రాష్ట్రంలో రాజకీయం వేగంగా మారిపోతుంది. మొన్నటి దాక బీజేపీ, వైసీపీ భాయ్ భాయ్ అంటూ కలిసి తిరిగాయి. కలిసి పని చేసాయి. కలిసి చంద్రబాబుని దింపి, జగన్ మోహన్ రెడ్డిని ఎక్కించారు. ఇక విజయసాయి రెడ్డి గారు అయితే, ఢిల్లీలో చెయ్యని లాబాయింగ్ లేదు. ఎన్నికల ముందు వరకు, ఆయన ప్రతి రోజు ప్రధాని కార్యాలయంలో ఉంటున్నారు అంటూ వార్తల్లో వచ్చిన కధనాలు చూసాం. విజయసాయి రెడ్డి, మోడీ, అమిత్ షాలకు బాగా క్లోజ్ అయిపోయారు. జగన్ మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా, ఎన్నికల్లో సహకారం ఇచ్చారు. అయితే ఎన్నికలు అయిన తరువాత, కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ప్రధాని మోడీ కూడా, హలో విజయ్ గారు అనేంత సన్నిహితం చూసాం. అయితే గత నెలా రెండు నెలలుగా, వాతావరణం మారిపోతూ వస్తుంది. విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో, పోలవరం విషయంలో కేంద్రం, జగన్ ప్రభుత్వం పై,

vsreddy 10092019 2

తీవ్ర ఆగ్రహంతో ఉన్న సమయంలో, విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, ప్రతి విషయంలో మాకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయంటూ, వీళ్ళ తప్పులని, వాళ్ళ పై తోసేసే ప్రయత్నం చేసారు. అయితే, దీని పై కేంద్రం సీరియస్ అయ్యి, విజయసాయి రెడ్డిని పిలిచి చీవాట్లు పెట్టారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలోనే బీజేపీ నేతలు, విజయసాయి రెడ్డి పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి, సంచలనం రేపారు. విజయసాయిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జీవో జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డిని, ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతిని కోరారు బీజేపీ నేతలు.

vsreddy 10092019 3

జయాబచ్చన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రామకోటయ్య రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ఆ పదవి లాభదాయక పదవుల కిందకు వస్తుందని భయపడి జీవోను రద్దు చేశారని అన్నారు. ఈసీ కూడా వెంటనే స్పందించాలని కోరారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపైనా రామకోటయ్య తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ వంద రోజుల పాలనలో వెయ్యి తప్పులు చేసిన ఘనత జగన్‌కే సొంతమవుతుందన్నారు. రాష్ట్రాన్ని పాలించమని ప్రజలు 151 సీట్లను ఇస్తే.. ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక విధానంతో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వైసీపీ వంద రోజుల పాలనలో వెయ్యి తప్పులు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి పై, కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవుతూనే ఉంది. నిన్నటినిన్న, కేంద్రం మంత్రి హైదరాబాద్ వచ్చి, జగన మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ, బహిరంగంగా చెప్పినా, జగన్ వైపు నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. ఇక పోలవరం విషయంలో కూడా జగన్ వైఖరితో కేంద్రం విసుగు చెందింది. అమరావతి విషయంలో, కేంద్రం రాసిన లేఖలకు, జగన్ ప్రభుత్వం ఎలాంటి రిప్లై ఇవ్వకపోవటంతో, అమరావతికి ప్రపంచ బ్యాంక్ రుణం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోలవరం విషయంలో కూడా ఇలాంటి నిర్లక్ష్య వైఖరే జగన్ ప్రభుత్వం అనుసరిస్తుంది. పోలవరం విషయంలో ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయం లేఖ రాసి వివరణ అడగగా, ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవటం పై కేంద్రం జలశక్తి మంత్రిత్వశాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వనికి మరో వర్తమానం పంపింది.

polavaram 10092019 2

పీఎంఓ కి కూడా వివరణ ఇవ్వరా, రెండు రోజుల్లో సమాధానం చెప్పండి అంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, జగన్ మోహన్ రెడ్డి, పీటర్ అనే తన బంధువు చేత ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం పోలవరం పై రివెర్స్ టెండరింగ్ కి వెళ్తున్నారు. ఇదే రిపోర్ట్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్రానికి కూడా ఇచ్చారు. అయితే ఈ రిపోర్ట్ కు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్రానికి ఇచ్చిన రిపోర్ట్ కు చాలా తేడా ఉండటంతో, రెండు రిపోర్ట్ ల మధ్య తేడాకు కారణాలను తెలపాలంటూ పీఎంవో గత నెల 29వ తేదీన లేఖ రాసింది. దీని పై సెప్టెంబర్ 3 లోగా వివరణ ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఏమైందో ఏమో కాని, జగన్ ప్రభుత్వం మాత్రం, ప్రధాన మంత్రి ఆఫీస్ కు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చెయ్యలేదు.

polavaram 10092019 3

దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు. మరో రెండు రోజుల్లో ప్రాధాన మంత్రి కార్యాలయానికి వివరణ ఇవ్వాలని గట్టిగా కోరారు. గడువు దాటిపోయి వారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి, వెంటనే ప్రధానికి వివరణ ఇవ్వాలని కోరారు. ఇదే విషయమై ఏపీ జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ని అడగగా, కేంద్ర జలశక్తిశాఖ పంపిన రిమైండర్‌ ఇంకా అందలేదని, అందగానే సమాధానం ఇస్తామని చెప్పినట్లు సమాచారం. తాము పీఎంవో రాసిన లేఖకు సమాధానం ఇచ్చే పనిలో ఉన్నామని, మధ్యలో సెలవులు రావడంవల్ల కొంత ఆలస్యమైందని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తానికి జగన్ వైఖరి పై, కేంద్రం రోజు రోజుకీ అసహనం వ్యక్తం చేస్తుంది.

తెలంగాణాకు కొత్తగా వచ్చిన గవర్నర్, మొదటి రోజే కేసిఆర్ కు చుక్కలు చుపించారనే వార్తలు వస్తున్నాయి., ఆమె వచ్చిన మొదటి రోజే మంత్రివర్గ విస్తరణ చెయ్యటంతో, దానికి ముందే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హైడ్రామా నడిచినట్లు తెలుస్తోంది. ఈ నెల 1న కేంద్ర ప్రభుత్వం నరసింహన్‌ స్థానంలో తమిళిసై సౌందర రాజన్‌ను కొత్త గవర్నర్ గా నియమించింది. అయితే సెప్టెంబర్ 1 కంటే ముందే కేసీఆర్‌కు కొత్త గవర్నర్‌ వస్తున్నారన్న సమాచారం రావటంతో, నరసింహన్ వెళ్ళే లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ముహూర్తాల కోసం చూస్తూ ఉండగా, సెప్టెంబరు 8న దశమి రోజు మంచి ముహూర్తం ఉండటంతో అందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతలోనే గవర్నర్‌ మార్పు ప్రకటన వచ్చింది. సెప్టెంబరు 8న నరసింహన్‌తో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తిచేసి, పదో తేదీన ప్రగతిభవన్‌లో నరసింహన్ కు ఘనంగా వీడ్కోల విందు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

kcr 10092019 2

అందుకు తగ్గట్టే నరసింహన్‌ కూడా 11న మంచి రోజని, ఆ రోజున రాజ్‌భవన్‌ను వీడాలని అనుకుని, అదే విషయాన్ని కేసీఆర్‌కు సమాచారం ఇచ్చారు. ఈ నెల 3వ తేదీన జరిగిన విలేకరులతో ఇష్టాగోష్టిలో కూడా నరసింహన్‌ తాను మరో వారం ఉంటున్నట్లు చెప్పారు. అయితే, ఈలోపే కొత్త గవర్నర్‌ తమిళిసై సెప్టెంబరు 8న వచ్చి గవర్నర్ గా బాధ్యతలు స్వీకరిస్తానని సమాచారం వచ్చింది. అయితే కేసిఆర్ ఆమెతో మాట్లాడి, నరసింహన్‌ 11 వరకు ఉండాలని అనుకుంతున్నారని చెప్పటంతో, ఆమె కూడా సరే అన్నారు. అయితే ఏమైందో ఏమో కాని, హఠాత్తుగా ఆమె 8నే తాను రాష్ట్రానికి వస్తున్నట్లు రాజ్‌భవన్‌కు సమాచారం అందించారు. దాంతో ఇక చేసేది ఏమి లేక, 7వ తేదీనే నరసింహన్‌ రాజ్‌భవన్‌ను ఉన్నట్టు ఉండి వీడాల్సి వచ్చింది.

kcr 10092019 3

దీంతో ఏడో తేదీనే, గవర్నర్‌కు విందు ఏర్పాటు చేశారు. అయితే అదే రోజున మంత్రి వర్గ విస్తరణ పెట్టించి, నరసింహన్ తోనే, ప్రమాణ స్వీకారం పెట్టుకోవాలని కేసిఆర్ భావించినట్లు చెబుతున్నారు. అయితే, కొత్త గవర్నర్‌ వస్తుండగా, దిగిపోతున్న గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించడం మంచిది కాదని కేంద్రం నుంచి సంకేతాలు రావడంతో, కేసిఆర్ ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. ఈలోపు తమిళిసై రావటంతోనే, మంత్రి వర్గ విస్తరణ అని ఆమెకు చెప్పటంతో, తాను బాధ్యతలు స్వీకరించిన రోజే ఎందుకు, మరో మంచి ముహూర్తంలో చేసుకోండి అని ఆమె కోరగా, చేసేదేమీ లేక ఢిల్లీలోని బీజేపీ పెద్దలను సంప్రదించి ఆమెను ఒప్పించినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి ఆదేశాలు రావడంతో తమిళిసై సరేనన్నట్లు సమాచారం. మొన్నిదాక నరసింహన్ తో ఆడింది అటగా కొనసాగిన కేసిఆర్, తమిళిసై పూర్తిస్థాయి బీజేపీ కార్యకర్త కావడం, మొండిమనిషిగా ఆమెకు పేరుండటంతో సీఎం-గవర్నర్‌ సంబంధాలు అంత సాఫీగా ఉండవని మొదటి నుంచే ఊహిస్తున్నారు. అందుకు తగ్గట్లే ఆమె తన మొండి తనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తొలిరోజే చూపించారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, గత మూడు నెలలుగా సాగిస్తున్న అరాచకాలకు నిరసనగా, రేపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, చలో పల్నాడుకు పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, చంద్రబాబు వంకగా కాకుండా, అక్కడ మొహరం, వినాయక నిమజ్జనం సందర్భంగా గొడవలు జరుగుతాయని చెప్తూ, 144 సెక్షన్ విధించారు. తెలుగుదేశం పార్టీ రేపు ఈ కార్యక్రమానికి వెళ్ళకుండా, 144 సెక్షన్ పెట్టారని, చంద్రబాబు కూడా ఆరోపించారు. మతాలకు, రాజకీయానికి సంబంధం పెట్టి, పోలీసులు వ్యవహిరిస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు, ఒక్క పల్నాడుకు మాత్రమే కాదని, రాష్ట్రం మొత్తం ఇలాంటి సమస్యే ఉందని అన్నారు. పల్నాడులో మరింత ఎక్కువగా ఉంది కాబట్టి, ఇది హైలైట్ చేసామని అన్నారు. తెలుగుదేశం పోరాటం చూసి, ఇక్కడకు వచ్చి, కేవలం పల్నాడులో టిడిపి నేతల ఇబ్బందులు గురించి చూస్తాం అంటున్నారని, మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు గురించి ఏమి చెప్తారని ప్రశ్నించారు.

atmakru 1009 2019 2

జగన మోహన్ రెడ్డి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అయ్యామని, వీళ్ళ అరాచకాలు ఇంకా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, చూసుకుందాం అంటూ, రేపు తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు పల్నాడు రావాలని పిలుపిచ్చారు. బాధితులను ఆదుకోమంటే, వారిని పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ, ఏకంగా హోం మంత్రే అవమానిస్తున్నారని చంద్రబాబు అన్నారు. అక్కడ బాధితులు అందరికీ న్యాయం జరిగేంత వరకు వెనకడుగు వేసేది లేదని, దేనికైనా సిద్ధమే అని తేల్చి చెప్పారు. రేపటి చలో ఆత్మకూరుని అడ్డుకోవటానికి, వైసీపీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుందని, వ్యవస్థలను ఉపయోగించుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తారని, దేనికైనా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. ఒక వేళ, వాళ్ళు అడ్డుకుంటే, ఎక్కడికక్కడే ధర్నాలు చెయ్యాలని చంద్రబాబు పిలుపిచ్చారు. 110 రోజులుగా గ్రామాలకు దూరంగా బ్రతుకుతుంటే, ఈ ముఖ్యమంత్రికి, ఈ డీజీపీకి కనిపించటం లేదా అని ప్రశ్నించారు.

atmakru 1009 2019 3

పండుగల పేరుతొ 144 సెక్షన్ పెట్టి, అసత్యాలు చెప్తున్నారని అన్నారు. బాధితులపై నమోదు చేసిన తప్పుడు కేసులన్నింటినీ ఎత్తివేయాలని, ధ్వంసమైన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తమ ఇంటికి తాము వెళ్తున్నామని, తమకు అండగా అందరూ ఉండాలని... తమ ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కావాలని బాధితులు అడుగుతున్నారని, అందుకే టీడీపీ నాయకత్వం మొత్తం వారికి అండగా నిలుస్తోందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు, నేతలపై అక్రమంగా 565 కేసులు నమోదు చేశారు. ప్రజల్లో ఈ ప్రభుత్వాన్ని నేరస్థ ప్రభుత్వంగా నిలబెట్టేవరకు వదిలిపెట్టేది లేదు’ అని చంద్రబాబు హెచ్చరించారు. ఇక మరో పక్క పోలీసుల హెచ్చరికలు, ప్రభుత్వం ఎత్తులతో, రేపటి చలో ఆత్మకూరులో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదురుఅవుతాయో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read