తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గారు చేస్తున పర్యటనలకు జనం నుంచి ఊహించని  స్పందన వస్తుంది. ఆయన భహిరంగ సభలకు వస్తున్న జనాన్ని చూస్తుంటే వైసిపి నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. చంద్రబాబు నాయుడు పర్యటనలకు జనం రాకుండా ఉండటానికి అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్లాన్ లు అన్నీ ఇన్నీ కాదు. కాని వారి ఒక్క ప్లాన్ కూడా ఫలించడం లేదు.పైగా ఒక జిల్లాకు మించి మరొక జిల్లాలో చంద్రబాబుకి జనం నుంచి వస్తున్న విశేష స్పందన చూసి వారికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు తాజాగా ఈ రోజు చంద్రబాబు విజయనగరం పర్యటనలో బహిరంగ సభకు ఎక్కువ మంది వెళ్లకుండా చేసేందుకు వైకాపా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.  టౌన్‍ పరిధిలోని 50 వార్డుల్లో ప్రైవేటు మీటింగ్లు పెట్టి  ప్రజలను ఆపేందుకు, వైసీపీ నాయకులు ప్లాన్ వేసినట్టు వార్తలు వచ్చాయి.  చంద్రబాబు మీటింగ్ కు ఎవ్వరూ  వెళ్లొద్దని వార్డుల్లో  వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేఖత  రోజురోజుకి పెరిగిపోవడం,  అంతే కాకుండా చంద్రబాబు ఇదివరకు చేసిన అభివృద్దిని ప్రజలు గుర్హుచేసుకుంటూ ఆయన సభలకు కేవలం తెలుగుదేశం అభిమానులే కాకుండా, సామాన్య ప్రజానీకం సైతం నీరాజనం పలుకుతున్నారు.

ఈ రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెనాలికి  విచ్చేయనున్నారు. ఘనంగా జరుగుతున్న ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాల మహోత్సవ సభకు వెంకయ్య రానున్నారు. తెనాలిలో జరుగుతున్న ఈ ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాలకు ఈ రోజు చాలా మంది అతిధులు రానున్నారు.  ఈ  ప్రోగ్రాంలో హైకోర్టు జడ్జి జస్టిస్ రాధారాణి గారు కూడా పాల్గొననున్నారు. వీళ్ళే కాకుండా ఇదే కార్యక్రమంలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ గారు , ఇంకొంత మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి గారు పాల్గొననున్నారు.  ఈ కార్యక్రమంలో మురళీమోహన్ , జయచిత్రకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం అందించనున్నారు. ఎన్టీఆర్ అభిమాన సత్కార అవార్డు, వై.పాణిరావుకు ప్రదానం చేయనున్నారు.

ఏ చెట్టూలేని ఎడారిలో ఆముదం చెట్టే మహా వృక్షం. కూల్చడమే తప్పించి కట్టడం తెలియని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేసిన నాలుగేళ్లకి పులివెందుల బస్టాండు నిర్మాణం పూర్తి చేయగలిగారు. ఇదేదో ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటున్నారు వైసీపీ పెద్దలు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అతి ఎక్కువగా ట్రోలింగ్ కి గురైనది పులివెందుల బస్టాండు విషయంలోనే అన్నది సుస్పష్టం. ఐదేళ్ల టిడిపి పాలనలో అమరావతి రాజధాని నిర్మించలేకపోయారని ఆరోపించిన వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తనను గెలిపించిన పులివెందులలో బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ పూర్తి చేయలేదు. దీంతో సోషల్మీడియాలో జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒక ఆట ఆడుకున్నారు. సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో బస్టాండు కట్టలేనోడు, అమరావతి నిర్మాణం గురించి ఆరోపణలు చేయడం అర్థరహితం అంటూ సెటైర్లు పేల్చారు. సొంతూరులో బస్టాండు కట్టలేనోడు మూడు రాజధానులు ఏం కడతాడంటూ మరో కోణంలోనూ ఎదురుదాడి చేశారు నెటిజన్లు. అమరావతిలో నిర్మాణాలను గ్రాఫిక్స్ అని ఎద్దేవ చేసిన వైసీపీ నేతలూ పులివెందుల బస్టాండు కూడా గ్రాఫిక్సే కదా అంటూ ఎద్దేవ చేశారు.

ఈ ట్రోలింగ్ భరించలేని వైసీపీ సోషల్మీడియా వింగ్ సీఎం వద్దకే నేరుగా వెళ్లి విషయం చెప్పింది. పులివెందుల బస్టాండు పూర్తి చేయలేకపోతే టిడిపి,విపక్ష సోషల్మీడియా పోస్టులకు సమాధానం చెప్పలేకపోతున్నామని జగన్ దగ్గర వాపోయారు. దీంతో సీఎం నేరుగా కల్పించుకుని ఎన్ని అడ్డంకులున్నా పులివెందుల బస్టాండు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. శంకుస్థాపన చేసిన మూడేళ్లకు పులివెందుల బస్టాండు పూర్తి అయ్యింది. దాదాపు రూ. 37 కోట్ల వ్యయంతో పులివెందుల బస్టాండు పూర్తి చేశారు. ప్రయాణికుల రద్దీ ఈ స్థాయిలో లేకపోయినా ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో ఇంత భారీ బస్టాండు నిర్మించారనుకుంటే పొరపాటే. కుప్పంలో చంద్రబాబు హయాంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణమైన బస్టాండు ఫోటోలు పెట్టి, పులివెందుల కొబ్బరి తడికెల బస్టాండుతో పోల్చి సోషల్మీడియాలో వైసీపీని ఒక ఆట ఆడుకుంటున్నారు. దీంతో కుప్పం బస్టాండు కంటే ఘనంగా నిర్మించాల్సిందేనని జగన్ పట్టుబట్టి కట్టించిన పులివెందుల బస్టాండు ఎట్టకేలకు పూర్తి అయ్యింది.

నిన్న నందమూరి బాలకృష్ణ ని పవన్ కళ్యాణ్ కలవడంపై సర్వత్రా ఆసక్తి  నెలకొంది.  హైదరాబాద్లోని  అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్య బాబుని, పవన్ కల్యాణ్ కలిసారు. దీనితో సినీ రాజకీయ వర్గాల్లో ఇదే హట్ టాపిక్ గా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే  నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్  సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. ఆ షూటింగ్ గ్యాప్‍లో పవన్ ,బాలయ్యను కలిసారు. వారిద్దరూ కలిసి దాదాపు 20 నిమిషాల పాటు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. వీరిద్దరూ చాలాసేపు ఏకాంతంగా మాట్లుడు కోవడంతో, ఆంద్రా రాజకీయాలపై చర్చ జరిపారని సమాచారం. అంతే కాకుండా ఈనెల 27న బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కు పవన్ కళ్యాణ్ అతిథిగా వస్తునట్టు సమాచారం.

Advertisements

Latest Articles

Most Read