ఎందుకో కాని వైసీపీ ప్రభుత్వం పూర్తి కన్ఫ్యూషన్ లో ఉంది. మొన్నటికి మొన్న, క్యాబినెట్ సమావేశం పై ఎంత గందరగోళం జరిగిందో చూసాం. ముందుగా జనవరి 20న క్యాబినెట్ సమావేశం ఉంటుందని చెప్పారు. అయితే, ఉన్నట్టు ఉండి, కాదు కాదు, జనవరి 18నే క్యాబినెట్ అంటూ ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ ఏమైందో కాని, అందరూ రెడీ అవుతున్న వేళ, రాత్రికి రాత్రి, 18న క్యాబినెట్ సమావేశం కాదు, మళ్ళీ జనవరి 20 వ తేదీనే క్యాబినెట్ అంటూ, మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ కన్ఫ్యూషన్ ఎందుకు, సీనియర్ నేతలు ఏమి చేస్తున్నారు, అధికారులు ఏమి చేస్తున్నారు, లేక కేవలం జగన్ మాట ప్రకరామే ఇలా చేస్తున్నారా అనే విశ్లేషణలు వస్తున్నాయి. అయితే, ఇది మర్చిపోక ముందే, ఇప్పుడు మరో సారి ప్రభుత్వం మాట మార్చిన తీరు, మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మూడు రాజధానులు పెడుతున్నాం అని, విశాఖపట్నంలో సెక్రటేరియట్ పెడుతున్నాం అని చెప్పిన జగన్ ప్రభుత్వం, ఒక్క రోజు కాక ముందే విశాఖపట్నం ప్రజలకు షాక్ ఇచ్చింది.
ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు, విశాఖపట్నంలో జరపాలని, అక్కడ అన్ని ఏర్పాట్లు చెయ్యాలని, జగన్ తో పాటుగా, గవర్నర్, హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా వస్తున్నారు అంటూ, ఘనంగా ఏర్పాట్లు చెయ్యాలని, విశాఖ రాజధానిగా అసెంబ్లీలో బిల్ పెట్టిన తరువాత, మొదటి సారి జగన్ వస్తున్నారు కాబట్టి, ఘనంగా ఏర్పాట్లు ఉండాలని, ఆదేశాలు వెళ్ళాయి. దీనికి తగ్గట్టే అక్కడ ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. రామకృష్ణా బీచ్ రోడ్డులో గత వారం రోజులుగా పనులు జోరుగా సాగుతున్నాయి. ఏర్పాట్లన్నింటినీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఉన్నట్టు ఉండి, విశాఖపట్నంలో ఈ సారి రిపబ్లిక్ డే వేడుకుల జరగటం లేదని, పనులు ఆపెయ్యాలని, ఆదేశాలు వెళ్ళాయి.
అయితే , ఈ సారి కూడా రిపబ్లిక్ డే వేడుకలు, విజయవాడలోనే జరుగుతాయని, జగన్ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ న్సిపల్ స్టేడియంలోనే ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మళ్ళీ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ రంగంలోకి దిగింది. విజయవాడలో ఏర్పాట్లు చెయ్యటానికి రెడీ అయ్యారు. అయితే ఈ నిర్ణయం ఎందుకు మారిందో, ఎందుకు తీసుకున్నారో తెలియదు. వైసీపీ మాత్రం, జగన్ నిర్ణయం మార్చుకున్నారని, విజయవాడ ప్రజల్లో అభద్రతా భావం నెలకొనకుండా, ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ లీకులు ఇస్తున్నారు. మరి ఇది నిజమో కాదో కాని, మరోసారి ప్రభుత్వం ఎంత కన్ఫ్యూషన్ లో ఉందొ, నిర్ణయాలు ఎన్ని సార్లు మారుస్తుందో, ప్రజలు గమనిస్తున్నారు.