలయం, 8వ నెంబర్ గదిలో హోం మంత్రి అమిత్ షా కార్యాలయం ఉన్నాయి.

6, 7వ నెంబర్ గదుల్లో కీలక మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి. 2వ నెంబర్ నుండి 4వ నెంబర్ వరకూ భారతీయ జనాతా పార్టీ కార్యాలయం, ఎన్డీయే నేత కార్యాలయాలు ఉన్నాయి. వీటి మధ్యలో 5వ నెంబర్ గదికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అర్థమవుతోంది. అటువంటి ప్రాధాన్యత కలిగిన ఆ గదిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయంగా కొనసాగింది. ఐదేళ్లు, పదేళ్లు కాకుండా ఏకంగా 3 దశబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయమే ఆ గదిపై అధికారం చెలాయించింది. ఈ విధంగా 1989 సంవత్సరం నుండి ఆ గది తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయంగా ఉండేది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కాని, టిడిపి గది మాకే కావాలి అని పట్టుబట్టటంతో ఇప్పుడు ఆ కార్యాలయాన్ని 3వ అంతస్తులోనికి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3వ అంతస్తులోని 118వ నెంబరకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయాన్ని తరలించాల్సి వచ్చింది.

పార్లమెంట్ భవన్ లో గదుల కేటాయింపు ఎలా జరుగుతుందోనని పరిశీలిస్తే పార్టీల సంఖ్యా బలం ఆధారంగా పార్లమెంట్ భవనంలోని గదులను లోక్ సభ స్పీకర్ రాజకీయ పార్టీల పార్లమెంట్ రీ కార్యా లయాలను కేటాయిస్తుంటారు. ఎక్కువ మంది ఎంపీలు కలిగిన రాజకీయ పార్టీలకు ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రుల కార్యాలయాలు ఉండే గ్రౌండ్ ఫ్లోర్లో గదులు లభిస్తాయి. మిగిలిన పార్టీలకు 3వ అంతస్తులోని గదులను కేటాయించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలు గుదేశం పార్టీకి 1989లో నాటి పార్టీ ఎంపీల సంఖ్యా బలం ఆధారంగా పార్లమెంట్ భవన్లోని గ్రౌండ్ ఫ్లోర్ 5వ నెంబర్ గదిని కేటాయించారు. 1989 తర్వాత పార్టీ సంఖ్యా బలం తగ్గిన 3 సందర్భాల్లో ఆ గదిని టీఎంసీ, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు కేటాయించారు. అయితే ఏ సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ మాత్రం తమ కార్యాలయాన్ని ఖాళీ చేయకుండా నాటి స్పీకర్లతో మాట్లాడి 5వ నెంబర్ గదిలోనే ఉండిపోయింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల సంఖ్య లోకసభ, రాజ్య సభల్లో కలిపి 5 గురితో ఉంది.

దీంతో స్పీకర్ 5వ నెంబర్ గదిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలుగుదేశం పార్లమెంటరీ సభ్యులకు 3వ అంతస్తులోని రూమ్ నెంబర్ 118 కేటాయించారు. అయితే 17వ లోకసభ ఏర్పాటు అయిన తర్వాత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు కూడా జరిగాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆ 5వ నెంబర్ గదిని ఖాళీ చేయకపోవడంతో విజయసాయి రెడ్డి, బయటి శక్తుల ద్వారా ఒత్తిడి తీసుకొస్తూ ఆ గదిని ఖాళీ చేయకుండా తెలుగుదేశం పార్టీ కొనసాగుతోందని ఆరోపిస్తూ ఒక లేఖను స్పీకర్ కు రాశారు. దీంతో స్పీకర్ వెంటనే స్పందిస్తూ పార్లమెంట్ భవన్ గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదిని ఖాళీ చేసి దాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యులకు అప్పగించాలని తెలుగుదేశం పార్టీకి ఒక లేఖ కూడా రాశారు. దీంతో ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని 5వ నెంబర్ గది నుండి 118వ నెంబర్ గదికి తాజాగా తరలించడంతో త్వరలోనే ఆ 5వ నెంబర్ గదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేం దుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ గది కోసం, వైసీపీ ఎందుకు ఇంత మోజు పడుతుంది, ఎందుకు ఇంత పట్టుబడుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

ఏపీ అధికార పార్టీ వైసీపీ లో రాజ్యసభ ఆశావహుల సందడి మొదలైంది. ఏపీలో అధికారంలో కొచ్చిన తర్వాత అనేకమందికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు శాసనమండలి రద్దు కావడంతో రాజ్యసభకు ఒత్తిడి పెరిగింది. ఏపీ నుంచి ఈ ఏప్రిల్లో మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 11, తెలంగాణాకు 7 రాజ్యసభ సీట్లు కేటాయించారు. అందులో ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, కాంగ్రెస్ సభ్యుడు ఎంఏఖాన్ ఏప్రిల్ 9న వదవీ విరమణ చేయాల్సి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సభ్యుడైన టి.సుబ్బిరామిరెడ్డి, టీడీపీ సభ్యురాలు తోట సీతారా మలక్ష్మీ ఏప్రిల్ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా ఈ నాలుగు స్థానాలు మొత్తంగా వైసీపీకే దక్కనున్నాయి. ఇప్పటికే జగన్ ఈస్థానాలు ఎవరికి కేటాయించాలనే దానిపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో కేంద్రంతో సన్నిహిత సంబంధాల్లో భాగంగా ఈ నాలుగు స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది.

దీంతో చివరకు ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ వైసీపీలో మొదలైంది. ఇప్పటికే రాజ్యసభలో ఇద్దరు సభ్యులున్నారు. విజయసాయిరెడ్డితోపాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపి నుంచి సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో సామాజిక, ప్రాంతీయ సమతుల్యత పాటిస్తూ తన సభ్యులను ఎంపిక చేయనున్నారు. అందులో ప్రముఖంగా జగన్ నలుగురు పేర్లను వరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొదటి నుంచి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్న ఆళ్ల కుటుంబానికి చెందిన అయోధ్యరామిరెడ్డికి జగన్ రాజ్యసభ అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు సమచారం. అలాగే బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సుదీర్ఘకాలం టీడీపీలో ఉండి తాజాగా వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావుకు సైతం అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతుంది.

ఎస్సీ కోటాలో 2014లో టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా గెలిచి, 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పండుల రవీంద్రబాబు పేరు సైతం రేసులో ఉంది. తాజాగా ఒక ప్రముఖ పేరు ప్రచారంలోకొచ్చింది. న్యాయవ్యవస్థలో కీలకస్థానంలో వనిచేసిన ఓ ప్రముఖ వ్యక్తికి తన పార్టీ నుంచి రాజ్యసభకు పంపాలని పార్టీ భావిస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఆ ప్రముఖుడు మాత్రం అందుకు సిద్ధంగా లేరని తెలుస్తుంది. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు పేరు సైతం వైసీపీ నుంచి రాజ్యసభ రేసులో ఉంది. ఆయన కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. వైసీపీ నుంచి చిరంజీవికి సైతం ఛాన్స్ దక్కే అవకాశమందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీ నుంచి దక్కే నాలుగు సీట్లలో మూడు సీట్లు వైసీపీకి ఒక సీటు బీజేపీకి ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే వాదన ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

రాష్ట్ర సమస్యలు, ప్రజల ఆందోళనలు పట్టించుకోకుండా, ముఖ్యమంత్రి, మంత్రులు చంద్రబాబుపై, ఆయన కుటుంబసభ్యులపై నిందారోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీదాడుల గురించి, గత నాలుగురోజులుగా నిర్విరామంగా దుష్ర్ఫచారం చేస్తున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సూట్ కేస్ కంపెనీల ద్వారా లక్షలకోట్లు పోగేసుకొని, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ధైర్యం మంత్రులకు లేదన్న ఆయన, టీడీపీపై మాత్రం విషం చిమ్ముతున్నారని వెంకన్న దుయ్యబట్టారు. శ్రీనివాస్ ఇంటిలో ఏ సూట్ కేసులు దొరకలేదని ఐటీశాఖే స్పష్టంగా చెప్పిందని, రూ.2వేలకోట్లు దొరికాయని విష ప్రచారం చేస్తున్న వైసీపీనేతలు, మంత్రులు తమ తలలు ఎక్కడ పెట్టుకుంటారని ఆయన నిలదీశారు. రూ.2వేలకోట్లు దొరికాయని, ఆ సొమ్మంతా చంద్రబాబునాయుడిదేనని గగ్గోలు పెట్టిన వైసీపీబ్రందం ఆ మొత్తంసొమ్ము ఎక్కడుందో చూపాలని వెంకన్న డిమాండ్ చేశారు. సింగిల్ బెడ్ రూమ్ ఇల్లున్న శ్రీనివాస్ ఇంట్లో ఆ రూ.2వేలకోట్లు ఎక్కడ దాచారో, వైసీపీనేతలే చెప్పాలన్నారు. వైసీపీ చెబుతున్న రూ.2వేలకోట్లు ఉంచడానికి వెయ్యి సూట్ కేస్ లు కావాలని, శ్రీనివాస్ ఇంటిలో ఐటీవారికి ఒక్క సూట్ కేస్ కూడా దొరకలేదన్నారు. లక్షరూపాయలు, కోటి రూపాయల నోట్లు ఏవైనా జగన్ ముద్రించినట్లయితే, అప్పుడు రూ.2వేలకోట్లను తేలికగా దాచవచ్చన్నారు.

చంద్రబాబునాయుడు సమాజం గురించి ఆలోచిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి సమాజనాశనం గురించి ఆలోచిస్తూ, దాన్ని నాశనం చేసి, శ్మశానం చేయాలని చూస్తున్నాడన్నారు. జగన్ తన అక్రమ సంపాదనను ఇడుపులపాయ, లోటస్ పాండ్, బెంగుళూరు ప్యాలెస్ లలో దాచి ఉంచాడని, ఆ సొమ్ములో ఈడీ జప్తుచేసింది కేవలం రూ.43వేలకోట్లేనని, ఇంకా చేయాల్సిన సొమ్ము లక్షలకోట్ల వరకు ఉందన్నారు. ఎన్నికల ముందు రావాలి జగన్... కావాలి జగన్ అన్నవారే, ఇప్పుడు, పోవాలి జగన్... జైలుకుపోవాలి జగన్ అంటున్నారని బుద్దా ఎద్దేవాచేశారు. అడ్డగోలుగా ప్రజలసొమ్ము తినడానికే జగన్ రాజకీయపార్టీ పెట్టాడని, అధికారపీఠాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లు ఎలా దోచేయాలనేదాని గురించే ఆయన ఆలోచిస్తున్నాడని వెంకన్న తేల్చిచెప్పారు. వైసీపీ కార్యకర్తలే జగన్ పాలనచూశాక పోవాలి జగన్....పోవాలి జగన్ అనే పల్లవి పాడుతున్నారని, జగన్ చేస్తున్న పనులు అలాంటి స్థితిని కల్పించాడన్నారు.

విజయ్ మాల్యా తన మనసు మార్చుకొని ప్రజలసొమ్ముని తిన్నందుకు బాధపడుతూ, దాన్ని తిరిగిచ్చేయడానికి ముందుకొచ్చాదని, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ లో మాత్రం ఎక్కడా మచ్చుకైనా పశ్చత్తాపం కనిపించడంలేదన్నారు. చరిత్రలో చూసినట్లయితే చాణక్య_ చంద్రగుప్తులు ప్రజలకు మేలుచేయడానికి, వారి సంక్షేమం, సంతోషం కోసం పనిచేస్తే, జగన్ _ విజయసాయిరెడ్డి మాత్రం రాష్ర్టాన్ని ఎలా దోచుకోవాలి.. ప్రజల్ని ఎలా నాశనం చేయాలన్నదాని గురించే నిత్యం ఆలోచిస్తున్నారని వెంకన్న దుయ్యబట్టారు. తన పైశాచిక ఆనందం కోసం సమాజాన్ని భయపెట్టి, బతకడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు. జగన్ పాలనతో విసిగి, వేసారిన జనమంతా రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశానికే ఓటేయాలనే ధ్రఢసంకల్పంతో ఉన్నారని వెంకన్న స్పష్టంచేశారు.

వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపులతో ప్రతిపక్షాన్ని దెబ్బతీయటం, కల్లబొల్లి మాటలతో, తప్పడు సమాచారంతో ప్రజలను మభ్యపెట్టడమనే రెండు అంశాల ప్రాతిపదికనే రాష్ట్రంలో నయవంచక పాలన సాగిస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతటి నయవంచక పాలన ఎన్నడూ చూడలేదని ప్రజలు వాపోతున్నారన్నారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి అండగా ఉన్న బడుగు, బలహీన వర్గాలకు రాజశేఖర్ రెడ్డి తీరని అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి వారిపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ఎన్నికల వేళ బిసిలకు న్యాయం చేస్తానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాలపై కపట ప్రేమ చూపుతున్నాడన్నారు. బలహీన వర్గాల దుస్థితి గురించి ప్రభుత్వం వారిపై చూపుతున్న వివక్షను గురించి ప్రశ్నిస్తు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నేరానికి ఒక వ్యక్తిని ఉగ్రవాది మాదిరి అరెస్టు చేయటం జరిగిందన్నారు. బిసి కార్పొరేషన్ నిధులను అమ్మ ఒడి పథకానికి ఎలా మళ్లిస్తారని ప్రశ్నించినందుకు సదరు వ్యక్తిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పోలీసులు అతి దారుణంగా ప్రవర్తించారని మాజీ మంత్రి తెలిపారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఈ 8 నెలల్లో ఏం చేశాడో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఆయా వర్గాలకు వెచ్చించలేదన్నారు.

అమ్మ ఒడి పథకానికి నిధులు కేటాయించడం కోసం ఎస్ సి, ఎస్ టి, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల నిధులు మళ్లించడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్ కు బీసీలపై విశ్వాసం, నమ్మకం, ప్రేమ ఉంటే వారికి కేటాయించిన నిధులను ఇతర పథకాలకు మళ్లించడని మాజీ మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీ బాలికలకు సైకిళ్లు పంపిణీ చేయాలని భావిస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని నిరుపయోగంగా మార్చారన్నారు. చంద్రబాబు ఆదరణ పథకం తీసుకొచ్చి బీసీలను ఆర్థికంగా ఆదుకోవడానికి కృషి చేస్తే వైఎస్ వచ్చాక ఆ పథకాన్ని అటకెక్కించాడన్నారు. గత ప్రభుత్వం ఆదరణ -2 కింద బీసీలకు పంపిణీ చేసిన వివిధ రకాల పనిముట్లను ఆయా వర్గాలకు అందించడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాకపోవడం విచారకరమన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తూతూ మంత్రంగా పథకాలు ప్రారంభించడం, వెయ్యి మంది లబ్ధిదారులుంటే వందమందికి నిధులివ్వడం, గొప్ప పథకాలు అమలు చేస్తున్నామని డబ్బాలు కొట్టుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు .

ధాన్యం రైతులకు రూ. 2 వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోడంలేదన్నారు. అమాయకులపై కేసులు పెట్టడం తప్పా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఒరగబెట్టలేదన్నారు. నీచాతనీచమైన, అన్యాయమైన రాతలు రాస్తున్న సాక్షి పత్రిక తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అవినీతి పునాదులపై నిర్మితమైన సాక్షి రాతలు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఐటీ దాడులను తప్పుదోవ పట్టించేలా పంచనామా నివేదిక వచ్చే వరకూ ఆగకుండా రాష్ట్ర మంత్రులంతా మూకుమ్మడిగా దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా ప్రవర్తించారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రూ. 2 వేల కోట్లు దొరికాయంటే చంద్రబాబు ఇంట్లో ఇంకెన్ని వేల కోట్లు ఉంటాయోనని పెడార్ధాలు తీస్తూ వెకిలితనంతో ప్రవర్తించారన్నారు. మంత్రి బొత్స తానే స్వయంగా లెక్కపెట్టి రూ. 2 వేల కోట్లు ఇచ్చినట్టుగా మోతాదుకు మించి ప్రవర్తించారన్నారు. ఐటీ దాడులను అడ్డం పెట్టుకుని సాక్షి మీడియా, రాష్ట్ర మంత్రులు నిన్నటి వరకూ ఇష్టానుసారం ప్రవర్తించారన్నారు.

ఐటీ శాఖ పంచనామా బయటపడినా ....దాన్ని పట్టించుకోకుండా జరిగిన పొరపాటు తెలుసుకోకుండా మంత్రి బొత్స మేమెప్పుడన్నాం ...రెండు వేల కోట్లని మేమెప్పుడు చెప్పామంటూ బుకాయించడం సిగ్గుచేటన్నారు. ఎదుటి వ్యక్తులను విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోకుండా ,అపరిపక్వతతో జగన్ మెప్పుకోసం ప్రవర్తించి రాష్ట్ర మంత్రివర్గం మొత్తం అభాసుపాలయ్యింది. అక్రమాస్తుల కేసులో జగన్ కు సంబంధించి ఈడీ జప్తు చేసిన రూ. 43 వేల కోట్లకు సంబంధించిన కథనాన్ని సాక్షి లొ ఏనాడైనా ప్రచురించిడం కానీ అవినీతి కేసుల్లో ప్రధమ ముద్దియిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని కానీ ఒక్కరోజు కూడా రాయలేదన్నారు. పత్రికలంటే తరతమ భేదాలు లేకుండా వాస్తవాలు వెల్లడించేవిగా ఉండాలని అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న సాక్షి అసలు పత్రిక ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆ పత్రిక జగన్ రెడ్డి కరపత్రం అనడానికి ఇంతకంటే నిదర్శం ఏముంటుందన్నారు.

Advertisements

Latest Articles

Most Read