ఈ రోజు మధ్యానం నుంచి టీవీ చానల్స్ లో, తెలుగుదేశం నుంచి గన్నవరం శాసనసభ్యుడిగా ఎన్నికైన వల్లభనేని వంశీ, పార్టీ మారుతున్నారని, ఆయన బీజేపీలో చేరుతున్నారని, పెద్ద ఎత్తున టీవీ చానల్స్ లో ప్రచారం జరిగింది. ఈ రోజు చంద్రబాబుతో జరిగిన సమావేశానికి, కొన్ని కారణాల వల్ల వంశీ రాకపోవటంతో, ఆయన పార్టీ మారుతున్నారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే, ఈ విషయం పై వల్లభనేని వంశీ క్లారిటీ ఇచ్చారు. తాను తెలుగుదేశం పార్టీ వీడుతున్నాను అంటూ వచ్చే వార్తలు అన్నీ అవాస్తవం అని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సుజనా చౌదరితో తాను మాట్లాడి, బీజేపీ లో చేరుతున్నాని ప్రచారం చేస్తున్నారని, తాను అసలు సుజనాతో టచ్ లో లేరని చెప్పారు. ఆయనతో బంధుత్వం ఉన్న మాట వాస్తవమే కాని, అంత మాత్రం, పార్టీ మారిపోతారని ఎలా అనుకుంటారని వంశీ అన్నారు. ఇలాంటి వార్తలు చూసి కార్యకర్తల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వంశీ అన్నారు.

16 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని వీడుతున్నారని జరుగుతున్న ప్రచారం అంతా, వైసీపీ, బీజేపీ పార్టీల మైండ్‌ గేమ్‌ అని వంశీ కొట్టిపారేశారు. తాను ఎప్పటికప్పుడు చంద్రబాబుతో, టీడీపీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నానని, ఎవరూ పార్టీ మారే ఆలోచన లేదన్నారు. ఆ 16 మంది పేర్లు ఏమిటో, వైసీపీ, బీజేపీ చెప్పచ్చు కదా అని వంశీ డిమాండ్ చేసారు. మరో పక్క, పార్టీ మార్పు పై వస్తున్న వార్తల పై తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం అని అన్నారు. నిన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఎన్నికల ముందు, ఫలితాలు వచ్చిన తరువాత కూడా ఇలాంటి వార్తలు వచ్చాయని, ఇవన్నీ అవాస్తవం అని అన్నారు. తాను కొలంబోలో క్యాంప్ పెట్టాను అంటూ తప్పుడు ప్రచారం చేసారని, తాను కొలంబో వెళ్ళింది అక్కడ శక్తి పీఠాన్ని దర్శించుకోవడం కోసమని, నాతొ పాటు ఏ ఎమ్మల్యే రాలేదని, ఇలాంటి వార్తలు నమ్మవద్దని గంటా అన్నారు.

తెలుగుదేశం పార్టీ పై బీజేపీ తన పగ తీర్చుకుంటుంది. ఎన్నికల ముందు వరకు రాష్ట్ర హక్కుల కోసం, చంద్రబాబు దేశ వ్యాప్తంగా తిరిగి, మోడీ పరువు తీసారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని దేశమంతా తిరిగి చెప్పారు. దీంతో ఎలా అయినా చంద్రబాబుని ఓడించాలాని ప్లాన్ చేసి, జగన్ కు మద్దతు ఇచ్చి, అన్ని వ్యవస్థలు తమ ఆధీనంలో ఉండటంతో, చంద్రబాబుని ఓడించి, జగన్ ను గెలిపించారు. ఇప్పుడు తెలుగుదేశం బలహీనంగా ఉండటంతో, ఇదే అదనుగా, పార్టీలోని నాయకులు అందరినీ లాగేసే ఎత్తు వేసింది బీజేపీ... ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టటానికి ఇదే కరెక్ట్ టైం అనుకుని, వైసీపీ జోలికి వెళ్ళకుండా, తెలుగుదేశం నాయకులను లాగి, బలపడాలని చూస్తుంది. ఇందులో భాగంగా, తెలుగుదేశం పార్టీ నేతల్ని ఒక్కొక్కరిగా తమవైపు తిప్పుకుంటుంది. పోయిన వారం నలుగురు రాజ్యసభ ఎంపీలని లాక్కొన్ని, రాజ్యసభలో బలం పెంచుకుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను కూడా తమ వైపు లాక్కునే ప్లాన్ వేసింది.

ఇందులో భాగంగా, గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆయనతో పాటూ పార్టీ అధికార ప్రతినిధి వ్యవహరిస్తున్న లంకా దినకర్‌ కూడా బీజేపీలోకి వెళ్తునట్టు సమాచారం. వీరు ఇద్దరూ, ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల టీడీపీని వీడిన ఎంపీ గరికపాటితో, వీరిద్దరినీ బీజేపీ పెద్దలు దగ్గరకు తీసుకువెళ్ళి డీల్ సెట్ చేసినట్టు సమాచారం. అనగాని సత్యప్రసాద్ రేపల్లె నంచి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. 2014లో కూడా సత్యప్రసాద్‌కు టీడీపీ తరపున, రేపల్లె టికెట్ కేటాయించారు. అప్పుడు కూడా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఓడించారు. 2019లో కూడా తిరిగి రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీచేసి, మళ్లీ మోపిదేవిపై గెలిచారు. సినీ నటి సామంత కూడా ఈయన తరుపున సోషల్ మీడియాలో ప్రచారం చేసారు. అయితే వీరు పార్టీ మారితే, అన్ని నీతులు చెప్పిన జగన్, స్పీకర్ చేత వీరి పై అనర్హత వేటు వేస్తారో, లేక బీజేపీ నుంచి వచ్చే ఆదేశాలకు తల వంచేస్తారో తెలిసి పోతుంది.

నిన్న మంగళగిరిలో జరిగిన, టీడీపీ నేత ఉమా యాదవ్ హత్య కేసులో, ఈ రోజు కొత్త ట్విస్ట్ నెలకొంది. హత్య చేసిన వైసీపీ నేత మంగళగిరి పోలీసుల ఎదుటలొంగిపోయారు. వైసీపీ నేత తోట శ్రీనివాసరావుతో పాటు అతని ఐదుగురు అనుచరులు ఈ రోజు పోలీసులు ముందు లొంగిపోయారు. నిన్న రాత్రి రాజధాని ప్రాంతంలోని, మంగళగిరిలో జరిగిన దారుణ హత్యతో ఒక్కసారి ప్రజలు ఉలిక్కి పడ్డారు. గత 5 ఏళ్ళలో ఎప్పుడూ లేని సంస్కృతీ ఈ రోజు కనిపించటంతో, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం సానుభూతి పరులు భయం భయంగా గడుపుతున్నారు. నిన్న దారుణ హత్యకు గురైన మంగళగిరి టిడీపీ నేత ఉమా యాదవ్ హత్య పై పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న మంగళగిరి పట్టణంలో, జనం ఉండానే, నాలుగు రోడ్ల జంక్షన్‌లోనే దారుణ హత్యకు గురి కావడం కలవరం రేపింది. కసి తీరా నరికి నరికి చంపారు. ఈ హత్య చేసింది స్థానిక వైసీపీ నాయకుడు అంటూ, అతని ఇంటి పై టీడీపీ కార్యకర్తలు దాడి చసే, ప్రయత్నం చేయటంతో,నిన్న రాత్రి అంతా ఉద్రిక్తత కొనసాగింది.

పోలీసుల చెప్పిన దాని ప్రకారం, చనిపోయింది మంగళగిరి ఇందిరానగర్‌కు చెందిన తాడిబోయిన ఉమా యాదవ్‌. ఈయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. మంగళగిరిలో గౌతమబుద్ధ రోడ్డు దగ్గరలోని తన ఆఫీస్ నిర్మాణ పనులను ముగించుకుని నిన్న రాత్రి 8:20 సమయంలో, దగ్గరలోని ద్వారకానగర్‌లోని తన స్వగృహానికి బయల్దేరారు. అతని స్నేహితుడు శ్రీకాంత్‌ బండి నడుపుతుండగా, ఈయన వెనుక కూర్చొన్నారు. ఇంటికి సమీపంలోకి రాగానే నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఇద్దరు వ్యక్తులు అడ్డు రావటంతో బండి స్లో చేశారు. ఇంతలో వెనుక నుంచి మరో ఇద్దరు కత్తులు, గొడ్డళ్ళతో వచ్చి ఉమా యాదవ్‌ తలపై వేటు వేసారు. అతను అప్పటికే కింద పడిపోయినా, ఏ మాత్రం కనికరం లేకుండా, నరుకుతూనే ఉన్నారు. క్రూరంగా నరకటంతో, ఉమా యాదవ్‌ స్పాట్ లోనే మృతి చెందాడు. అయితే ఈ హత్య పై తెలుగుదేశం నాయకులు ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటికే 140 దాడులు చేస్తి, 8 మందిని చంపేశారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, పోలీసులు ఈ దాడులను నివారించాలని కోరుతున్నారు.

ఒక మనిషిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో, అన్ని రకాలుగా పెడుతున్నారు. అసలు రాష్ట్రంలో అక్రమ కట్టడాలే లేవు అన్నట్టు, కేవలం చంద్రబాబుని టార్గెట్ చేసుకుని, రెచ్చిపోతున్నారు. 2003లో చంద్రబాబు దయ తలచకపోతే, వైఎస్ఆర్ కు ఉండటానికి ఇల్లు కూడా ఉండేది కాదు. కాని చంద్రబాబు ఎప్పుడూ కక్ష పూరితంగా వెళ్ళ లేదు. తన సహచరుడుగా, ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ఆర్ కు గౌరవం ఇచ్చారు. తరువాత వైఎస్ఆర్ సియం అయిన తరువాత, రాజకీయంగా ఇబ్బంది పెట్టారు కాని, ఎప్పుడూ పర్సనల్ గా చంద్రబాబుని ఇబ్బంది పెట్టలేదు. అలాగే చంద్రబాబు కూడా 2014లో సియం అయిన తరువాత, రాజకీయంగా జగన్ పై విమర్శలు చేసారు కాని, ఏ నాడు వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టలేదు. కాని జగన్ మాత్రం, నెల రోజుల్లోనే తనకు ఉన్న ఫ్యాక్షన్ బుద్ధి బయట పెట్టారు. చంద్రబాబుకు భద్రత తగ్గించటం దగ్గర నుంచి నేటి దాకా, హేళన చేస్తూనే ఉన్నారు. ప్రజా వేదికను తన ఆఫీస్ గా వాడుకుంటానని, ప్రతిపక్ష నేత హోదాలో, చంద్రబాబు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు.

ఇప్పుడు అదే ప్రజా వేదిక విధ్వంసం దాకా వెళ్ళింది. చంద్రబాబు అడగకుండా ఉంటే, దాని గురించి పట్టించుకునే వారు కాదు. కాని ఇప్పుడు చంద్రబాబు అడగటం, దానికి ఏ సమాధానం ఇవ్వాలో అర్ధం కాక, అంత పెద్ద బిల్డింగ్ ని రాత్రికి రాత్రి కూల్చేసారు. దాని పక్కనే చంద్రబాబు నివాసం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబుని ఆ నివాసంలో కూడా లేకుండా ప్లన్ చేసారు. దీంతో ప్రజావేదిక వివాదంలో ఊహించని ట్విస్ట్ ఏర్పడింది. చంద్రబాబు నివాసానికి వెళ్ళాలి అంటే, ప్రజా వేదిక రోడ్డు మీదుగా వెళ్ళాలి. ఇప్పుడు ప్రజా వేదిక కూల్చేసారు కాబట్టి, ఆ రోడ్డు కూడా కూల్చేయనున్నారు. దీనికి సంబంధించి ఒక కొత్త పల్లవి అందుకున్నారు. ఆ స్థలం రైతులు, చంద్రబాబు అధికారంలో ఉండేంత వరకు ఈ స్థలం వాడుకోండి, తరువాత మాకు ఇచ్చేయండి అంటూ చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కట్టడాలు కడితే, చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరుకే అనే ఒప్పందం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. చంద్రబాబు ఉండేది లింగమనేని గెస్ట్ హౌస్ లో, ఒక వేల ఏమన్నా ఒప్పందం ఉంటే, ఆ యజమానితో చేసుకుంటారు కాని, అక్కడ అద్దెక ఉండే చంద్రబాబుతో ఎందుకు చేసుకుంటారు ? మొత్తానికి చంద్రబాబు ఇంటికి వెళ్ళటానికి రోడ్ కూడా లేకుండా చేసి, ఆయన్న మరింత ఇబ్బంది పెట్టే ప్లాన్ వేసారు. మొత్తానికి వర్షాభావం, కరెంట్ కష్టాలు, అన్నదాతల విత్తన కష్టాలు నుంచి, సమర్ధవంతంగా ప్రజల ద్రుష్టిని మళ్ళించారు అని మాత్రం చెప్పుకోవచ్చు.

Advertisements

Latest Articles

Most Read