పనీ పాట లేని వాడు, ఏమి చేస్తాడు. అలా టైం పాస్ చేస్తూ, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడు. మన ప్రతి పక్షం కూడా అంతే. మొన్నటి దాక అంటే ఎన్నికలు లేవు కాబట్టి, ఎదో చేసారు అంటే అర్ధముంది. ఇప్పుడు కూడా, ఎన్నికలు 20 రోజుల్లో ఉన్నాయి అనగా కూడా, పిచ్చి పిచ్చి మార్ఫింగ్ లు, ట్రోలింగ్ లు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. ఎందుకంటే, వీళ్ళకు అసలు ప్రజా సమస్యలు మీద మాట్లాడటానికి ఏమి లేవు. ప్రజల్లోకి ఎలా, ఏ సమస్య పై వెళ్ళాలో కూడా అర్ధం కావటం లేదు. చంద్రబాబు అన్ని పనులు చేసేసారు మరి. అందుకే, ప్రజలకు సంబంధం లేని టాపిక్ లు పట్టుకుని. హడావిడి చేస్తున్నారు. ఇందులో ఒకటి పసుపు కుంకుమ పై తెలుగుదేశం చేస్తున్న ప్రచారం. దీని పై ఇప్పుడు ఆ గో మాత రైతు, తీవ్రంగా స్పందించారు.

yeddu 17032019

తన గోమాతను ఎద్దుగా ప్రచారం చేస్తున్న గాడిదలెవరంటూ ఓ రైతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే శారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం కోలవెన్నుకు చెందిన రైతు మండవ వెంకటేశ్వరరావు శనివారం మాట్లాడారు. ఇటీవల టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ మహిళ గోమాతకు పూజ చేస్తున్న దృశ్యాన్ని ప్రసార మాధ్యమాల్లో చూసి ఆవు స్థానంలో ఎద్దును పెట్టారంటూ బీజేపీ నేతలు ట్వీట్‌ చేశారన్నారు. ముందు వెనుకలు చూడకుండా దాన్ని వైసీపీకి చెందిన పత్రికలో యథాతథంగా ముద్రించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తప్పుడు ట్వీట్లు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ శనివారం విడుదల చేసింది. రెండో జాబితాను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రేపు(ఆదివారం) ఇడుపులపాయలో ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభ అభ‍్యర్థుల తొలి జాబితాను ప్రకటన అనంతరం పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ... రాబోయే ఎన్నికలలో తమ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌, కోర్ కమిటీ అన్ని రకాలుగా చర్చించి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్లు తెలిపారు. మంచి ముహుర్తం అని చెప్పడంతో ఇవాళ తొమ్మిదిమందితో తొలి జాబితా, మిగిలిన స్థానాలను రేపు ఇడుపులపాయలో వైఎస్‌ జగన్‌ ప్రకటిస్తారని తెలిపారు.

jagan 16032019

ప్రస్తుతం ప్రకటించిన తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాలో గత ఎన్నికల్లో విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. అలాగే ఇద్దరి మహిళలకు అవకాశం కల్పించారు. విడుదల చేసిన తొలి జాబితాలో రెండు ఓసీ, ఒక ఎస్టీ, మూడు బీసీ, మూడు ఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్ సీపీ ప్రాతినిధ‍్యం కల్పించింది. అరకు - గొడ్డేటి మాధవి, అమలాపురం- చింతా అనురాధ, రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, కడప- వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, హిందుపురం - గోరంట్ల మాధవ్, అనంతపురం - తలారి రంగయ్య, బాపట్ల - నందిగం సురేష్‌, చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప, కర్నూలు - డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌.

తమ కాల్‌సెంటర్లలో వరుసగా నాలుగోరోజూ దిల్లీ పోలీసులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ దిల్లీలోని ఎన్నికల కమిషన్‌ ప్రధాన కార్యాలయం ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఆందోళనకు దిగింది. దిల్లీలో 30 లక్షల ఓట్లు గల్లంతు కావడానికి భాజపానే కారణమని ఆరోపించింది. ఆ విషయమై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను అద్దెకు తీసుకున్నామని చెబుతోంది. భాజపా చెప్పినట్లు చేస్తున్న దిల్లీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, పలువురు ఆప్‌ అభ్యర్థులు.. శుక్రవారం భారత ఎన్నికల ప్రధాన కమిషనరు(సీఈసీ) సునీల్‌ అరోడా సహా మొత్తం ముగ్గురు కమిషనర్లను కలిశారు.

magunta 16032019

సీఈసీని కలసి వచ్చిన గంటలోపే పోలీసులు నాలుగోసారి కాల్‌సెంటర్‌పై దాడి చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్‌ నాయకులు ‘ఈసీ’ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మూడు గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఈసీ దిగివచ్చింది. దిల్లీ పోలీసులు, ఆప్‌ నాయకులతో పరిస్థితిని సమీక్షించింది. సమావేశం అనంతరం మనీశ్‌ సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ దిల్లీ పోలీసుల ప్రమేయం లేకుండా కాల్‌సెంటర్‌ ఉదంతంపై దర్యాప్తు జరపడానికి ఈసీ అంగీకరించిందని చెప్పారు. మరోవైపు తమ కాల్‌సెంటర్లపై ‘సీఈసీ’ ఎందుకు దాడులు చేయిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

magunta 16032019

వాస్తవానికి భాజపా నాయకులు శుక్రవారం ఉదయమే అరోడాను కలిశారు. కాల్‌సెంటర్లు పెట్టి ఓటర్ల జాబితాపై ఓటర్లను ఆప్‌ తప్పుదారి పట్టిస్తోందని ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్‌ తదితరులపై పరువునష్టం కేసు.. ‘భాజపా’ లక్షల ఓట్లు తొలగించిందని వ్యాఖ్యానించిన కేజ్రీవాల్‌, ఇతర ఆప్‌ నాయకులపై పరువునష్టం కేసు దాఖలైంది. దిల్లీ యూనిట్‌కు చెందిన భాజపా నాయకుడు రాజీవ్‌ బబ్బర్‌ ఫిర్యాదు మేరకు దిల్లీ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ శుక్రవారం సమన్లు జారీ చేశారు.a

శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అభిమానుల అభీష్టం మేరకు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ లేఖను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావుకు పంపించారు. తెలుగుదేశం జాతీయ కమిటీ ఉపాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖ పంపించారు. తన శాసనమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ శాసనమండలి చైర్మన్‌కు లేఖను పంపించినట్లు మాగుంట వెల్లడించారు.

magunta 16032019

మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే టీడీపీని వీడిన నేతలంతా ఆ పార్టీతో పాటు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తుంటే.. మాగుంట మాత్రం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. వైఎస్‌తో ఉన్న అనుబంధంతోనే వైసీపీలో చేరుతున్నానని ఆయన తెలిపారు. తనకు చంద్రబాబుతో 37 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. తనకు ఆయన ఎంతో సహకరించారని.. తాను ఎంపీగా ఓడినా కూడా ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం ఇచ్చారని మాగుంట కొనియాడారు.

Advertisements

Latest Articles

Most Read