టీడీపీ గెలుపు పై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు అదృష్టవంతుడు. ఎందుకని ఆయన నన్ను అడిగారు. డ్వాక్రా మహిళలకు చెక్కులు సరైన సమయంలో వేయడమే అదృష్టానికి కారణం. నిన్న క్యూలో అమ్మవార్లు, వృద్ధులు విరగబడి వచ్చారు. చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలపడానికే వాళ్లు వచ్చారు. అనంతపురం లోక్‌సభలో అందరినీ మార్చమని నేనే చెప్పా. మార్చకపోతే గెలవం అని చెప్పాను. అయినా మార్చలేదు. మార్చకపోయినా గెలుస్తున్నారంటే అమ్మవార్ల దయే. అనంతపురం టౌన్‌, శింగనమల, గుంతకల్లు కూడా గెలవబోతున్నాం. రాసిపెట్టుకోండి.. మే 23వ తేదీన చూడండి’’ అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

jc 12042019

చంద్రబాబుకు అదృష్టం.. సుడి తిరిగినట్లు తిరిగిందని జేసీ కొనియాడారు. ఈవీఎంలు మధ్యాహ్నానికే పనిచేశాయని, సహజంగా క్యూలో ఉండే మహిళలు ఒక్కసారి ఇంటికి వెళ్తే తిరిగిరారు.. కానీ చంద్రబాబు పిలుపుతో ఆయనకు కృతజ్ఞతతోనే మళ్లీ వచ్చి ఓటేశారని ఆయన తెలిపారు. అదృష్టమేగానీ.. తన కృషి లేదా అని చంద్రబాబు అడిగారని, కృషి ఉంటేనే అదృష్టం ఉంటుందని చెప్పానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సైలెంట్‌ వేవ్‌ మహిళల్లో ఉందని, అందుకే అర్థరాత్రి దాకా ఓట్లు వేశారని జేసీ పేర్కొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మరపురాని సన్నివేశమని చెప్పారు. ఇప్పుడున్న వేవ్‌లో 5 వేల ఓట్లతో గెలుపు.. గెలుపే కాదని ఆయన వ్యాఖ్యానించారు.

jc 12042019

రెడ్డి అనే ఫీలింగ్‌ చాలా ఎక్కువగా కనిపించిందని, రాష్ట్రంలో ఉన్న రెడ్లు మెజార్టీ శాతం జగన్‌కే ఓటేశారని తెలిపారు. కానీ ఈ వేవ్‌లో అదంతా కొట్టుకుపోయిందన్నారు. మొన్న రాత్రి వరకు అనంతపురం, శింగనమల, గుంతకల్లు పోతాయనుకున్నానని, నిన్న ఉదయం క్యూలో అమ్మవార్లను చూశాక.. లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక లెక్క.. ఇప్పుడు జరిగిన ఎన్నికలు ఇంకో లెక్క అని దివాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

 

 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ఢిల్లి వెళ్లనున్నారు. ఢిల్లిలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ (ఇ.సి) అధికారులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. నేడిక్కడ విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎలక్షన్‌ పని తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ చేతగానితనానికి ప్రజలు శిక్ష అనుభవించాలా అని ఆయన ప్రశ్నించారు. తాను రేపు ఢిల్లికి వెళుతున్నానని దీనిపై ఇసిని అడుగుతానని ఆయన చెప్పారు. పని చేయని ఇవిఎంలపై ఇ.సి సమాధానం చెప్పాల్సిందేనని ఆయన అన్నారు. ఈవిఎంల రిపేరు చేస్తామని వచ్చే వారు రిపేరు చేస్తున్నారా? లేక వాటిని ట్యాంపర్‌ చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో వీవీప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్‌ వేస్తానని చంద్రబాబు తెలిపారు.

delhi 12042019

ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు? వారికి ఉన్న అర్హతలేంటో చెప్పాలని ఈసీని డిమాండ్‌ చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. వారిని ఎలా నియమించారని ప్రశ్నించనున్నట్లు పేర్కొన్నారు. వీవీప్యాట్‌ల మొత్తం లెక్కింపునకు ఆరు రోజులు పట్టడమేంటని సీఎం ప్రశ్నించారు. వీవీప్యాట్‌లోని స్లిప్‌లు లెక్కించడానికి ఆరు గంటలు మించదని వెల్లడించారు. గతంలో బ్యాలెట్‌ పత్రాలు లెక్కించే పద్ధతిలో ఎంత సమయం పట్టిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో తాను ఛాలెంజ్‌ చేస్తున్నానని, నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసిరారు. దీనిపై దేశ స్థాయిలో పోరాడేందుకు సిద్ధమని వెల్లడించారు.

delhi 12042019

అవసరమైతే ధర్నాలు, ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే పదవి అంగటి సరకులా తయారైందని, ప్రజాప్రతినిధుల భవిష్యత్‌ యంత్రాలపై ఆధారపడి ఉండడమేంటని సీఎం విమర్శించారు. ఏకధాటిగా రెండు గంటలపాటు యంత్రం పని చేయకపోతే రీపోలింగ్‌కు అవకాశముందని వివరించారు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసాలు సృష్టించారని, ప్రజాస్వామ్యాన్ని మర్డర్‌ చేస్తున్నారని ప్రతిపక్షాల పై చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను మరొక బీహార్‌ చేయాలని ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. అన్ని చోట్ల టిడిపి అభ్యర్థులపై దాడులు చేశారని ఆయన అన్నారు. సాంకేతిక లోపాల పేరుతో ఓటర్లతో ఆడుకున్నారని, ప్రజాస్వామ్యం భవిష్యత్‌ ఒక యంత్రంపై ఆధారపడుతుందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఒ) ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. సిఇఒకె ఇబ్బంది ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో నూటికి నూరు శాతం మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది. ఇందులో రెండో ఆలోచనలేదు. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు పోలింగ్‌ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు. కౌంటింగ్‌ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలి. స్ట్రాంగ్‌ రూంల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలి. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్‌తో వైకాపా పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడింది.

stronroom 1242019

ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనం. అర్ధరాత్రి 12గంటలు అవుతున్నా ఇంకా 200 బూత్‌లలో పోలింగ్‌ సాగుతోంది. మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈపరిస్థితి కల్పించారు. కార్యకర్తలు, ప్రజలే ఇవాళ ఓటింగ్‌ సరళిని కాపాడారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెదేపా పక్షాన నిలిచారు’’ అని చంద్రబాబు అన్నారు. ఇక మరో పక్క, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో గెలుపెవరిదో తేల్చే ఈవీఎంలు వివిధ జిల్లాల్లోని స్ట్రాంగ్ రూములకు చేరాయి. స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర రాష్ట్ర బలగాలు మూడంచెల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశాయి. తొలి దశలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తలుపులకు సీల్ వేసిన చోట సాయుధులైన కేంద్ర బలగాలు కాపలా ఉంటాయి.

stronroom 1242019

ఇది మొదటి దశ భద్రత. ఇక రెండో దశలో రాష్ట్ర పత్యేక బలగాలు కాపలా ఉంటాయి. మూడో దశలో స్ట్రాంగ్ రూములకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ, రాష్ట్ర పోలీసులు పహారా కాస్తుంటారు. ఇక ప్రధాన పార్టీల ఏజంట్లు కూడా స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా ఉండనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం కార్యకర్తలు ఫిఫ్ట్ ల వారీగా ఈవీఎంలకు కాపలా కాయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ కార్యకర్తలను ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద కాపలా ఉంచనుంది. మొత్తం 40 రోజుల పాటు ఈవీఎంలను భద్రతా దళాలు కాపాడనుండగా, వచ్చే నెల 23న వీటిని బయటకు తీసి, ఓట్లను లెక్కించనున్నారు.

ఎన్నికలకు సరైన భద్రత కల్పించలేకపోవడం వల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అంగీకరించారు. తగినంత భద్రతా బలగాలు కావాలని తాను, కలెక్టర్లు, ఎస్పీలు కోరినా ఎన్నికల సంఘం స్పందించలేదని ఆయన తేల్చారు. అందువల్లే హింసాత్మక సంఘటనలు, హత్యలు జరిగి పోలింగ్‌ను ప్రభావితం చేశాయని గురువారం మీడియాతో మాట్లాడుతూ ద్వివేది స్పష్టం చేశారు. ‘తాడిపత్రి, పూతలపట్టు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనల ప్రభావం పోలింగ్‌పై పడింది. తాడిపత్రిలో టీడీపీ సానుభూతిపరుడి హత్య జరిగిన తర్వాత అక్కడ పోలింగ్‌ మందగించింది. చిత్తూరులోని ఒక కేంద్రంలో మధ్యాహ్నం 3గంటలకే పోలింగ్‌ ఆపాల్సి వచ్చింది. రాష్ట్రంలో మొత్తంగా 25 చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

dvivedi 12042019

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఒకరు, చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెలో మరొకరు చనిపోయారు. రెండువర్గాల మధ్య కొట్లాటలు, రాళ్లు రువ్వుకోవడాలు, భౌతిక దాడులు జరిగాయి. ఘర్షణలు జరిగిన పోలింగ్‌ కేంద్రాలు, ఈవీఎంల మొరాయింపువల్ల పోలింగ్‌ ఆసల్యమైన చోట రీపోలింగ్‌ నిర్వహించే ప్రతిపాదనను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం’ అని చెప్పారు. ‘సిబ్బందికి అనేకసార్లు శిక్షణనిచ్చినప్పటికీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంపై చర్యలు తీసుకుంటాం. ఐదేళ్లకొకసారి వేసే ఓటును ఓటరు సద్వినియోగం చేసుకోవడానికి తలెత్తిన అడ్డంకుల్లో సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉంది. మొత్తం 381చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. 6 చోట్ల మాక్‌పోల్‌ ఓట్లను తొలగించకుండానే ఓటింగ్‌ కొనసాగించారు.

dvivedi 12042019

7చోట్ల ఈవీఎంల విధ్వంసం జరిగింది. మాక్‌పోలింగ్‌ సమయంలోనే కొన్ని ఈవీఎంలను మార్చాం. మరికొన్ని ఈవీఎంలను పోలింగ్‌ జరుగుతుండగా మార్చాల్సి వచ్చింది. నిర్ణీత సమయంలో ఈవీఎంలు మరమ్మతు చేయకపోవడం వల్ల కూడా ఉదయం పూట ఓటర్లకు సమయం వృథా అయింది. చాలాచోట్ల ఓటర్లు గంటలకొద్ది క్యూలో నిలబడాల్సి వచ్చింది. రీపోలింగ్‌కు, సర్దుబాటు పోలింగ్‌ (అడ్‌జర్న్‌డ్‌ పోలింగ్‌)కు వివిధ పార్టీల నుంచి వచ్చిన వినతులను, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు పంపాము. పాక్షికంగా పోలింగ్‌ జరిగిన చోట సర్దుబాటు పోలింగ్‌ నిర్వహిస్తాం. చిలకలూరిపేటలో రిగ్గింగ్‌ జరిగిందనే ఆరోపణలపై కలెక్టర్‌ను వివరణ అడిగాం. పూతలపట్టులో రీపోలింగ్‌కి అవకాశం ఉంది. మావోయిస్టు ప్రాంతాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరగడం సంతృప్తిగా ఉంది.’’ అని ద్వివేది చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read