వైసీపీలో అసమ్మతి జ్వాలలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. విజయవాడ పశ్చిమ సెగ్మెంట్‌లో ముస్లిం మైనారిటీలకు టికెట్ ఇవ్వాలంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆర్ఎస్ఎస్‌కు చెందిన వెల్లంపల్లి శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వొద్దంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు వీర్ల అప్పిరెడ్డి తదితరులు వచ్చి వైసీపీ కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. జగన్‌తో మాట్లాడేందుకు పది సార్లు హైదరాబాద్ లోటస్‌పాండ్‌కు వెళ్లినా కనీసం కలిసేందుకు అవకాశం ఇవ్వలేదంటూ ముస్లిం మైనారిటీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలను బుజ్జింగించిన అప్పిరెడ్డి.. జగన్ దగ్గరకు తీసుకెళతామని హామీ ఇచ్చారు.

radha 19032019

విజయవాడ పశ్చిమ నియోజకర్గం ముస్లిం మైనారిటీలకు సంబంధించిన సీటు అని, అలాంటి స్థానాన్ని ఆరెస్సెస్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారంటూ వైకాపా అసంతృప్త నేత ఎంఎస్‌ బేగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల తర్వాత పరిస్థితి సర్దుకుంటుందని అప్పిరెడ్డి చెప్పగా... బేగ్‌ మాత్రం ఈ విషయంపై పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఎలా స్పందిస్తారో చూశాక తన నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. ఒక్క గుంటూరు మినహా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడా ముస్లింలకు అవకాశం కల్పించలేదని విమర్శించారు. పొన్నూరు వైసీపీలోనూ అసంతృప్తి జ్వాలలు రాజుకున్నాయి. రావిని కాదని కిలారి రోశయ్యకు టికెట్ కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు విశాఖ జిల్లా యలమంచలి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన ముగ్గురు సమన్వయకర్తలు పార్టీకి రాజీనామా చేశారు.

radha 19032019

ప్రకాశం జిల్లా పర్చూరులో అసంతృప్త నేత రావి రామనాథంబాబు వైకాపాకు రాజీనామా చేసి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. పాలకొల్లు నేత గుణ్ణం నాగబాబు విజయవాడలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు. పాలకొల్లులో పోటీ చేసేందుకు తనకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. పవన్‌ కూడా నాగబాబును పాలకొల్లు జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. విశాఖ తూర్పు, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో టికెట్‌ దక్కని వైకాపా నేతలు వంశీకృష్ణ, కోళా గురువులు మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. పెడనలో రాంప్రసాద్‌, కొండపిలో అశోక్‌ ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి సిద్ధమవుతున్నట్లు వారి అనుచరులు చెబుతున్నారు.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సొంతగూటికి చేరేందుకు టీడీపీ అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారట. రెండు రోజుల్లో పసుపు కండువా కప్పుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. తనకు శ్రీశైలం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. శ్రీశైలం నుంచి తనకు అవకాశం కల్పిస్తే.. లోక్‌సభ అభ్యర్థి గెలుపునకు కలిసొస్తుందని చెబుతున్నారు. సీటు కేటాయించే అంశంపై టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోందట. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న బైరెడ్డి రాష్ట్ర విభజనకు ముందు పార్టీని వీడారు. తర్వాత రాయలసీమ హక్కుల కోసం పార్టీని స్థాపించారు. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో కూడా చేరారు.. ఆరు నెలల పాటూ పార్టీలో కొనసాగిన ఆయన.. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తిరిగి ఇప్పుడు సొంతగూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీతో చర్చలు సఫలమైతే రెండు రోజుల్లో బైరెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉందట.

radha 19032019

శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. తన నిర్ణయాన్ని అధినేత చంద్రబాబుకు చెప్పారు. తన బదులుగా.. తన తమ్ముడికి సీటు ఇవ్వాలని రాజశేఖర్‌రెడ్డి కోరుతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని.. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానంటున్నారు. బుడ్డా బరి నుంచి తప్పుకోవడంతో.. శ్రీశైలం టికెట్ టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డికి ఇచ్చేందుకు అధిష్టానం ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనపై అనుచరులతో చర్చించి, ఆలోచించి తన నిర్ణయాన్ని చెబుతానన్నారు సుబ్బారెడ్డి. ఆయన కూడా శ్రీశైలం నుంచి పోటీకి అంత సుముఖంగా లేరట. దీంతో బైరెడ్డి తనకు ఆ స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నారు.

‘‘పైన చంద్రబాబు ఉన్నారు. కింద క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు బలంగా పని చేస్తున్నాయి. మన గెలుపు ఖాయం!’’... ఇది తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు అభ్యర్థుల నమ్మకం! అది ఎంత బలంగా ఉందంటే... ప్రచారాన్ని కూడా ‘లైట్‌’గా తీసుకుని, ఎన్నికల వ్యూహాలను పక్కన పెట్టి, ఎంచక్కా ‘రిలాక్స్‌’ అయ్యేంత! మరోసారి అధికారంలోకి రావడం రాష్ట్రానికీ, పార్టీకీ ఎంతో ముఖ్యమని చంద్రబాబు రాత్రింబవళ్లు పనిచేస్తుండగా... చాలాచోట్ల అభ్యర్థులు మాత్రం అతివిశ్వాసంతో బిందా్‌సగా, కడుపులో చల్ల కదలకుండా పైపైన తిరుగుతున్నారని పార్టీ పెద్దల దృష్టికి వచ్చింది. టీడీపీ ఇప్పటికి 140 సీట్లలో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 35 స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో రోజుకు మూడు నాలుగు జిల్లాల్లో తిరుగుతూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అభ్యర్థులకు సంబంధించి జిల్లాల నేతలతో మాట్లాడటం, కొందరిని పిలిపించి బుజ్జగించడం వంటివి కూడా కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి దాటి 2 గంటల వరకు కూడా ఈ కసరత్తులో మునిగి తేలుతున్నారు.

తిరిగి ఉదయాన్నే లేచి ముందుగా ఖరారైన పర్యటనలకు వెళుతున్నారు. అధినేత ఆ వయసులో అంతగా శ్రమిస్తుండగా... అభ్యర్థుల్లో మాత్రం ఆ చురుకుదనం కనిపించడంలేదని ఆ పార్టీ శ్రేణుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పింఛను రెట్టింపు, పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి రెట్టింపు, అన్నదాత సుఖీభవ, కౌలు రైతులకూ సహాయం వంటి సంక్షేమ పథకాలతో క్షేత్ర స్థాయిలో తెలుగుదేశానికి ఆదరణ బాగా పెరిగింది. టీడీపీ అభ్యర్థులకు ఇది ఒక టానిక్‌లా మారింది. ఎక్కడికి వెళ్లినా ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ వాతావరణంలో తమ గెలుపు ఖాయమన్న మితిమీరిన నమ్మకంతో... ఎన్నికల్లో అసలు పనిని వదిలేసి పైపైన తిరుగుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో తిరుగుతూ ప్రచారం చేయడంతోపాటు.. అభ్యర్థులకు అనేక పనులు ఉంటాయి. సొంత పార్టీలో గుర్రుగా ఉన్న వారిని గుర్తించి, వారితో మాట్లాడి, మద్దతు సాధించాలి. సమస్యలు అపరిష్కృతంగా ఉన్న గ్రామాలు, వార్డులకు వెళ్లి స్థానికులకు నచ్చచెప్పాలి. సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇవ్వాలి.

ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధిపొందిన వారి వద్దకు స్వయంగా వెళ్లి... వారికి జరిగిన మేలు గురించి వివరించి, తమకే ఓటు వేయాలని కోరాలి. ప్రత్యర్థి పార్టీకి బలం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వ్యూహాలు రచించి, అమలు చేయాలి. వివిధ వృత్తులు, సామాజిక వర్గాల వారిని గుర్తించి వారితో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కోరడం సహజం. వెరసి... అభ్యర్థులకు క్షణం తీరికలేనంతగా ఎన్నికల పనిలో ఉండాలి. పైగా... ఈసారి పోలింగ్‌కు ఎక్కువ సమయం కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ... ఎక్కువ మంది ఎమ్మెల్యే అభ్యర్థులు చేయాల్సిన పనులేవీ చేయకుండా, పైపైన తిరిగి ప్రచారం అయిపోయిందని అనిపిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ‘‘అతి ధీమానే దీనికి కారణం. ఎక్కువగా కష్టపడకుండానే గెలిచిపోతామన్న నమ్మకం వచ్చింది. దీంతో పని చేయడం తగ్గించేశారు. విశ్రాంతిగా తిరుగుతున్నారు. ప్రత్యర్థి పార్టీల వారు భయంతో ఎక్కువ పని చేస్తుంటే... మా వాళ్లు ఎక్కువ నమ్మకంతో పని తగ్గించేస్తున్నారు’’ అని అభ్యర్థుల ప్రచారాన్ని సమన్వయం చేస్తున్న ఒక ఎమ్మెల్సీ వాపోయారు. ఎన్నికలు మొదటి దశలో రావడం వల్ల ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఖర్చు కూడా తగ్గిందని, ఆ సానుకూలతను అందిపుచ్చుకొని ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కొందరు వెనకబడిపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. గోదావరి జిల్లాల్లో ఒకరిద్దరు అభ్యర్థులు ఇంకా గ్రామాల్లో పర్యటనలు కూడా మొదలు పెట్టలేదని, నామినేషన్‌ వేసిన తర్వాత వెళతాం అని తాపీగా చెబుతున్నారని ఒక నాయకుడు తెలిపారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. నేలపాడులో కొత్తగా నిర్మించిన జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనంలో హైకోర్టు సోమవారం నుంచి విధులు ప్రారంభించింది. న్యాయవాదులు, చుట్టుపక్కల గ్రామస్థులు భారీగా తరలిరావడంతో కోర్టు ప్రాంగణం సందడిగా కనిపించింది. తొలిరోజు కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు కోర్టు విధుల కంటే గంట ముందుగానే భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తోపాటు మిగిలిన న్యాయమూర్తులకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, నేలపాడు గ్రామస్థులు సాదర స్వాగతం పలికారు. భవన సముదాయంలో ఏర్పాటైన హైకోర్టు అడ్వకేట్స్‌ అసోసియేషన్‌, మహిళా న్యాయవాదల అసోసియేషన్‌ హాళ్లను ప్రధాన న్యాయమూర్తి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం న్యాయమూర్తులు, ఏజీ తదితరులంతా తమకు కేటాయించిన చాంబర్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను సీజే ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించారు.

radha 19032019

నూతన భవనంలో తొలిరోజు విధులు కావడంతో న్యాయవాదులు భారీగా తరలివచ్చారు. కేసులు లేకపోయినా నూతన భవనాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. భవనం మొత్తం తిరుగుతూ ఏ అంతస్తులో ఏఏ విభాగాలున్నాయో తెలుసుకుంటూ, తక్కువ కాలంలో త్వరితగతిన నిర్మితమైన భవనం గురించి చర్చించుకుంటూ కనిపించారు. పని చేయని ఏసీలు: తొలిరోజు కోర్టు విధులు ప్రారంభమైనా సుమారు గంటపాటు వివిధ కోర్టుల్లో ఏసీలు పని చేయలేదు. దీంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు అల్లాడిపోయారు. అసలే వేసవి, అందులోనూ నల్లకోటు ధరించి ఉండడంతో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా ఎక్కడా ఆ అసంతృప్తి కనిపించనీయకుండా న్యాయమూర్తులు చిరునవ్వుతోనే విధులు నిర్వర్తించడం విశేషం. ఇదిలా ఉండగా గోవా ముఖ్యమంత్రి పర్రీకర్‌ మృతికి సంతాప సూచకంగా హైకోర్టు ముందున్న జాతీయ పతాకాన్ని అవనతం చేశారు.

radha 19032019

నేలపాడు రైతుల విందు... తమ ప్రాంతంలో హైకోర్టు ప్రారంభమైందన్న ఆనందంలో రాజధానికి భూములిచ్చిన నేలపాడు రైతులు సోమవారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. న్యాయమూర్తుల నుంచి కోర్టుకొచ్చిన అందరికీ సుమారు 2వేల మంది వరకూ వారు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ‘ఎలాంటి గుర్తింపు లేని మా ప్రాంతానికి సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంవల్ల రాజధాని అయింది. సరిగా బస్‌ సౌకర్యమే లేని మా గ్రామానికి వందల సంఖ్యలో బస్సులు, కార్లు, ఇతర వాహనాలు వచ్చిపోతుంటే ఆనందంతో నోట మాట రావడం లేదు’ అని వారు సంతోషం వ్యక్తం చేశారు.

 

 

Advertisements

Latest Articles

Most Read