దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక వింత... 35 రోజుల పోలింగ్ తరువాత, రీపోలింగ్ కు ఎందుకు ఆదేశించారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఈ 35 రోజుల్లో ఏమి జరిగిందో చూస్తే... చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని, వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తలపడ్డారు. పోరు హోరాహోరీగా జరిగింది. 25 పోలింగ్‌బూత్‌లలో వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని, అక్కడ రీపోలింగ్‌ జరపాలని పులివర్తి నాని గత నెల 11న పోలింగ్‌ ముగిసిన మరుసటిరోజునే ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్‌ అధికారితో మొదలుకుని కలెక్టర్‌కు, సీఈవోకు, ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మొరపెట్టుకున్నారు. ఈసీ దీనిపై ఏమాత్రం స్పందించలేదు. నిజానిజాలపై కనీసం ఆరా తీయలేదు.

chandragiri 16052019

జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ నుంచి నుంచికానీ, రిటర్నింగ్‌ అధికారి నుంచి కానీ ఎలాంటి వివరణ కోరలేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే టీడీపీ అభ్యర్థి ఫిర్యాదును బుట్టదాఖలు చేశారు. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ ముగియగా... ఆ తర్వాత 25 రోజులకు, అంటే ఈనెల 6వ తేదీన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఐదు బూత్‌లలో రిగ్గింగ్‌ జరిగిందని, అక్కడ రీపోలింగ్‌ జరపాలని కోరారు. దీనిపై సీఈవో ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే... ఆ మరుసటి రోజునే (మే 7) సీఎస్‌ కార్యాలయం నుంచి సీఈవోకు లేఖ వెళ్లింది. వైసీపీ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలన్నది దీని సారాంశం. 8వ తేదీన సీఈవో దీనిపై స్పందించారు. ఫామ్‌ 17సీ, ప్రిసైడింగ్‌ అధికారి డైరీ, సీసీ టీవీ ఫుటేజీ, మైక్రో అబ్జర్వర్‌ నివేదిక, జనరల్‌ వీడియో కవరేజీ దృశ్యాలను సత్వరం పంపించాలని ఆదేశించారు.

chandragiri 16052019

సీఈవో అడిగిన వివరాలన్నీ జిల్లా ఎన్నికల అధికారులు పంపించారు. వీటి ఆధారంగా 10వ తేదీన ఒకటి, 11వ తేదీన మరొకటి ఈసీకి సీఈవో లేఖ రాశారు. బూత్‌లలోకి కొందరు వ్యక్తులు వెళ్తున్న దృశ్యాలు నమోదైనందున రీపోలింగ్‌ జరపాలని కోరారు. దీనిపై బుధవారం ఈసీ స్పందించింది. ఐదు బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈ బూత్‌లలో ఒకటి టీడీపీ అభ్యర్థి నాని సొంతగ్రామం పులివర్తివారిపల్లెలోనిది. "పాతిక బూత్‌లలో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని పోలింగ్‌ మరుసటి రోజే నేను ఫిర్యాదు చేశాను. వైసీపీ అభ్యర్థి స్వగ్రామం తుమ్మలగుంటలోని బూత్‌లో ఏకపక్షంగా ఓట్లు వేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్లిన నా సతీమణి సుధారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అక్కడ అక్రమాలు జరిగినట్లు పక్కా ఆధారాలున్నా ఈసీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన పాతిక రోజుల తర్వాత వైసీపీ చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. దీనిపై ఢిల్లీ స్థాయిలో కుట్ర జరిగింది." అంటూ చంద్రగిరి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీ చెప్పారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని కిరాయి హంతకులు హత్య చేశారా... అంటే అవునంటున్నాయి పోలీసు వర్గాలు. అసలు వివేకాను ఎందుకు చంపించారు? ఎవరు హత్య చేయించారు? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. వివేకా కుటుంబంలోని ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు వారు నోరు విప్పకపోవడంతో కాల్‌ డేటా ఆధారంగా హంతకులు ఎవరన్న దిశగా విచారణ సాగుతున్నట్లు సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా మూడు పోలీసు టెక్నికల్‌ బృందాలను నియమించి ఈ బాధ్యత అప్పగించినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌కు ఈ హత్యకు పాల్పడ్డారని, వారికోసం వేట ముమ్మరంగా సాగుతోంది. వివేకా హత్య కేసులో రోజుకొక మిస్టరీ వెలుగులోకి వస్తోంది.

viveka 16052019

మార్చి 15న మాజీమంత్రి వివేకానందరెడ్డిని అతి దారుణంగా, క్రూరంగా హింసించి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య ఎందుకు చేశారు? ఎవరు చేయించారు? అన్న దిశగా మొదటి నుంచి దర్యాప్తు సాగిస్తున్న పోలీసులకు రోజుకొక మిస్టరీ వెలుగులోకి వస్తోంది. వివాహేతర సంబంధాలు, భూ సెటిల్‌మెంట్ల వ్యవహారాల్లో వివేకాను హత్య చేశారా అన్న కోణాల్లో మొదట పోలీసులు విచారణ కొనసాగించారు. మొదట ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఐదు బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయగా ఆయన బదిలీ తరువాత ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అభిషేక్‌ మహంతి 11 బృందాలను నియమించి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. వివాహేతర సంబంధాలు, భూదందాలు, సెటిల్‌మెంట్లు వివాదాల కారణంగా వివేకా హత్య కాలేదని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. కుటుంబ వ్యవహారాలే హత్యకు కారణమని మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి.

viveka 16052019

ఈ దిశగా దర్యాప్తు చేయగా, కుటుంబంలో కీలకంగా వ్యవహరించే ముగ్గురు వ్యక్తులు సూత్రధారులుగా వ్యవహరించారని పోలీసు విచారణలో తేలింది. వివేకా, ఆయన అనుచరులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ఫోన్‌ కాల్‌ డేటాను పోలీసులు సేకరించారు. ఈ కాల్‌డేటాను పూర్తిగా విశ్లేషించి ప్రతి కాల్‌కు సంబంధించిన డేటాను ఎంతో గోప్యంగా విచారించేందుకు మూడు పోలీసు టెక్నికల్‌ బృందాలను నియమించి వారికి ఈ బాధ్యత అప్పజెప్పారు. ఈ బృందాలు కాల్‌ డేటాను పూర్తి స్థాయిలో పరిశీలించగా వివేకాను హత్య చేసింది ప్రొఫెషనల్‌ కిల్లర్సేనని వెల్లడైనట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కిరాయి ముఠాను అదుపులోకి తీసుకుని విచారించి వారి నుంచి వివరాలు రాబట్టి ఎవరు సూత్రధారులన్నది తేల్చే దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం సాగిస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా ఉండే ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ ఈ హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు ఆ దిశగా మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. వివేకా హత్య వెనుక సుపారి భారీ మొత్తాల్లోనే అందించినట్లు సమాచారం. మొదట వివేకా చనిపోయిన వెంటనే గుండెపోటుతో చనిపోయారని సంఘటన స్థలంలో ఉన్న సాక్ష్యాధారాలను పూర్తిగా తొలగించే విధంగా కుటుంబ సభ్యుల సహకారంతోనే సాగిందని విమర్శలు వెల్లువెత్తాయి.

ఏపీలో మరో 5 కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 19న(ఆదివారం) చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని 5 పోలింగ్‌ కేంద్రాల్లో అసెంబ్లీ, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రీపోలింగ్‌ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఈవో గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, చంద్రగిరిలో రీపోలింగ్‌పై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అడిగిన బూత్‌లను పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ అడిగిన 7 బూత్‌లలో 5 బూత్‌లకు ఎన్నికలు జరపడం సరికాదన్నారు. టీడీపీ అడిగిన స్థానాల్లోనూ రీపోలింగ్‌ జరపాలని తెలిపారు. ఈసీ పక్షపాత ధోరణి మరోసారి రుజువైందన్నారు. రీపోలింగ్‌పై గురువారం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని చంద్రబాబు చెప్పారు.

cbn 16052019

రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 49 కేంద్రాల్లో అక్రమాలు జరిగితే ఎన్నికల సంఘం పక్షపాత వైఖరితో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం సమంజసంకాదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకట్రావ్ నిరసన వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి సుజాతశర్మను కలిసి ఈ 49 కేంద్రాల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించిందంటూ, నియోజకవర్గంలోని 166,310 పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పోలింగ్ రోజునే టీడీపీ అభ్యర్థి నానీ.. ఈసీకి పరిస్థితిని వివరించారని గుర్తుచేశారు.

cbn 16052019

పోలింగ్ ముగిసిన 24 రోజుల తరువాత వైసీపీ అభ్యర్థి కొన్ని బూత్‌లపై ఫిర్యాదు చేస్తే సీఈఒ విచారణకు ఆదేశించటం మంచి సాంప్రదాయం కాదన్నారు. రాష్ట్రంలో ఈనెల 6వ తేదీన ఒకవిడత రీపోలింగ్ నిర్వహించారని ఇప్పుడు కొత్తగా విచారణ జరిపి మరోసారి రీపోలింగ్‌కు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం అధికారులు పారదర్శకంగా వ్యవహరించటం లేదని ఆక్షేపించారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించటం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమన్నారు. చంద్రగిరిలో రీపోలింగ్‌కు నిర్ణయించటంతో ఎన్నికల అధికారుల పనితీరును శంకించాల్సి వస్తోందన్నారు. అక్రమాలు జరిగిన అన్ని కేంద్రాల్లో విచారణ జరిపి రీపోలింగ్ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సుజాత శర్మ స్పందిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రస్తుతం సెలవులో ఉన్నారని ఆయన విధులకు హాజరైన అనంతరం పరిస్థితిని వివరిస్తామన్నారు. టీడీపీ డిమాండ్ చేస్తున్న కేంద్రాల్లో కూడా రీపోలింగ్ జరపాలని కళా వెంకట్రావ్ సుజాతశర్మకు వినతిపత్రం సమర్పించారు.

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కోల్‌కతాలో నిర్వహించిన ప్రదర్శనలో హింస చెలరేగడం ప్రకంపనలు సృష్టించింది. మంగళవారం జరిగిన ఈ ప్రదర్శనలో ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం మరింత వివాదాస్పదమయింది. ఇందుకు కారణం మీరంటే మీరని తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపాలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. బెంగాల్‌ ఆత్మగౌరవానికి భంగం కలిగిందని తృణమూల్‌ ఆరోపించగా, తమపై నింద మోపడానికి కుట్ర జరిగిందని భాజపా ప్రత్యారోపణ చేసింది. ఈ సంఘటనకు నిరసనగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కోల్‌కతాలో ప్రదర్శన నిర్వహించారు.

ec 16052019

సంఘటన తీవ్రత దృష్ట్యా ప్రచారాన్ని ఒక రోజు ముందుగా గురువారమే ముగించాలంటూ ఎన్నికల సంఘం అసాధారణ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియలో చివరిదైన ఏడో దశలో భాగంగా 9 నియోజకవర్గాలకు ఈ నెల 19న పోలింగ్‌ జరగాల్సి ఉంది. షెడ్యూలు ప్రకారం శుక్రవారం ప్రచారం ముగియాల్సి ఉండగా, కోల్‌కతాలో జరిగిన ఘర్షణల దృష్ట్యా గురువారం రాత్రి పది గంటలకే ప్రచారాన్ని ముగించాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని 324వ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొని, తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ చంద్ర భూషణ్‌ కుమార్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (హోం) అత్రి భట్టాచార్య, అదనపు డీజీపీ (సీఐడీ) రాజీవ్‌ కుమార్‌లను ఆయా పదవుల నుంచి తొలగించినట్టు తెలిపారు.

ec 16052019

పశ్చిమ బెంగాల్‌లో 324వ అధికరణాన్ని అమలు చేయడాన్ని మమతా బెనర్జీ ఖండించారు. ఈ అధికరణాన్ని విధించేటంతటి శాంతిభద్రతల సమస్యలు రాష్ట్రంలో లేవని చెప్పారు. ఎన్నికల సంఘం ‘‘గతంలో ఎన్నడూ లేని, అప్రజాస్వామిక, అనైతిక నిర్ణయం తీసుకొంది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలకు ఈసీ ఇచ్చిన బహుమతి’’ అని ఆరోపించారు. మొత్తం ఆర్‌ఎస్‌ఎస్‌వారితో నిండిపోయిన ఇలాంటి ఎన్నికల సంఘాన్ని తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఇద్దరు ఉన్నతాధికారులను కూడా ఈసీ కాకుండా మోదీ, అమిత్‌షాయే తొలగించారని ఆరోపించారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడం భాజపా పనేనని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ ఆరోపించారు. ఎన్నికల ముందు హింస సృష్టించాలన్న ఉద్దేశంతోనే అమిత్‌ షా ప్రదర్శన నిర్వహించారని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read