తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో ప్రభుత్వం అనూహ్య మార్పులు చెయ్యటం అందరినీ ఆశ్చర్య పరిచింది. గతంలో రాజశేఖర్ రెడ్డి సియంగా ఉన్న సమయంలో కూడా, చంద్రబాబు బధ్రత విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. కాని ఈ సారి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఆయనకు. వాహనాలను కుదించారు. కాన్వాయ్ లో రెండు వాహనాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పైలెట్ క్లియరెన్స్ వాహనంతోపాటు ఎస్కార్ట్ వెహికిల్ ను తొలగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా వ్యవహారాల కమిటీలో సమీక్ష నిర్వహించాకే నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. పైలెట్, ఎస్కార్ట్ వాహనాలను తగ్గిస్తూ ప్రభుత్వ భద్రతా వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. టీడీపీ ముఖ్యనేతలందరూ దీనికి అభ్యంతరం తెలుపుతున్నారు.

cbnconvey 12062019

జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న వ్యక్తికి ఏ విధంగా పైలెట్ క్లియరెన్స్ వాహనంతోపాటు ఎస్కార్ట్ వెహికిల్ ను తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రజల్లో తిరగాల్సిన ఉంటుంది.. అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ నేతలు. అలాగే ప్రజా సమస్యలపై అనేక చోట్లకు తిరగాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నారు. ముందు ముందు చంద్రబాబు రాష్ట్రమంతా తిరగాలనుకుంటున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కనుక పైలెట్ క్లియరెన్స్ వాహనం, ఎస్కార్ట్ వెహికిల్ అవసరం అని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు వారు. జడ్‌ప్లస్‌ భద్రతలో చంద్రబాబు ఉన్నందున ఆయన కాన్వాయ్‌లో పైలెట్‌, ఎస్కార్ట్‌1, ఎస్కార్ట్‌2, జామర్‌, వీఐపీ స్పేర్‌, ఎన్‌ఎస్‌జీ1, ఎన్‌ఎస్‌జీ2 ఇలా మొత్తం 8 వాహనాలతో కాన్వాయ్‌ ఉండాలి. చంద్రబాబు కాన్వాయ్​లో ఎలాంటి మార్పులు చేయాల్సి ఉన్నా సెక్యూరిటీ ఎస్‌ఆర్టీలో భద్రతా సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలి. ఇవేమీ లేకుండానే చంద్రబాబుకు పైలెట్‌ క్లియరెన్స్‌ వాహనంతోపాటు ఎస్కార్ట్‌ అధికారి వాహనాన్ని తప్పించారు. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన ప్రయాణించిన వాహనం మినహా మిగిలిన వాహనాలన్నింటినీ అసెంబ్లీ బయట పెట్టించారు.

cbnconvey 12062019

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్షనేత జగన్‌ కాన్వాయ్‌కు అసెంబ్లీలో ఏ-2 నుంచి లోనికి అనుమతి ఉండేది. ప్రతిపక్షనేత వాహనాలను మంత్రుల వాహనాలతో సమానంగా పార్క్‌చేసుకునే అవకాశం ఉండేది. అయితే చంద్రబాబుకు అలాంటి గౌరవం ఏమీ లభించకపోవడం తెదేపా వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మాజీముఖ్యమంత్రిగా తగిన గౌరవం చంద్రబాబుకు ఉండేది. మునుపెన్నడూ ఇలా లేదనే భావన తెదేపా వర్గాల్లో వ్యక్తమవుతోంది. టీడీపీ నేతల అభ్యంతరాలను ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉండాల్సిన సెక్యూరిటీని ఇస్తున్నాం అని.. దీనికితోడు జెడ్ ప్లస్ సెక్యూరిటీకి ఎలాంటి అవరోధం కల్పించటం లేదని స్పష్టం చేస్తోంది.

ఈ రోజు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. శాసనసభ్యుడిగా ప్రమాణం చేసారు. ఈ సందర్భంగా, ఆయన పై ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది... "ఈ ఒక్కడిని దించటానికి... జగన్ తో మోడీ మంతనాలు. పీఎంఓ లో మోడీతో విజయ సాయి మంతనాలు. ముద్రగడతో జగన్ మంతనాలు. మోత్కుపల్లితో ముద్రగడ మంతనాలు. మోత్కుపల్లిని కలవడానికి వెళ్ళి మీడియాను చూసి వెనుదిరిగిన విజయసాయి (ఫోన్లో మంతనాలు). ఐవైఆర్ తో ముద్రగడ మంతనాలు. అమిత్ షా తో రమణ దీక్షితుల మంతనాలు. రాజ్ నాథ్ తో రమణ దీక్షితుల మంతనాలు . రమణ దీక్షితులతో జగన్ మంతనాలు . ఐవైఆర్ రమణ దీక్షితుల రహస్య మంతనాలు . ఉండవల్లి జగన్ ల రహస్య మంతనాలు . ఐవైఆర్ ఉండవల్లి ల రహస్య మంతనాలు . పవన్ కిషన్ రెడ్డి ల హోటల్ మంతనాలు . పవన్ కిషన్ లతో వైకాపా నేతల హోటల్ మంతనాలు . జనసేనకు భాజపా అధికార ప్రతినిధులు. జనసేనకు భాజపా ప్రచార, వ్యూహకర్తలు . బ్రదర్ అనీల్ తో ఆర్జీవీ మంతనాలు . వైకాపా నేతలతో ఆర్జీవీ మంతనాలు . శ్రీ రెడ్డితో ఆర్జీవీ మంతనాలు . పవన్ శ్రీ రెడ్డిల నాటకీయ పరిణామాలు. కన్నాతో ముద్రగడ మంతనాలు . జగన్ తో కన్నా మంతనాలు . నితిన్ గడ్కారీతో పురంధేశ్వరి మంతనాలు . ఆర్ క్రిష్నయ్య తో పురంధేశ్వరి మంతనాలు . "

cbn 12062019 1

"చిరంజీవి ముద్రగడ మంతనాలు . ముద్రగడ సోము వీర్రాజు మంతనాలు . కిర్లంపూడిలో ముద్రగడతో జనసేన టీం మంతనాలు . ముద్రగడతో మోహన్ బాబు మంతనాలు . మోహన్ బాబు జగన్ ల మంతనాలు . జగన్ తో పోసాని ప్రుధ్విల మంతనాలు . గాలి జగన్ ల మంతనాలు. సిబిఐ, ఐటి, ఈడీ దాడులు. ప్రశాంత్ కిషోర్ విష ప్రచారం... మోడీ, అమిత్ షా, కేసీఆర్, జగన్, పవన్, విజయ సాయి, కన్నా, రఘువీరా, ముద్రగడ, చిరంజీవి, సోము వీర్రాజు, జీవీఎల్, మురళీధర్, రాం మాధవ్, పురంధేశ్వరి, అంబటి, నాని, రోజా, చెవిరెడ్డి, వాసిరెడ్డి, ఉండవల్లి, మోత్కుపల్లి, ఐవైఆర్, రమణ దీక్షితులు, పోసాని, పృధ్వి, విష్నువర్ధన్ రెడ్డి, రఘురాం, హరి బాబు, మధు, కొమ్మినేని, అమర్ ఎట్సెట్రా ఎట్సెట్రా.. రోజులో వీళ్ళల్లో సగం మంది వివిధ చానళ్ళలో విషం చిమ్మడం. దొంగే దొంగా అన్నట్లు పచ్చ మీడియా అనడం. ఇన్ని గూడుపుటాణీలు, కుతంత్రాలు ఆ ఒక్కణ్ణి దించడానికా ? పని పూర్తయ్యిందిగా, కడుపు మంట చల్లార్చుకోండి.."

షార్‌పై ఉగ్రవాదులు గురి పెట్టారని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ ఉగ్రవాదుల దాడులకు సిద్ధమవుతున్నారని నిఘా వర్గాల సమాచారం. షార్‌పై దాడులకు బంగ్లాదేశ్‌ ఉగ్రవాదుల వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐబీ ఐజీ అమితాబ్‌ రంజన్‌ హుటాహుటిన షార్‌ను సందర్శించారు. షార్‌ పరిసరాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్ర ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ అమితాబ్‌ రంజన్‌ ఆధ్వర్యాన ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిందీ సమావేశం. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం అత్యంత సున్నితమైన ప్రాంతమని, దీనికి భద్రత పరంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికారులు నిర్ణయించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు అవకాశం ఉందని.. దీనిని దృష్టిలో ఉంచుకుని భద్రతను అప్రమత్తం చేయాల్సి ఉందని అవగాహనకు వచ్చినట్లు సమాచారం. సమావేశంలో కేంద్ర ఇంటెలిజెన్స్‌ అధికారులతోపాటు, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, షార్‌ సంచాలకులు పాండ్యన్‌, నియంత్రణాధికారి జేవీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

nellore 12062019 1

శ్రీలంకలో నెలరోజుల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడులు మరువక ముందే, కొద్ది రోజుల క్రితం నెల్లూరు తీరప్రాంతానికి శ్రీలంక బోటు కొట్టుకువచ్చిన ఘటన కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పొన్నపూడి పాతూరు గ్రామంలోని సముద్రంలో ఈ పడవ మే18న కొట్టుకువచ్చింది.శ్రీలంక నుంచి ఈ బోటు కొట్టుకు రావడం పలు అనుమానాలు తావిస్తోంది. ఇందులో ఉగ్రవాదులు ఏమైనా వచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. శ్రీలంక నుంచి నెల్లూరు వరకు రావాలంటే తమిళనాడు దాటుకుని రావాలని అలాంటప్పుడు తమిళనాడు తీరప్రాంతంలో భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు తీరంలో ఈ బోటును మత్స్యకారులు గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఖాళీగా ఉన్న బోటును వారే ఒడ్డుకు చేర్చారు. బోటుపై రాసి ఉన్న అక్షరాల ఆధారంగా ఇది శ్రీలంకకు చెందిన బోటు అని తేల్చేశారు అధికారులు. అయితే ఇందులో ఉగ్రవాదులు వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు తీరప్రాంతం, అటవీ ప్రాంతంలో ఆక్టోపస్ దళాలు జల్లెడ పడుతున్నాయి. ఇక మెరైన్ పోలీసులు కూడా గస్తీని ముమ్మరం చేశారు. ఇప్పటికే షార్, కృష్ణపట్నం పోర్టు ఇతర తీరప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు.

ఎట్టకేలకు నగరి ఎమ్మెల్యే రోజాకి పదవి దక్కింది. కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రోజాకి సీఎం జగన్ పదవి ఇచ్చారు. ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా ఎమ్మెల్యే రోజాని అపాయింట్ చేశారు. తనకు మంత్రిపదవి దక్కకపోవడంతో ఎమ్మెల్యే రోజా మంగళవారం(జూన్ 11,2019) సీఎం జగన్ ని కలిశారు. మంత్రి పదవి రాకపోవడంపై చర్చించారు. సీఎంతో మాట్లాడిన తర్వాత.. ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా రోజాని నియమించినట్టు వార్త వచ్చింది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకి.. కేబినెట్ లో మంత్రి పదవితోపాటు కీలకమైన శాఖ వస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆమె అభిమానులు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. అంచనాలకు విరుద్ధంగా చోటు దక్కలేదు. దీంతో మంత్రుల ప్రమాణస్వీకారానికి డుమ్మా కొట్టారు. హైదరాబాద్ లోనే ఉండిపోయారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయటానికి విజయవాడ వచ్చిన రోజా.. సీఎం జగన్ పిలుపుతో భేటీ అయ్యారు.

roja 12062019

రెండో విడతలో మంత్రి పదవి ఖాయంగా జగన్ నుంచి రోజాకి హామీ వచ్చినట్లు తెలిసింది. ఇదే క్రమంలో నామినేటెడ్ పదవి తీసుకోవటానికి విముఖత వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ పదవి దక్కింది. APIIC (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) పదవి ఏపీకి పరిశ్రమలు తీసుకురావటంలో.. మౌలిక వసతులు కల్పించటంలో ఈ కార్పొరేషన్ దే ప్రధాన పాత్ర. లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. కేబినెట్ హోదాతో సమానంగా ఉంటుంది ఈ చైర్ పర్సన్ పోస్టు ఛైర్ పర్సన్‌గా రోజాను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తనకు జగన్ ఏ పదవి ఇస్తారో తెలియడం లేదని రోజా ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాను ఎవరిమీద అలగలేదని, ఏ పదవిని ఇచ్చినా స్వీకరిస్తానని ఆమె పేర్కొన్నారు. అయితే.. మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న ఆమెను తాజాగా జగన్ ఈ పదవిలో నియమించడం విశేషం.

Advertisements

Latest Articles

Most Read