తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఈ రోజు తన అఫిషియల్ ఫేస్బుక్ పేజ్ లో పెట్టిన ఒక పోస్ట్, ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదే జరిగితే, రాష్ట్ర రాజకీయాలను కుదిపే అంశం అవుతుంది. ఇది ఆయన పెట్టిన పోస్ట్. "బిగ్ బ్రేకింగ్ ఢిల్లీ..... జగన్ కు బెయిల్ రద్దు చేసే యోచనలో CBI...??? విజయ సాయి రెడ్డి లేవనెత్తిన విషయాన్ని సున్నితంగా తిరస్కరించిన కేంద్రం...!" అంటూ బొండా ఉమా పోస్ట్ చేసారు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి, శుక్రవారం మినహయింపు పిటీషన్ పై, సిబిఐ ఇచ్చిన గట్టి కౌంటర్ చూసి, త్వరలోనే ఏదో జరగబోతుంది అంటూ, ప్రచారం జరుగుతుంది. సిబిఐ అంత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వటం వెనుక, కేంద్ర హోం శాఖ ఉందని ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం కోర్ట్ కి రావాలని, అడిగినందుకే, ఇంత గట్టిగా సిబిఐ వాదించటం పై, చర్చ జరిగింది. ఆయన ఇప్పుడు సియంగా ఉన్నారని, సాక్షులని ప్రభావితం చేస్తారని సిబిఐ కోర్ట్ కు చెప్పటంతో, కోర్ట్ సిబిఐ వాదనతో ఏకీభవించింది.

bonda 17112019 2

అయితే, త్వరలొనే సిబిఐ బెయిల్ రద్దు పిటీషన్ కూడా వేస్తుందని, దీనికి సంబంధించి బలమైన ఆధారాలు కూడా సేకరించింది అంటూ, వార్తలు వస్తున్నాయి. అయితే, ఇవన్నీ రాజకీయ ఆరోపణలు అని, ఇప్పటికిప్పుడు జగన్ మోహన్ రెడ్డికి, ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ, వైసిపీ నేతలు అంటున్నారు. జగన్ ను ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, అంటున్నారు. ఈ ప్రచారం ఇలా కొనసాగుతూ ఉండగానే, ఈ రోజు బొండా ఉమా, ఢిల్లీ బిగ్ బ్రేకింగ్ అంటూ, జగన్ కు బెయిల్ రద్దు యోచనలో సిబిఐ ఉందని పోస్ట్ చేసారు. అయితే, ఇది రాజకీయంగా, ప్రచారం కోసం పెట్టిన పోస్టింగా, లేక నిజంగానే ఏదైనా జరుగుతుందా అనే చర్చ జరుగుతంది. సహజంగా బొండా ఉమా పేజ్ నుంచి ఇలాంటివి పోస్ట్ చెయ్యరు.

bonda 17112019 3

ఇవి ఎందుకు చేసారు ? బొండా ఉమాకు ఏమైనా సమాచారం ఉందా అనే విషయం పై చర్చ జరుగుతంది. మరో పక్క, నిన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ లో, ఎక్కువ కాలంగా, సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఉన్న వారికి, రద్దు చెయ్యాలని కేంద్ర హోం శాఖ ఆదేశించినట్టు వార్త ప్రసారం చేసారు. బొండా ఉమా, ఆ వార్త ఆధారంగా, ఇలా పోస్ట్ చేసారా అనే చర్చ కూడా జరుగుతుంది. మరో పక్క, ఈ రోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో, కాంగ్రెస్ పార్టీ చిదంబరానికి బెయిల్ ఇచ్చి, పార్లమెంట్ సమావేశాలకు హాజరు అయ్యేలా అవకాసం ఇవ్వాలని కోరిన సమయంలో, విజయసాయి రెడ్డి కల్పించుకుని, జగన్ కు ఆనాడు జరిగిన అన్యాయం అంటూ చెప్తుంటే, అమిత్ షా ఆ విషయం మీకు ఎందుకు, వాళ్ళు చెప్పారు, మేము నోట్ చేసుకున్నాం అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతూ ఉండటంతో, తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చెయ్యటానికి, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై, తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం వైసీపీ ఎంపీలతో జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, ఎంపీలకు జగన్ చెప్పిన విషయం పై, పలు వార్తా పత్రికల్లో కద్నాలు వచ్చాయి. ఎవరూ పార్టీ లైన్ దాటటానికి వీలు లేదని, అందరూ పార్టీకి లోబడే ఉండాలని, కొన్ని టీవీ చర్చల్లో, సొంత అభిప్రాయం చెప్తూ ఉన్న విషయం తన ద్రుష్టికి వచ్చిందని జగన్ అన్నారు. అలాగే ఢిల్లీలో, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు, ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలుస్తున్నారని తెలిసిందని, ఏ సమస్య పైన కలిసినా, విజయసాయి రెడ్డి అభిప్రాయం తీసుకుని, ఆయనతో కలిసే వెళ్లి వారిని కలవాలి అని చెప్పినట్టు, ఆ కధనాల్లో వచ్చింది. విజయసాయి రెడ్డితో లేక ఎంపీ మిథున్‌ రెడ్డిని కలిసి, వారి అభిప్రాయాలూ, వారి సూచనలు తీసుకున్న తరువాతే, వెళ్ళాలని చెప్పినట్టు ఆ కధనాల్లో వచ్చాయి.

meet 17112019 2

ఇలా కాకుండా, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తే, ఇక నుంచి షోకాజ్‌ నోటీసు జారీ చేసేందుకూ వెనుకాడను అంటూ ఎంపీలను జగన్‌ హెచ్చరించారని, వార్తలు వచ్చాయి. అయితే, జగన్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసారు, ఎవరిని ఉద్దేశించి చేసారు అనే చర్చ మొదలైంది. సహజంగా, జగన్ ను దాటి, వెళ్ళే సాహసం ఎవరూ చెయ్యరని, వైసిపీలో చెప్తూ ఉంటారు, మరి అలా కాకుండా, డైరెక్ట్ గా బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న ఎంపీలు ఎవరూ అనే చర్చ మొదలైంది. ఇటీవలే ఓ లోక్‌సభ కమిటీ చైర్మన్‌ పదవి పొందిన ఒక ఎంపీ గురించి అంటూ వార్తలు వస్తున్నా, ఆ విషయం పై, వైసీపీ వర్గాలు మాత్రం నోరు ఎత్తటం లేదు. అయితే, ఇప్పుడు జగన్ హెచ్చరికలు గట్టిగా చెయ్యటంతో, ఆ ఎంపీలు అందరూ ఇప్పుడు జగన్ చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి.

meet 17112019 3

అయితే మరో పక్క తెలుగుదేశం పార్టీ నేతలు, ఏడుగురు ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని, సగానికి పైగా ఎంపీలను తీసుకుని, పార్లమెంటరీ పార్టీని విలీనం చేసుకునే వ్యూహంలో బీజేపీ ఉందని, అందుకే ఆ వార్తలు చర్చలోకి లేకుండా ఉండేదుకే, ఇలా ప్రెస్ మీట్ లుపెట్టి, బూతులు తిట్టిస్తూ, అటెన్షన్ మొత్తం, అటు తిప్పుతున్నారని, టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో వాస్తవం ఉందొ లేదో తెలియదు కాని, ఇప్పుడు జగన్ హెచ్చరిక వార్తలు, పత్రికల్లో రావటంతో, ఏదో జరుగుతుంది అనే చర్చ మాత్రం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు జగన్ మోహన్ రెడ్డి పై, ఎవరూ ధిక్కారం చూపించకపోయినా, సమీప భవిష్యత్తులో బీజేపీ మాత్రం, ఏదో ఒక వ్యూహం పన్నుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

23 ఎంపీలు ఉండటం అంటే మామూలు విషయం కాదు. చాలా బలమైన పక్షంగా, వైసిపీ రాష్ట్రం తరుపున పోరాడి, కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చుకోవచ్చు. అయితే ఎందుకో కాని, కేంద్రం పై ఒత్తిడి తేవటంలో, అధికార వైసీపీ పూర్తీ విఫలం చెందుతుంది. అధిక నిధులు సంగతి తరువాత, కేంద్రం పెడుతున్న కొర్రీలతో, ఇవ్వాల్సిన నిధులు కూడా కేంద్రం ఇవ్వటం లేదు. మేము చేసే ప్రతిప పనిలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని, విజయసాయి రెడ్డి చెప్తున్నా, ఆచరణలో మాత్రం, కేంద్రం నుంచి ఏమి రావటం లేదు. తాజగా పోలవరం విషయంలో, చంద్రబాబు హయాంలో ఖర్చు పెట్టిన 5,486 కోట్లు రావాల్సి ఉంది. అయితే, మూడు వేల కోట్లు ఇవ్వటానికి కేంద్రం అంగీకారం తెలిపింది అని చెప్పారు. చివరకు, ఆర్ధిక శాఖ రూ.1,850 కోట్లను విడుదల చేసింది అని చెప్పారు. అయితే, అవి ఎన్ని రోజులు అయినా రాష్ట్రానికి మాత్రం రాలేదు. అసలు విషయం ఏమిటా అని, రాష్ట్ర అధికారులు ఆరా తీయగా, అక్కడ నుంచి వచ్చిన సమాధానం విని అవాక్కవ్వాల్సిన పరిస్థితి.

polavaram 17112019 2

రూ.1,850 కోట్ల గురించి ఆరా తీయగా, కేంద్ర ఆర్థిక శాఖ ‘ఆఫీసు మెమొరాండం’లో ప్రస్తావించిన నిబంధనల గురించి తెలిసి రాష్ట్ర ప్రభుత్వం అవాక్కయ్యింది. ఇలాగైతే, అసలు పోలవరం ఖర్చుల కోసం, కేంద్రం నుంచి రూపాయి కూడా వచ్చే అవకాశం లేదని, తల పట్టుకుంటుంది. 2014కి ముందు వరకు చేసిన ఖర్చుల ఆడిట్ రిపోర్ట్ అడుగుతున్నారు. అలాగే, ఇప్పటి వరకు జరిపిన చెల్లింపులలో, ఎలాంటి అవినీతి జరగలేదు అని , నిపుణుల కమిటీ చెప్తేనే, తరువాత నిధులు విడుదల చేసే అవకాసం ఉందని చెప్తున్నారు. అయితే ఇందులో అప్పటి ప్రతిపక్షం వైసిపీ పాత్ర కూడా లేకపోలేదు. అప్పట్లో, అవినీతి జరిగిపోయింది అంటూ, హడావిడి చేసి, ఉత్తరాలు రాసి, అది ఎంక్వయిరీ దాకా వెళ్ళేలా చేసారు. ఇప్పుడు అది తేలే దాకా, రాష్ట్రానికి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు.

polavaram 17112019 3

ఇప్పటి ఖర్చులు ఎలాగైనా ఆడిట్ చేస్తారు. కాని 2014కి ముందు వివరాలు అంటే, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చేసిన జలయజ్ఞం అందరికీ తెలిసిందే. మరి అప్పటి రికార్డులు అన్నీ సరిగ్గా ఉన్నాయా, లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. సోది కోసం వెళ్తే, పాత విషయాలు అన్నీ బయటకు వచ్చినట్టు, ఇప్పుడు ఇదో కొత్త చిక్కు. మొత్తానికి, ఈ నెల 8న ఆర్థిక శాఖ, జలశక్తి శాఖకు పంపిన ‘ఆఫీసు మెమొరాండం’లో, పోలవరం నిధుల పై స్పష్టత ఇచ్చారు. రూ.1,850 కోట్లుకు అనుమతి ఇచ్చాం కాని, రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన లెక్కలు ఆడిట్ జరగాలి. అలాగే నిధులు విడుదల చెయ్యాలంటే, 2014 దాకా చేసిన లెక్క చెప్పాలి అని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. మొత్తానికి కేంద్రం పెడుతున్న తాజా కొర్రీలతో, పోలవరం ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళే అవకాసం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం, సొంత ఖర్చులతో చేస్తుందా అంటే, నవరత్నాలకు, జీతాలకే, వెతుక్కునే పరిస్థితి. చూద్దాం జగన్ గారు ఏమి చేస్తారో ?

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. 20 రోజుల పాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 25 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ఆధ్వర్యంలో ఈ రోజు అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్, అలాగే వైసీపీ తరుపున పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కూడా హాజారు అయ్యారు. సమావేశం ముగిసిన తరువాత, గల్లా జయదేవ్ మాట్లాడుతూ, రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ సమస్యల పై ప్రస్తావించామని చెప్పారు. అలాగే దేశంలో ఆర్ధిక పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేసామని, దీని పై సుదీర్ఘ చర్చ జరగాలని కోరామని చెప్పారు. సమావేశాల్లో, ఇతర పార్టీల నేతలకు, ఎక్కువ సమయం కేటాయించాలని, చిన్న పార్టీలు అని విస్మరించవద్దు అని చెప్పామని గల్లా జయదేవ్ అన్నారు.

vsreddy 17112019 2

అలాగే విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఏపికి ఇవ్వాలని ప్రస్తావించామని చెప్పారు. విభజన హామీలు నేరవేర్చమని కోరామని అన్నారు. మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలను కూడా ప్రస్తావించామని చెప్పారు. అయితే ఇది ఇలా ఉండగా, సమావేశం లోపల మాత్రం, విజయసాయి రెడ్డి పై, హోం మంత్రి అమిత్ షా సహా, అఖిలపక్ష్ నేతలు అందరూ అసహనం వ్యక్తం చేసినట్టు, కొన్ని ఛానెల్స్ లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ, చిదంబరానికి, పార్లమెంటు సమావేశాల్లో హాజరు అయ్యేందుకు, బెయిల్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు, కోరిన సమయంలో, విజయసాయి రెడ్డి జోక్యం చేసుకుని, కాంగ్రెస్ ద్వంద ప్రమాణాలంటూ జగన్ జైలు శిక్ష అంశాన్ని ప్రస్తావించారని ఆ కధనంలో చెప్పారు.

vsreddy 17112019 3

అయితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న సమయంలో, విజయసాయి రెడ్డి జోక్యం చేసుకోవటం, పై హోం మంత్రి అమిత్ షా అసహనం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ అడగాల్సింది అడిగింది, మేము నోట్ చేసుకున్నాం, మధ్యలో మీకు వచ్చిన ఇబ్బందేంటని, దీనిపై మీరెందుకు చర్చ పెడుతున్నారు... మీకు సంభందం లేని విషయంలో మీరెందుకు స్పందిస్తున్నారని, విజయసాయి రెడ్డిని ప్రశ్నించినట్టు సమాచారం. ఇదే సమయంలో, జగన్ జిలు జీవితాన్ని, చిదంబరంకు ఎలా ముడిపెడతారని కాంగ్రెస్ నేతలు కూడా విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. అనవసరమైన, సంభంధంలేని విషయంపై చర్చకు ఎందుకు వస్తున్నారని, టికే రంగరాజన్, ఎంకే ప్రేమ్ చంద్రన్, ఇతర సభ్యులు కూడా విజయసాయి రెడ్డిని నిలదీశారు. అఖిలపక్షానికి ఉండే ప్రాధాన్యత తెలుసుకోవాలని, దానికి అనుగుణంగా ప్రవర్తించాలని హితవుపలికినట్లు సమాచారం.

Advertisements

Latest Articles

Most Read