ఆంధ్రప్రదేశ్‌కు జీవనరేఖ అయిన పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం భారీ కుట్రకు తెరతీసిందని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం బ్యాక్‌వాటర్‌ వల్ల ఎగువ రాష్ట్రంలోని ప్రాంతాలు ఎంతమేరకు ముంపునకు గురవుతాయో అధ్యయనం చేయకుండానే ప్రాజెక్టు నిర్మాణం సాగకూడదని, ఒకవేళ నిర్మాణం పూర్తయినా నీటిని నిల్వ చేయకుండా నిరోధించాలని ఈ నెల 11న సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్‌పై ఆంధ్ర ప్రదేశ్‌ ఆశ్చర్యపోతోంది. లక్ష్యం మేరకు నిర్మాణం సాగుతున్న ప్రస్తుత దశలో దానిని అడ్డుకునేలా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేసు వేసిందని ఆరోపించాయి. పోలవరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన కలిగిన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి నష్టమూ లేని మహారాష్ట్ర, కర్ణాటకలను కూడా 1980 నాటి గోదావరి జలాల వివాద ట్రైబ్యునల్‌లోని అంశాలను ఉటంకిస్తూ ఈ వ్యాజ్యంలోకి లాగడం ద్వారా ఆ రెండు రాష్ట్రాలూ ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా మాట్లాడేలా చేయాలనేది తెలంగాణ ప్రణాళికగా కనిపిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసాలను కూడా ఏపీకి వ్యతిరేకంగా మోహరించేలా చేయడం వెనుక అసలు కుట్ర వేరే ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

పైగా... ఇంకా ఎలాంటి నిర్మాణాలూ చేపట్టని భూపాలపట్నం హైడల్‌ ప్రాజెక్టు మునిగిపోతుందంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును తప్పుదోవపట్టించేలా వ్యాజ్యం వేసిందని అధికారులు అంటున్నారు. ప్రతిపాదిత భూపాలపట్నం హైడల్‌ ప్రాజెక్టు అభయారణ్య ప్రాంతంలో ఉందని, వన్యప్రాణి సంరక్షణ ప్రదేశంలో ఉన్నందున ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చే అవకాశమే లేదని ఒకవైపు అంగీకరిస్తూనే మరోవైపు ఈ ప్రాజెక్టు ప్రాంతం ముంపునకు గురికావడం వల్ల తమకు భవిష్యత్‌లో హైడల్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అవకాశం ఉండదంటూ గగ్గోలు పెట్టడంలో సహేతుకత ఏంటని ఏపీ ప్రశ్నిస్తోంది. భద్రాచలం మునిగిపోతుందంటూ ఆందోళన చేయడంలోనూ అర్థం లేదని ఏపీ కొట్టిపారేస్తోంది. పోలవరం స్పిల్‌వే ఎత్తు 145 అడుగులకు మించకుండా ఉండాలని, 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి మించకుండా ఉండాలని, కానీ 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో స్పిల్‌వే నిర్మాణం చేపట్టేందుకు సీడబ్ల్యూసీ అనుమతిచ్చిందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

తెలంగాణ వ్యాజ్యంలో ఏముంది? పోలవరం ప్రాజెక్టు వద్ద గరిష్ఠ వరదను, దాని ప్రభావాన్ని అంచనాగానీ, అధ్యయనంగానీ చేయకుండా ప్రాజెక్టు నిర్మాణం పనులు కొనసాగించడానికి ఏ విధమైన హక్కు, అర్హత లేదు. ప్రాజెక్టు వద్ద గరిష్ఠ వరద సంభావ్యతను, బ్యాక్‌వాటర్‌ ప్రభావం, సిడమెంటేషన్‌, పర్యావరణం మొదలైన అంశాలను అంచనా వేసే, అధ్యయనం చేసే బాధ్యతను పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌సకు అప్పగించాలి. ఈ సంస్థకు నదీ పరివాహక ప్రాంత రాష్ట్రాల (తెలంగాణ, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర)కు చెందిన చీఫ్‌ ఇంజనీర్లను, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ సంస్థలకు చెందిన చీఫ్‌ ఇంజనీర్లతో కూడిన సాంకేతిక బృందాన్ని తోడ్పాటు అందించేలా ఏర్పాటు చేయాలి. 2000 సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం అంచనా వేసిన ప్రభావిత ప్రాంతాలకు కట్టుబడి ఉండేలా మొదటి ప్రతివాది కేంద్ర ప్రభుత్వం, రెండో ప్రతివాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను నిర్దేశించాలి. తెలంగాణకు చెందిన మణుగూరు హెవీవాటర్‌ ప్లాంటు, భద్రాచలం దేవాలయం వంటి నిర్మాణాలకు గరిష్ఠ వరద వచ్చినప్పుడు ముంపునకు గురికాకుండా తగిన రక్షణ గోడలు నిర్మాంచేలా కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాలను ఆదేశించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వహణ, నియంత్రణను స్వయం ప్రతిపత్తిగల నిపుణుల బృందానికి అప్పగించాలి. ఈ బృందంలో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, పరివాహక ప్రాంత రాష్ట్రాలకు చెందిన అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులను నియమించాలి. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం గరిష్ఠ వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. పైన పేర్కొన్న అంశాలు పరిష్కారమయ్యేంత వరకూ పోలవరం జలాశయంలో నీటిని నిల్వ చేయకుండా కేంద్ర, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించాలి.

 

వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబ ఖిల్లాగా పేరొందిన కడప లోక్‌సభ స్థానంలో తెలుగుదేశం జెండాను రెపరెపలాడించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఫ్యాక్షన్‌ గడ్డపై శాంతి సాధనతో ఈదఫా ఎలాగైనా ఈ సీటు కైవసం చేసుకోవడానికి ఏడాది ముందే వ్యూహరచన చేశారు. ఈ కార్యసాధనలో జమ్మలమడుగు ఎమ్మెల్యే, మంత్రి ఆదినారాయణరెడ్డి కీలక భూమిక పోషించడమే గాక.. జగన్‌ తమ్ముడు అవినాశ్‌రెడ్డిని తానే స్వయంగా ఢీకొడుతున్నారు. వైఎస్‌ కుటుంబానికి 30 ఏళ్లుగా కంచుకోట కడప లోక్‌సభ స్థానం.. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పెట్టింది పేరు.. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1984లో టీడీపీ ఒక్కసారి మాత్రమే ఇక్కడ గెలిచింది. 1989 నుంచి 9 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే వైఎస్‌ కుటుంబానిదే విజయం. 4 సార్లు (1989, 91, 96, 98) వైఎస్‌ రాజశేఖరరెడ్డి వరుసగా గెలిచారు. రెండు సార్లు (1999, 2004) ఆయన తమ్ముడు వివేకానందరెడ్డి, మరో రెండు సార్లు (2009, 2011 ఉప ఎన్నిక) ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, 2014లో ఆయన తమ్ముడి కొడుకు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి గెలిచారు.

radha 19032019

ఈ దఫా అవినాశ్‌ మళ్లీ వైసీపీ నుంచి బరిలో నిలువగా.. మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీ తరపున పోటీచేస్తున్నారు. ఇదివరకటిలా ఈ సారి ఎన్నిక ఏకపక్షం కాబోదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీడీపీ జోరుమీద ఉండడమే గాక ఉక్కు కర్మాగారం కేంద్రం ఏర్పాటు చేయకున్నా జగన్‌ నోరుమెదకపోవడం.. రాష్ట్రప్రభుత్వమే సొంతంగా ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం.. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు అందించడం, చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలతో తొలిసారి వైఎస్‌ కంచుకోటను బద్దలు కొట్టగలమన్న ఆశాభావంతో ఉంది. అయినా వైఎస్‌ కుటుంబంపై ఉన్న ఆదరాభిమానాలే తనను మళ్లీ గెలిపిస్తాయని అవినాశ్‌ భావిస్తున్నారు. కడప లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపిక మొదలు.. ప్రచారం, వ్యూహ ప్రతివ్యూహాలను పూర్తిగా ఆది పర్యవేక్షిస్తున్నారు. మొదట గెలిచే అభ్యర్థులను గుర్తించి వారికే టికెట్లు కేటాయింపజేశారు. వివిధ సమీకరణలు, సామాజిక వర్గాలతో చర్చలు, ప్రచారంలో దూకుడు కనబరుస్తున్నారు. అవినాశ్‌ వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తన వైపు తిప్పుకొంటున్నారు.

radha 19032019

కడప లోక్‌సభ పరిధిలో కడప, బద్వేలు(ఎస్సీ), మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 14,56,623 మంది ఓటర్లు ఉన్నారు. సామాజిక వర్గాల పరంగా ఓట్లను చూస్తే అత్యధికంగా బీసీలే. తర్వాత రెడ్డి, ముస్లిం, ఎస్సీ తదితర వర్గాల ఓట్లు ఉన్నాయి. కడప లోక్‌సభలో విజయాన్ని పులివెందుల మెజారిటీయే ప్రభావితం చేస్తోంది. ఈసారి చంద్రబాబు కడప లోక్‌సభను కైవసం చేసుకునేందుకు ఓ ప్రయోగం చేశారు. మూడు దశాబ్దాల ఫ్యాక్షన్‌ వైరంతో నడిచిన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి ఏకతాటిపైకి వస్తే జమ్మలమడుగులో భారీ మెజారిటీ వస్తుందని.. అది పులివెందుల మెజారిటీతో సమానమైతే.. మిగతా ఐదుచోట్ల టీడీపీ కొద్ది మెజారిటీ సాధించినా కడప లోక్‌సభ సీటు టీడీపీ కైవసమవుతుందని భావించారు. వారిద్దరికీ రాజీకుదిర్చి.. ఆదిని లోక్‌సభకు, రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు నుంచి బరిలోకి దించారు. దాంతో వైసీపీ అభ్యర్థులు, నేతలు ప్రచారానికి వెళ్తే వెనక్కి వెళ్లాలని ముఖంపైనే చెప్పే పరిస్థితి వచ్చింది. టీడీపీకి కలిసొచ్చే అంశాలు.. ఆది, రామసుబ్బారెడ్డి వర్గాలు కలిసి పనిచేయడం.. ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన.. గండికోట ప్రాజెక్టు పునరావాసానికి ప్యాకేజీ... కృష్ణా జలాలు జిల్లాకు తీసుకురావడం... జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులకు నీరివ్వడం... పసుపు-కుంకుమ, రైతుకు పెట్టుబడి సాయం... పెన్షన్ల పెంపు, అన్నదాతా సుఖీభవ, రుణమాఫీ... వైసీపీ అభ్యర్థి అవినాశ్‌ ఐదేళ్లుగా ప్రజలకు అందుబాటులో లేకపోవడం.... వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యలో సొంతవాళ్ల ప్రమేయం ఉందన్న ఆరోపణలు.

 

అనంతపురం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న టీడీపీ అభ్యర్థులను సోమవారం అర్ధరాత్రి తర్వాత సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి, గుంతకల్లు అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు, కదిరి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు అవకాశం కల్పించారు. శింగనమల, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో కొత్త వారిని రంగంలోకి దింపారు. శింగనమలలో బండారు శ్రావణి, కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వరనాయడు పేర్లను ప్రకటించారు. జిల్లాలో బలంగా ఉన్నా పోటీ తీవ్రంగా ఉండడంతో అధికార పార్టీ అభ్యర్థుల ఖరారులో జాప్యం జరిగింది. నాలుగు రోజుల క్రితమే సీఎం సూచనప్రాయ అంగీకారంతో 12 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు వారివారి నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించారు. ఇందులో రాప్తాడు నుంచి మంత్రి పరిటాల శ్రీరామ్‌, రాయదుర్గం నుంచి మంత్రి కాలవ శ్రీనివాసులు, అనంతపురం నుంచి వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, ధర్మవరం నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ, పెనుకొండ నుంచి బీకే పార్థసారథి, కదిరి నుంచి కందికుంట వెంకటప్రసాద్‌, తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్‌రెడ్డి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, మడకశిర నుంచి ఈరన్న, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌ ప్రచారానికి తమతమ ఏర్పాట్లు చేసుకున్నారు. హిందూపురం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. అప్పటి నుంచి మూడు స్థానాల్లో ప్రతిష్ట్ఠంభన నెలకొంది.

radha 19032019

కళ్యాణదుర్గం, గుంతకల్లు, శింగనమల స్థానాల్లో సిట్టింగులపై వచ్చిన సర్వేలు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ అభ్యర్థులను ఖరారు చేయడంలో సీఎం చంద్రబాబు మల్లగుల్లాలు పడ్డారు. గెలుపు గుర్రాల కోసం ఆరా తీశారు. పలుమార్లు ఆ స్థానాలకు ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు నిర్వహించారు. ఆ మూడు చోట్లా సిట్టింగు ఎమ్మెల్యేలైన హనుమంతరాయ చౌదరి, యామినీబాల, జితేంద్రగౌడ్‌ తిరిగి తమకే అవకాశం కల్పించాలని పట్టుబట్టారు. అమరావతిలోనే మకాం వేశారు. ఈ నే పథ్యంలో ఆ మూడు స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేయకుండా అధిష్ఠానం పెండింగ్‌లో పెట్టింది. ఇదే అదునుగా భావించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అమరావతికి చేరుకుని తమ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కొందరు సిట్టింగులను మార్చాల్సిందేనని, అలా మార్చకపోతే తాము వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండబోమని టీడీపీ అధిష్ఠానానికి సంకేతాలు పంపించారు. గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తా, శింగనమలలో బండారు శ్రావణి, కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వరనాయుడు, అనంతపురంలో అమిలినేని సురేంద్రబాబు పేర్లను ఆయన సూచించారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో తాము సూచించిన అభ్యర్థులతో మాట్లాడి సీ ఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేశారు.

radha 19032019

ఈ క్రమంలో కళ్యాణదుర్గం, అనంతపురం, శింగనమలలో టీడీపీ అధిష్ఠానం ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు నిర్వహించింది. శింగనమలలో మూడురోజుల క్రితం వచ్చిన ఈ సర్వేలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే యామినీబాల, ఎంపీ జేసీ సిఫార్సు చేసిన బండారు శ్రావణి పేర్లు వినిపించా యి. కళ్యాణదుర్గంలో బోరేపల్లి మల్లికార్జున, ఉమామహేశ్వరనాయుడు, అనంతపురంలో ప్రభాకర్‌ చౌదరి, సురేంద్రబాబు పేర్లు వినిపించాయి. టీడీపీ అధిష్ఠానంపై ఎంపీ దివాకర్‌రెడ్డి ఒత్తిడి మేరకు అభ్యర్థుల మార్పుపై ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు నిర్వహించగా అందులో వచ్చిన ఫలితాలనూ, సీఎం చంద్రబాబు వద్ద ఉన్న సర్వేలనూ బేరీజు వేసుకుని చివరగా అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించారు. అనంతపురం స్థానానికి అమిలినేని సురేంద్రబాబు పేరు ఎంపీ జేసీ సూచించినా ఆయన అక్కడి నుంచి పోటీచేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. గుంతకల్లు నుంచి మధుసూదన్‌ గుప్తా పేరు సూచించినా అక్కడ బీసీలకే అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. శింగనమలలో ఎంపీ జేసీ సూచించిన బండారు శ్రావణి, కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వర నాయుడు పేర్లను సీఎం ఖరారు చేశారు. అనంతపురంలో ప్రభాకర్‌చౌదరి, కదిరిలో కందికుంట వెంకటప్రసాద్‌ను రంగంలోకి దించారు. టికెట్లు లభించని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్‌పై భరోసా కల్పించినట్టు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ అనుమానిస్తున్న ఆయన అనుచరులపై దృష్టిపెట్టింది. వివేకా అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గంగిరెడ్డితో పరమేశ్వర్‌రెడ్డి చేతులు కలిపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరులోని ఓ భూవివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య గొడవ జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రూ.125 కోట్ల సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఈ డీల్‌లో రూ.1.5 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తోంది. గత నాలుగు రోజులుగా గంగిరెడ్డిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకు 15 రోజుల ముందే రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

radha 19032019

ఇదిలా ఉంటే వివేకా హత్యకు ముందు పెంపుడు కుక్క కూడా అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లుగా పోలీసులు గుర్తించారు. హత్యకు వారం ముందు కూడా ‘బీ కేర్‌ఫుల్‌’ అంటూ వివేకాకు అజ్ఞాతవ్యక్తి మెసేజ్‌ పంపారు. ఆ మెసేజ్ పంపింది ఎవరు? ఎందుకు పంపారు? అన్న విషయంపై కూడా సిట్ కూపీ లాగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న పరమేశ్వర్‌రెడ్డిని రాత్రి తిరుపతి ఆస్పత్రిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరమేశ్వర్‌రెడ్డి భార్య, కుమారుడు అడ్డుకునేందుకు యత్నించగా సిట్‌ అధికారులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వివేకా హత్య తర్వాత పరమేశ్వర్‌రెడ్డి పులివెందుల నుంచి అదృశ్యమయ్యారు.

radha 19032019

వివేకా హ‌త్య వెనుక ఆర్ధిక లావాదేవీలు, భూముల వ్య‌వ‌హారం వాటి క్ర‌య‌విక్ర‌యాల పై సిట్ బృధం దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలో మ‌రో సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వేముల మండ‌లం దుగ్గ‌న్న ప‌ల్లెకు చెందిన ఓ వ్య‌క్తికి, వివేకానంద‌రెడ్డి ఆస్తుల‌కు సంబంధించి ప‌వ‌ర్ ఆఫ్ అటార్ణీ ఉన్న‌ట్లు సిట్ ద‌ర్యాప్తులో తేలింది. అత‌నే వివేకాకు సంబంధించి ఆస్తుల విష‌యంలో క్ర‌య విక్ర‌యాల వ్య‌వ‌హారాలు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ క్ర‌మంలో వివేకానంద‌రెడ్డి పేరిట వేముల మండ‌లంలో ఉన్న ఆస్తి విక్ర‌యం వేంప‌ల్లి స‌బ్‌రిజిస్టార్ కార్యాల‌యంలో జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు వేంప‌ల్లి స‌బ్‌రిజిస్టార్ కార్యాల‌యంలో విచార‌ణ మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో వివేకానంద‌రెడ్డి ఆస్థి తాలూకు క్ర‌య‌విక్ర‌యాల‌కు సంబంధించి డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక మ‌రోవైపు వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణంతో ఆయ‌న పేరిట ఉన్న ప‌వ‌ర్ ఆఫ్ అటార్ణీ ర‌ద్దు అయిన‌ట్లేన‌ని స‌బ్‌రిజిస్టార్ కార్యాల‌యం తెలిపింది. దీంతో వివేకానంద‌రెడ్డి హ్య‌త్య కేసు రోజుకో మ‌లుపుతిరుగుతుంద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read